టీజీఎస్ఆర్టీసీ కార్తీక మాసం స్పెషల్.. బడ్జెట్ ధరలో శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు!

కార్తీక మాసం సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ భక్తులకు శుభవార్త అందించింది. శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

Published on: Nov 1, 2025, 20:02:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక మాసం శివుడికి ఎంతో ఇష్టమైనది. ఈ మాసంలో నదీ స్నానాలు, ఆలయాల సందర్శన ఎక్కువగా చేస్తారు. చాలా మంది భక్తులు శైవ క్షేత్రాలను దర్శించుకుంటారు. అయితే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రసిద్ధ పంచారామాలకు, శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

కార్తీక మాసం ప్రత్యేక బస్సులు
కార్తీక మాసం ప్రత్యేక బస్సులు

మరిన్ని వివరాలకు మీ సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ బస్ డిపో మేనేజర్‌ను సంప్రదించండి. హెల్ప్ లైన్ నెంబర్లకు కూడా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. 040-23450033, 040-69440000 నెంబర్లను సంప్రదించాలి.

అమరావతి అమరేశ్వరాలయం, భీమవరం సోమేశ్వరాలయం, పాలకొల్లు క్షీర రామలింగేశ్వరాలయం, ద్రాక్షారామం భీమేశ్వరాలయం, సామర్లకోట కుమార రామ భీమేశ్వరాలయం.. పంచారామాల దర్శనం ఉంటుంది. అయితే మీ సమీపంలోని బస్ డిపో మేనేజర్‌ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

అంతేకాదు అరుణాచలం గిరి ప్రదక్షిణకు కూడా వెళ్లేందుకు కూడా టీజీఎస్ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. అయితే స్థానికంగా ఈ టూర్‌కి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. పరిగి నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణ టూర్ ఉంది. నవంబర్ 3వ తేదీన బస్సు బయలుదేరుతుంది. కాణిపాకం, వేలూరి మహాలక్ష్మి ఆలయం గోల్డెన్ టెంపుల్, అరుణాచలం గిరి ప్రదక్షిణం చేస్తారు. మూడు రోజుల యాత్రకు టికెట్ ధర రూ.2000గా ఉంది.

వికారాబాద్, తాండూరు ప్రయాణికుల కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. శ్రీశైలం, పంచారామాలు, అరుణాచలం వెళ్లాలి అనుకునేవారు బుకింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలిసిన 30 మంది ఒకే దగ్గర ఉంటే కూడా బస్ బుక్ చేసుకుంటే దానికి అనుగుణంగా తేదీని నిర్ణయిస్తారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెంబర్‌ 8309348157 కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More