నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం - నీటిలో మునిగి నలుగురు యువకులు మృతి!

SRSP Nizamabad Drowning Incident : నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు నీటిలో మునిగిపోయారు. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీయగా…. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Published on: Jul 28, 2026, 12:53:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

SRSP Nizamabad Drowning Incident : నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ) వద్ద తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రాజెక్ట్ వద్దకు వెళ్లిన నలుగురు యువకులు అనుకోకుండా నీటి ప్రవాహంలో చిక్కుకుని మునిగిపోయారని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు యువకుల మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. గల్లంతైన మరో నాలుగో వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

నిజామాబాద్ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం
నిజామాబాద్ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం

స్థానిక సమాచారం మేరకు…. సదరు నలుగురు యువకులు సరదాగా గడపడానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్దకు వచ్చి నీటిలోకి దిగారు. నీటి లోతు, ప్రవాహ తీవ్రతను అంచనా వేయలేకపోవడంతో ఒక్కసారిగా లోతుల్లోకి జారుకుని మునిగిపోయారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ జిల్లా పోలీసులు, ప్రత్యేక సహాయక (రెస్క్యూ) బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ సిబ్బంది ప్రాజెక్ట్ నీటి నుంచి ముగ్గురు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. నీటిలో కొట్టుకుపోయిన నాలుగో యువకుడి ఆచూకీ కోసం గాలించేందుకు ప్రత్యేక బోట్లు… ఈతగాళ్లతో జల్లెడ పడుతున్నారు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన నలుగురు యువకుల గుర్తింపునకు సంబంధించి పోలీసులు ప్రాథమిక వివరాలు వెల్లడించారు. మరణించిన వారిలో ముగ్గురు యువకులు నిజామాబాద్ పట్టణ పరిధిలోని ఆర్షపల్లి ప్రాంతానికి చెందినవారు కాగా… నాలుగో యువకుడు హైదరాబాద్ నివాసిగా అధికారులు గుర్తించారు. సరదాగా గడిపేందుకు వచ్చి ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదచ్ఛాయలు అలముకున్నాయి.

నీటి నుంచి వెలికితీసిన ముగ్గురు యువకుల మృతదేహాలను పంచనామా అనంతరం శవపరీక్ష (పోస్ట్‌మార్టం) నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు నిజామాబాద్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More