Hyderabad ORR : ఓఆర్‌ఆర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం -లారీని ఢీకొట్టిన ఆటో, ముగ్గురు మృతి

Hyderabad ORR Road Accident : ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ వద్ద ఆటో-డీసీఎం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Published on: Nov 8, 2026, 12:34:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Hyderabad ORR Road Accident :హైదరాబాద్ నగర శివార్లలో అర్థరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అప్పా జంక్షన్ వద్ద వేగంగా వస్తున్న ఆటో, ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా….. మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

ORRపై ఘోర రోడ్డు ప్రమాదం
ORRపై ఘోర రోడ్డు ప్రమాదం

ఎగ్జిట్ వద్ద ప్రమాదం…

ప్రమాద సమయంలో ఆటోలో పెయింటింగ్ పనులు ముగించుకుని తిరిగి వస్తున్న కార్మికులు ఉన్నారు. వీరంతా శంషాబాద్ వైపు నుంచి మొయినాబాద్‌కి ప్రయాణిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి అప్పా జంక్షన్ వద్ద ఎగ్జిట్ అవుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.

సాధారణంగా పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను తీసుకెళ్లాల్సిన ఆటోలో ఏకంగా 15 మందికిపైగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, రాత్రి వేళ కావడం వల్ల అదుపుతప్పి ముందు వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

స్థానికులు, తోటి వాహనదారులు అందించిన సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి నిలకడగా లేకపోవడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని సురేశ్‌, పెంటయ్య, లింగరాజుశెట్టిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై ఆరా తీస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More