సంగారెడ్డి జిల్లాలో విషాదం - కల్వర్టు గుంతలో పడి ముగ్గురు మృతి
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైకుపై వెళ్తూ నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడిన ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన నారాయణఖేడ్ శివారులో జరిగింది.
సంగారెడ్డి జిల్లాలో కల్వర్టు గుంతలో పడి ముగ్గురు మృతి ప్రాణాలు కోల్పోయారు. బైకుపై వెళ్తూ నిర్మాణంలో ఉన్న పడిపోగా ఈ ఘటన జరిగింది. నారాయణఖేడ్ శివారులోని నిజాంపేట్-బీదర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ముగ్గురు మృతి…!
ప్రాథమిక వివరాల ప్రకారం…. నారాయణఖేడ్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన అవుటి నర్సింహులు(27), జిన్న మల్లేష్(24), జిన్న మహేష్(23) అనే ముగ్గురు యువకులు నారాయణపేట నుంచి నర్సాపూర్ వైపు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నిజాంపేట-బీదర్ జాతీయ రహదారిపై కొత్తగా నిర్మిస్తున్న 160బి హైవేపై కల్వర్టు కోసం తవ్విన గుంతలో పడిపోయారు.
కల్వర్టు గుంతలో పడిన ముగ్గురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు వద్ద సరైన హెచ్చరిక బోర్డులు, సిగ్నల్స్ లేకపోవడం, అలాగే రోడ్డుపై గ్రావెల్ ఉండటంతో బైకు స్కిడ్ అయినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. వేగంగా వచ్చిన బైకు అదుపు తప్పి నేరుగా కల్వర్టు గుంతలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కంది దగ్గర NH 65పై రోడ్డు ప్రమాదం:
ఇక సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా ప్రయాణిస్తున్న ఒక టిప్పర్ లారీ, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ భారీ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ప్రాథమిక వివరాల ప్రకారం…. సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సుమారు 60 మంది ప్రయాణికులతో సంగారెడ్డి పట్టణం నుంచి పటాన్‌చెరు వైపు వెళ్తోంది. బస్సు కంది మండల కేంద్రానికి చేరుకోగానే అదే సమయంలో ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బస్సు ముందు భాగం కొంతమేర దెబ్బతింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

