హైదరాబాద్ : ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులతో ఈ రూట్‌లో 9 నెలలు ట్రాఫిక్ మళ్లింపు
జాతీయ రహదారి 44పై ప్యారడైజ్ జంక్షన్-డైరీ ఫామ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు మెుదలుకానున్నాయి. దీంతో 9 నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపు ఉండనుంది.
జాతీయ రహదారి 44పై ప్యారడైజ్ జంక్షన్-డైరీ ఫామ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు మెుదలుకానున్న నేపథ్యంలో ఈ నెల 30.10.2025 నుంచి ట్రాఫిక్ మళ్లింపు ఉండనుంది. దాదాపు తొమ్మిది నెలల పాటు ట్రాఫిక్ పనులు నడవనున్నాయి. ఈ మేరకు అధికారులు ట్రాఫిక్ మళ్లింపు గురించి వివరాలు వెల్లడించారు.

సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ జంక్షన్ నుండి NH-44లోని డైరీ ఫామ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను సులభతరం చేయడానికి అక్టోబర్ 30 నుండి దాదాపు తొమ్మిది నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు. రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్, బాలంరాయి మధ్య రెండు వైపులా మార్గాన్ని మూసివేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకోవాలని సూచించారు.
బాలానగర్ వైపు నుండి పంజాగుట్ట/ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ట్రాఫిక్ తాడ్‌బండ్, మస్తాన్ కేఫ్, డైమండ్ పాయింట్, ముడ్‌ఫోర్ట్, NCC ప్రధాన కార్యాలయం, JBS, SBI మీదుగా వెళ్ళవచ్చు.
సుచిత్ర వైపు నుండి పంజాగుట్ట/ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ట్రాఫిక్ సేఫ్ ఎక్స్‌ప్రెస్, బాపూజీనగర్, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, ముడ్‌ఫోర్ట్, JBS, SBI ద్వారా మార్గాన్ని ఉపయోగించవచ్చు.
ట్యాంక్ బండ్/రాణిగంజ్/పంజాగుట్ట/రసూల్‌పురా/ప్లాజా నుంచి సీటీఓ జంక్షన్ మీదుగా తాడ్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ వద్ద అన్నానగర్, బలంరాయ్, తాడ్‌బండ్ వైపు మళ్లిస్తారు.
అన్నానగర్ నుండి పంజాగుట్ట/ట్యాంక్ బండ్ వైపు వెళ్లాలనుకునే వాహనదారులు రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ వైపు వెళ్లకుండా.. బైలేన్‌లను (మీటింగ్ పాయింట్ బైలేన్, హాకీ గ్రౌండ్ బైలేన్ మరియు పోలీస్ స్టేషన్ బైలేన్) ఉపయోగించాలని సూచించారు. ప్రత్యామ్నాయంగా బాలంరాయ్ ద్వారా వెళ్ళవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


