Telangana intermediate results 2026 LIVE: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. tgbie.cgg.gov.inలో చూడండి

By , Hyderabad

TS Telangana Inter 1st 2nd Year Result 2026 tgbie.cgg.gov.in: విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026 విడుదల అయ్యాయి. ఈరోజు(ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.

Summary

TG Inter Results 2026 1st year and 2nd Year : తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026 విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్లు tgbie.cgg.gov.in, అలాగే results.cgg.gov.in వెబ్ సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక వార్షిక పరీక్షలు జరిగాయి. సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,89,126 మంది మొదటి సంవత్సరం, 5,07,949 మంది రెండో సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూశారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026
తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026

Telangana Inter 1st, 2nd Year Results 2026 : తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ బోర్డు ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. లక్షలాది మంది విద్యార్థులు తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026 కోసం వెయిట్ చేశారు.

...Read More

Follow all the updates here:
Apr 12, 2026, 11:56:58 IST

మార్కుల మెమోలో తప్పులుంటే?

ఆన్‌లైన్ మెమోలో పేరు, గ్రూపు లేదా మార్కులలో ఏవైనా పొరపాట్లు ఉంటే, ఫలితాలు విడుదలైన 10 రోజులలోపు ప్రిన్సిపాల్ ద్వారా లేదా బోర్డు హెల్ప్‌డెస్క్‌కు (helpdesk-ie@telangana.gov.in) ఫిర్యాదు చేయాలి. ఆ గడువు దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులను బోర్డు స్వీకరించదు.

Apr 12, 2026, 11:56:47 IST

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో తప్పిన విద్యార్థుల కోసం మే 13, 2026 నుండి మే 22, 2026 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇవి రెండు సెషన్లలో జరుగుతాయి. దీనికి సంబంధించిన పరీక్ష ఫీజును కూడా ఏప్రిల్ 13 నుండి 20 మధ్యలో తమ కాలేజీల్లో చెల్లించాల్సి ఉంటుంది. ప్రాక్టికల్ పరీక్షలు కూడా మే 22 తర్వాత రెండు సెషన్లలో నిర్వహించబడతాయి.

Apr 12, 2026, 11:56:37 IST

రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ వివరాలు

తమ మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థుల కోసం బోర్డు రెండు రకాల అవకాశాలను కల్పించింది. దీని కోసం ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 20 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు.

రీ-కౌంటింగ్: ఒక్కో పేపరుకు రూ.100 చెల్లించాలి. ఇందులో కేవలం మార్కుల లెక్కింపును మాత్రమే మరోసారి సరిచూస్తారు.

రీ-వెరిఫికేషన్ (స్కాన్డ్ కాపీ): ఒక్కో పేపరుకు రూ.800 చెల్లించాలి. ఇందులో విద్యార్థికి తన సమాధాన పత్రం స్కాన్డ్ కాపీని అందజేస్తారు, అలాగే మార్కుల లెక్కింపును కూడా తనిఖీ చేస్తారు.

Apr 12, 2026, 11:26:36 IST

గ్రేడ్ల వారీగా వివరాలు

సెకండియర్ జనరల్ రెగ్యులర్ విద్యార్థులలో 'ఏ' గ్రేడ్ (75 శాతం కంటే ఎక్కువ మార్కులు) సాధించిన వారు 2,13,179 మంది ఉన్నారు. ఇది విద్యార్థుల ప్రతిభకు అద్దం పడుతోంది.

'B' గ్రేడ్ (60 శాతం నుండి 75 శాతం) 69,641 మందికి లభించింది. వొకేషనల్ స్ట్రీమ్‌లో కూడా ఈసారి మెరుగైన ఫలితాలు వచ్చాయి, సెకండియర్‌లో 71.15 శాతం మంది పాస్ అయ్యారు.

Apr 12, 2026, 11:25:55 IST

ఫస్ట్ ఇయర్ ఫలితాలు ఇలా

ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంపీసీ (75.51 శాతం), బైపీసీ (72.39 శాతం) విద్యార్థులు రాణించగా, హెచ్ఈసీ విద్యార్థులు కేవలం 34.34 శాతంతో వెనుకబడ్డారు.

Apr 12, 2026, 11:25:16 IST

హెచ్‌ఈసీ ఉత్తీర్ణత శాతం

HEC: 49.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Apr 12, 2026, 11:24:58 IST

సీఈసీ ఉత్తీర్ణత శాతం

CEC: 49.39 శాతానికి పరిమితమైంది.

Apr 12, 2026, 11:24:38 IST

ఎంఈసీ ఉత్తీర్ణత శాతం

MEC: 67.91 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

Apr 12, 2026, 11:24:20 IST

బైపీసీ ఉత్తీర్ణత శాతం

BPC: 76.04 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది.

Apr 12, 2026, 11:24:03 IST

ఎంపీసీ ఉత్తీర్ణత శాతం

MPC: 78.01 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది.

Apr 12, 2026, 11:23:12 IST

సైన్స్ గ్రూపు విద్యార్థుల ఫలితాలు

ఈ ఏడాది కూడా సైన్స్ గ్రూపు విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. వారి ఉత్తీర్ణత శాతం బాగుంది.

Apr 12, 2026, 11:22:03 IST

జనరల్ స్ట్రీమ్ ఫలితాల విశ్లేషణ

2026 ఫలితాల్లో జనరల్ స్ట్రీమ్ సెకండియర్‌లో మొత్తం 4,11,474 మంది విద్యార్థులు హాజరుకాగా, 3,11,112 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికల ఉత్తీర్ణత శాతం 81.78 కాగా, బాలురు 68.99 శాతంతో సరిపెట్టుకున్నారు. దాదాపు 12 శాతం వ్యత్యాసంతో బాలికలు ముందంజలో ఉన్నారు. ఇక ఫస్ట్ ఇయర్ విషయానికి వస్తే 4,41,864 మందికి గాను 2,95,780 మంది (66.94%) గట్టెక్కారు.

Apr 12, 2026, 11:21:27 IST

ఇంటర్ ఫలితాల ఐదేళ్ల డేటా ఇలా

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) 2026 మార్చి పరీక్షల ఫలితాలను ప్రకారం.. గత ఐదేళ్ల డేటాను పరిశీలిస్తే, ఈ ఏడాది జనరల్ స్ట్రీమ్ సెకండియర్‌లో అత్యధికంగా 75.61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 2022లో ఇది 68.68 శాతంగా ఉండగా, క్రమంగా పెరుగుతూ ఈ స్థాయికి చేరడం విద్యార్థుల అకాడమిక్ పెర్ఫార్మెన్స్ మెరుగుపడిందని సూచిస్తోంది. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కూడా 66.94 శాతం ఉత్తీర్ణత నమోదై, గత ఏడాది (66.91 శాతం) కంటే స్వల్ప వృద్ధిని కనబరిచింది.

Apr 12, 2026, 11:21:13 IST

TS Inter Results 2026 Released : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

TS Inter Results 2026 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. అధికారులు తాజాగా ఫలితాలను విడుదల చేశారు. tgbie.cgg.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్ చూడండి.

Apr 12, 2026, 11:09:18 IST

ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Apr 12, 2026, 11:04:51 IST

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Apr 12, 2026, 10:54:37 IST

హిందుస్తాన్ టైమ్స్‌లో ఫలితాలు

ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ జనరల్, ఒకేషనల్ ఫలితాలు హిందుస్తాన్ టైమ్స్ సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఫలితాలు విడుదలైన తరువాత ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Apr 12, 2026, 10:48:30 IST

సీఈసీ/హెచ్ఈసీ (CEC/HEC) విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు

వాణిజ్య, మానవీయ శాస్త్రాల విద్యార్థులకు ఇప్పుడు కార్పొరేట్ రంగం ఎర్ర తివాచీ స్వాగతం పలుకుతోంది.

చార్టర్డ్ అకౌంటెన్సీ (CA): క్లిష్టమైనది అయినప్పటికీ, ఆర్థిక రంగంలో అత్యున్నత హోదాను ఇచ్చే కోర్సు.

లా (Law): క్లాట్ (CLAT) లేదా లాసెట్ ద్వారా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సుల్లో చేరవచ్చు. కార్పొరేట్ లాయర్లకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది.

మేనేజ్మెంట్ కోర్సులు: బీబీఏ (BBA) లేదా ఐపీఎం (IPM) ద్వారా మేనేజ్మెంట్ రంగంలోకి అడుగుపెట్టవచ్చు.

Apr 12, 2026, 10:47:53 IST

ఇంటర్ బీపీసీ (BiPC) విద్యార్థుల కోసం..

మెడిసిన్ (MBBS/BDS) మాత్రమే కాకుండా బీపీసీ విద్యార్థులకు మెడికల్ రంగంలో అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.

అగ్రికల్చర్ & హార్టికల్చర్: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా బీఎస్సీ అగ్రికల్చర్‌కు డిమాండ్ పెరిగింది.

ఫార్మా కోర్సులు: బి-ఫార్మసీ, ఫార్మ్-డి వంటి కోర్సులు హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలకు మేలైన దారి.

పారామెడికల్ & ఫిజియోథెరపీ: హెల్త్‌కేర్ సెెక్టర్ విస్తరణతో ఫిజియోథెరపీ, నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ వంటి కోర్సులకు మంచి గుర్తింపు ఉంది.

Apr 12, 2026, 10:47:11 IST

ఇంటర్ ఎంపీసీ (MPC) విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు

ఎంపీసీ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇంజనీరింగ్. టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) ద్వారా రాష్ట్రంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు సంపాదించవచ్చు. అయితే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ (CSE)లోనే స్పెషలైజేషన్లు పెరిగాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్: సాఫ్ట్‌వేర్ రంగంలో అత్యధిక వేతనాలు లభిస్తున్న విభాగమిది.

డేటా సైన్స్: డేటా విశ్లేషణపై ఆసక్తి ఉన్నవారికి ఇది అద్భుతమైన అవకాశం.

నాన్-ఇంజనీరింగ్ ఆప్షన్లు: బీఎస్సీ (ఆనర్స్) మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ చేయడం ద్వారా రీసెర్చ్ వైపు వెళ్లవచ్చు. అలాగే ఆర్కిటెక్చర్ (NATA) ద్వారా భవన నిర్మాణ రంగంలో స్థిరపడవచ్చు.

Apr 12, 2026, 10:45:24 IST

కనీసం 35 శాతం మార్కులు

ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. రెండు సంవత్సరాలకు మొత్తంగా 1000 మార్కులకు 350 మార్కులు సాధించాలి. బ్లైండ్, డెఫ్, డంబ్ విద్యార్థులకు కనీస ఉత్తీర్ణత మార్కులు 25 శాతంగా నిర్ణయించారు.

గ్రేడింగ్ సిస్టమ్..

A1: 91-100 మార్కులు

A2: 81-90 మార్కులు

B1: 71-80 మార్కులు

B2: 61-70 మార్కులు

C1: 51-60 మార్కులు

C2: 41-50 మార్కులు

D1: 35-40 మార్కులు

F: 35 మార్కుల కంటే తక్కువ (ఫెయిల్)

Apr 12, 2026, 10:44:26 IST

గత ఏడాది ఎంత శాతం ఉత్తీర్ణులయ్యారు?

గత ఏడాది అంటే 2025 ఇంటర్ ఫలితాల్లో ఓవరాల్‌గా మొదటి సంవత్సరం ఫలితాల్లో 66.89 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండవ సంవత్సరం ఫలితాల్లో 71.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు.

Apr 12, 2026, 10:43:34 IST

2025 ఇంటర్ ఫలితాలు ఇలా

గత ఏడాది తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ములుగు జిల్లా విద్యార్థులు 81.06 శాతం ఉత్తీర్ణత సాధించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 80.24 శాతం ఉత్తీర్ణత నమోదైంది. దీంతో ఈ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మేడ్చల్ జిల్లాలో 77.91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండో సంవత్సరం ఫలితాల్లో ఈ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇక కామారెడ్డి జిల్లాలో కేవలం 56.38 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో కామారెడ్డి లాస్ట్‌లో ఉంది.

2025 ఫస్ట్ ఇయర్

ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాల్లో 77.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 76.36 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 70.52 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇక మహబూబాబాద్ జిల్లాలో కేవలం 48.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఈ జిల్లా లాస్ట్‌లో ఉంది.

Apr 12, 2026, 10:38:41 IST

వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

మీ కాంటాక్ట్‌లలో 8096958096 నెంబరును "MeeSeva Telangana"గా సేవ్ చేయండి. వాట్సాప్ తెరిచి "Hi" అని పైన నెంబర్‌కు పంపండి. మీసేవ చాట్‌బాట్ మొదలవుతుంది.

"BIE Exam Result" టైప్ చేసి ఓపెన్ సర్వీస్ నొక్కండి. మీ రోల్ నంబర్ నమోదు చేయండి, సంవత్సరం (1వ / 2వ), స్ట్రీమ్ (జనరల్ / వొకేషనల్) ఎంచుకోండి.

సబ్మిట్ చేయండి. మీ ఫలితం వాట్సాప్‌లో తక్షణమే కనిపిస్తుంది.

తర్వాత దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Apr 12, 2026, 10:13:21 IST

తెలంగాణ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Apr 12, 2026, 10:11:27 IST

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Apr 12, 2026, 10:06:27 IST

హెచ్‌టీలో TS Inter 2nd Year Results చెక్ చేయండి

Apr 12, 2026, 10:03:10 IST

ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలు

General 1st Year: 'TSGEN1 ' అని టైప్ చేసి 56263కి పంపాలి.

Vocational 1st Year: 'TSVOC1' అని టైప్ చేసి అదే నంబర్‌కు పంపాలి.

అంతేకాదు.. ఈసారి కొన్ని ప్రైవేట్ పోర్టల్స్ WhatsApp ద్వారా కూడా ఫలితాలను ఇస్తాయ్.

Apr 12, 2026, 10:03:02 IST

TS Inter results 2026: మొబైల్‌లోనే ఇంటర్ ఫలితాలు

తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) విద్యార్థులు నేడు ఉదయం 11 గంటల నుంచి (ఏప్రిల్ 12, 2026) WhatsApp ద్వారా నేరుగా తమ బోర్డ్ పరీక్ష ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Apr 12, 2026, 08:54:17 IST

మార్కుల విషయంలో అసంతృప్తి ఉంటే

ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్లలో తమ మార్కులను చూసుకోవచ్చు. మార్కుల విషయంలో అసంతృప్తి ఉన్నవారికి రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ వంటి అవకాశాలను బోర్డు కల్పిస్తుంది.

Apr 12, 2026, 07:52:14 IST

వేగంగా ఫలితాలు

మార్చి 15 నుంచి 20 కేంద్రాల్లో మూల్యాంకనం చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1 నాటికి పూర్తి అయిపోయింది. ఏప్రిల్ 8 వరకు క్రోడీకరణ పనులు ముగించి, రికార్డు వేగంతో ఫలితాలు సిద్ధం చేశారు. ఇది గత సంవత్సరాలతో పోలిస్తే అత్యంత వేగవంతమైన ప్రక్రియ చెప్పుకోవచ్చు.

Apr 12, 2026, 07:05:49 IST

ఫెయిల్ అయితే

సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం అవ్వండి. ఉపాధ్యాయుల సహాయం తీసుకోండి. లేదంటే ఏడాది వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫెయిల్ అయినంత మాత్రన జీవితం ఆగిపోయినట్టు కాదనే విషయం గుర్తుంచుకోవాలి.

Apr 12, 2026, 06:39:53 IST

పాస్ అయితే

పాస్ అయిన వెంటనే విద్యార్థులు రిలాక్స్ కాకూడదు. తర్వాతి చదువులు, కాలేజీ అడ్మిషన్లు ప్లాన్ చేసుకోవాలి. భవిష్యత్ ప్రణాళిక మీద అంచనాకు రావాలి. ప్రముఖ కాలేజీల్లో సీట్లు త్వరగా అయిపోతాయి. అందుకే లేట్ చేయకూడదు.

Apr 12, 2026, 06:16:00 IST

తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ 2026 ఎలా చెక్ చేయాలి?

తెలంగాణ ఇంటర్ రిజల్స్ట్ కోసం అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in లోకి వెళ్లాలి.

హోం పేజీలోని ఇంటర్ రిజల్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి.

హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి.

సబ్మిట్ బటన్‌ మీద క్లిక్ చేయండి.

అనంతరం ఫలితాలు మీ స్క్రీన్‌ మీద డిస్‌ప్లే అవుతాయి.

ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందొచ్చు.

Apr 12, 2026, 06:12:49 IST

వాట్సాప్‌లో రిజల్ట్స్

ఇంటర్ ఫలితాలను విద్యార్థులు మొబైల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. 8096958096 నంబర్‌కి వాట్సాప్‌లో Hi అని మెసేజ్ చేయాలి. అనంతరం అక్కడ కనిపించే ఇంటర్ ఫలితాలు మీద క్లిక్ చెయ్యాలి. హాల్ టికెట్ నంబర్ ఇవ్వగానే వెంటనే ఫలితాలు అగుపిస్తాయి. డౌన్‌లోడ్ ఆప్షన్ కూడా ఉండనుంది. దాన్ని క్లిక్ చేసి డౌన్ లోడ్ చేయవచ్చు.

Apr 12, 2026, 06:10:10 IST

9 లక్షలమందికిపైగా విద్యార్థులు

9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

మొదటి సంవత్సరం విద్యార్థులు 4,89,126 మంది ఉన్నారు.

రెండో సంవత్సరం విద్యార్థులు వారు 5,07,949 మంది ఉన్నారు.

Apr 12, 2026, 06:07:53 IST

హెచ్‌టీలో ఎలా చెక్ చేయాలి?

ముందుగా https://www.hindustantimes.com వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

హోం పేజీలోని ఇంటర్ ఫలితాలు - 2026 లింక్ పై క్లిక్ చేయాలి.

విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

దీంతో మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

Apr 12, 2026, 05:51:41 IST

హెచ్‌టీలోనూ రిజల్ట్స్ చూసుకోవచ్చు

తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో మాత్రమే కాకుండా హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్‌లోనూ సులభంగా తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి క్షణాల వ్యవధిలోనే డిస్ ప్లే అవుతాయి(ఫలితాల ప్రకటన తర్వాత లింక్ అందిస్తాం.)

Apr 12, 2026, 05:48:31 IST

మరికాసేపట్లో ఇంటర్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్ ఫలితాలను హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి యోగితా రాణా ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలను అందుబాటులో ఉంచుతామని బోర్డు తెలిపింది.

Home Telangana Telangana intermediate results 2026 LIVE: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. tgbie.cgg.gov.inలో చూడండి