TS SSC Results 2026 : తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా రిజల్ట్ చూసుకోండి

Telangana SSC 10th class Results 2026 Released : తెలంగాణ టెన్త్ ఫలితాలు - 2026 విడుదల అయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు.

Published on: Apr 29, 2026, 14:00:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TS SSC Results 2026 Released : విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. తెలంగాణ పదో తరగతి ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ పాల్గొన్నారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల 2026
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల 2026

మీరు ఫలితాలను హిందుస్థాన్ టైమ్స్ వెబ్‌సైట్‌లోనూ చూడవచ్చు. ఇందుకోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2026 విడుదల

అధికారిక వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు ఫలితాలను చెక్ చేయవచ్చు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ సిద్ధంగా ఉంచుకుని కింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఫలితాలను పొందొచ్చు.

ఫలితాలు ఎలా చెక్ చేయాలి?

  • https://results.bsetelangana.org , https://bse.telangana.gov.in, https://results.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీలో కనిపించే Regular & Private (SSC & OSSC) Results అనే లింక్‌ మీద క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి.
  • నెంబర్ సరిచూసుకుని submit బటన్ మీద నొక్కండి.
  • మీ ఫలితాలు స్క్రీన్‌ మీద కనిపిస్తాయి. మార్కుల షీట్ డౌన్‌లోడ్ చేసుకోవటంతో పాటు ప్రింట్ తీసుకోవడం బెటర్.

వాట్సాప్ ద్వారా ఇలా ఫలితాలు చూసుకోండి

1. మీ మొబైల్‌లో 8096958096 నంబర్‌ను “MeeSeva Telangana”గా సేవ్ చేసుకోండి.

2. WhatsApp ఓపెన్ చేసి “Hi” అని మెసేజ్ పంపండి.

3. “SSC Result” అని టైప్ చేయండి.

4. మెనులో ఓపెన్ సర్వీస్ ఎంపికపై క్లిక్ చేయండి.

5. మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి.

6. వివరాలు సమర్పించిన వెంటనే మీ మార్కుల మెమో WhatsAppలో డిస్ ప్లే అవుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమైన పదో తరగతి ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీ వరకు జరిగాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యాశాఖ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించింది. ఈ నెల 23వ తేదీ నాటికే పేపర్ల దిద్దుబాటు ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More