TSLPRB APP Results : రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీసులో ఖాళీగా ఉన్న 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) సోమవారం విడుదల చేసింది.
ఈనెల 17 నుంచి వెరిఫికేషన్….

పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 17వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికేట్ వెరిఫికేషన్) ప్రారంభం కానుందని నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో వెల్లడించారు.
మొత్తం 118 ఏపీపీ ఉద్యోగాల నియామకం కోసం గత ఏడాది డిసెంబరు 14వ తేదీన మండలి రెండు పేపర్లుగా రాత పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను నియామక మండలి అధికారిక వెబ్‌సైట్ ( https://www.tgprb.in/ ) లో చూడవచ్చు. వ్యక్తిగత లాగిన్ ఐడీ ద్వారా ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు నియామక మండలి వెబ్‌సైట్ నుంచి తమ ఇంటిమేషన్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన ఎక్కడ జరుగుతుంది, వేదిక వివరాలు ఏమిటనే అంశాలను ఈ లెటర్లలో స్పష్టంగా పొందుపరిచి ఉంటాయి.
మీ వద్ద ఉండాల్సి పత్రాలు…
పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తమ అన్ని అసలు ధ్రువపత్రాలతో పాటు రెండు జతల జిరాక్స్ ప్రతిపాదనలను తప్పనిసరిగా తీసుకురావాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింట్
- రాత పరీక్ష ఫలితాల షీట్
- డౌన్‌లోడ్ చేసుకున్న ఇంటిమేషన్ లెటర్
- చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు (ID Proof)
- పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం పదో తరగతి (SSC) మార్కుల మేమో
- బార్ కౌన్సిల్ ఎన్‌రోల్‌మెంట్ ధ్రువపత్రం
- క్రిమినల్ కోర్టులో కనీసం మూడేళ్ల పాటు న్యాయవాదిగా పనిచేసిన అనుభవ ధ్రువీకరణ పత్రం (బార్ అసోసియేషన్ లేదా కోర్టు ప్రిసైడింగ్ అధికారి జారీ చేసింది)
అభ్యర్థులు తమ ఇంటిమేషన్ లెటర్లో కేటాయించిన వేదికకు నిర్దేశిత సమయానికి హాజరుకావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే తమ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీ ద్వారా support@tslprb.in కు ఈమెయిల్ చేయవచ్చు. లేదా 040-41895151 నంబర్‌కు కాల్ చేసి సహాయం పొందవచ్చని స్పష్టం చేశారు.
{{/usCountry}}అభ్యర్థులు తమ ఇంటిమేషన్ లెటర్లో కేటాయించిన వేదికకు నిర్దేశిత సమయానికి హాజరుకావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే తమ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీ ద్వారా support@tslprb.in కు ఈమెయిల్ చేయవచ్చు. లేదా 040-41895151 నంబర్‌కు కాల్ చేసి సహాయం పొందవచ్చని స్పష్టం చేశారు.
{{/usCountry}}