తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు, చివరి తేదీ ఇదే..!
బోధన ఫీజులు, ఉపకార వేతనాల దరఖాస్తులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. అప్లికేషన్ల గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువుపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకోని విద్యార్థుల కోసం…. మార్చి 31వ తేదీ వరకు తాజాగా గడువు పొడిగించారు.

రాష్ట్రంలో 2025- 2026 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. గతేడాది జూలై నుంచి దరఖాస్తులకు అవకాశం కల్పించారు. కొత్తవాటివి మాత్రమే కాకుండా… రెెన్యూవల్ అప్లికేషన్లకు కూడా అవకాశం కల్పించారు.
చాలా మంది విద్యార్థులు ఇంకా దరఖాస్తు చేసుకోకపోవటంతో…. గడువు పొడిగించారు. ప్రవేశ పరీక్షల డేటాను ఈపాస్ వెబ్‌సైట్లో నమోదు చేయకపోవడంతో పలువురు విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా గడువును పొడిగించారు.
ఈ-పాస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా….
- అర్హత కలిగిన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
- రెన్యూవల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఇదే వెబ్ సైట్ లో ప్రాసెస్ చేసుకోవచ్చు.
- కొత్త విద్యార్థులు అయితే 'ఫ్రెష్ రిజిస్ట్రేషన్' అనే ఆప్షన్ పై నొక్కాలి. అప్పుడు బ్రౌజర్లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- మీ వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. ఇక చివరగా.. అప్లికేషన్లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "సబ్మిట్" చేయాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్‌ను నోట్ చేసుకోవాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

