Suryapet Double Murder Case : సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇళ్ల సరిహద్దులోని ఒక వేపచెట్టు విషయమై రెండు పొరుగు కుటుంబాల మధ్య చాలా ఏళ్లుగా నడుస్తున్న వివాదం శనివారం హత్యాకాండగా మారింది. ఈ ఘోర ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా…. అడ్డుకోబోయిన ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.
వేపచెట్టు విషయంలో తగాదా….

పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని ఒక చిన్న పల్లెటూర్లో ఉన్న రెండు పొరుగు కుటుంబాల మధ్య వారి ఇళ్ల సరిహద్దులో ఉన్న వేపచెట్టు విషయంలో గత కొన్నేళ్లుగా తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో శనివారం రోజున ఒక పొరుగింటి వ్యక్తి ఆ వేపచెట్టును నరికేశారు. అలా నరికిన చెట్టు కొమ్మలు పక్కనే ఉన్న మరో పొరుగింటి ఆవరణలో పడ్డాయి. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వాగ్వాదం ప్రారంభమైంది. మాటమాట పెరిగి ఆ గొడవ పరస్పర దాడుల వరకు వెళ్లింది.
అగ్రహంతో ఊగిపోయిన పొరుగింటి వ్యక్తి కొడుకు ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకుని వచ్చి, ఎదురింటి వ్యక్తిపై దారుణంగా దాడి చేశాడు. గొడ్డలిపోట్లకు తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి రక్తం మడుగులో అక్కడికక్కడే కన్నుమూశాడు. ఈ దారుణ హత్యను చూసి నిందితుడి సొంత తండ్రి తీవ్రంగా ఖండించాడు. ఎదురింటి వ్యక్తిని ఎందుకు చంపేశావంటూ కొడుకును నిలదీశాడు.
తండ్రి తన మాట వినకుండా చనిపోయిన పొరుగింటి వ్యక్తికే మద్దతు ఇస్తున్నాడని భావించిన అతగాడు… ఏమాత్రం కనికరం లేకుండా సొంత తండ్రిపై కూడా అదే గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. తీవ్ర గాయాలైన తండ్రి కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
ఎస్ఐపై కూడా దాడి……
విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) గొడవను ఆపేందుకు, దాడులను నివారించేందుకు ప్రయత్నించారు. అయితే ఆవేశంలో ఉన్న నిందితుడు ఎస్ఐపై కూడా గొడ్డలితో దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
{{/usCountry}}విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) గొడవను ఆపేందుకు, దాడులను నివారించేందుకు ప్రయత్నించారు. అయితే ఆవేశంలో ఉన్న నిందితుడు ఎస్ఐపై కూడా గొడ్డలితో దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
{{/usCountry}}ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, హత్యలకు పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ఎస్‌ఐని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.