...
...
Next Story

Jagtial Crime News : ఇంట్లోకి వెళ్లి మహిళపై దౌర్జన్యం... వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్! వెలుగులోకి కీలక విషయాలు

Jagtial Crime News : జగిత్యాల జిల్లా మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై దాడి జరిగింది. అంతేకాకుండా కొన్ని వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసిన ఇద్దరు రౌడీషీటర్లతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Published on: Aug 8, 2026, 09:32:11 IST
Advertisement

జగిత్యాల జిల్లాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై భౌతిక దాడికి పాల్పడటమే కాకుండా, వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు రౌడీషీటర్లతో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని న్యాయస్థానంలో హాజరుపరిచి జుడీషియల్ కస్టడీకి తరలించినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.

ఇంట్లోకి వెళ్లి దాడి…ఆపై వీడియో రికార్డ్

జగిత్యాలలో దారణం ( ప్రతీకాత్మక చిత్రం)
జగిత్యాలలో దారణం ( ప్రతీకాత్మక చిత్రం)

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆగస్టు 3న సదరు మహిళ మరొక వ్యక్తితో కలిసి మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు హఠాత్తుగా ఆ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వారిపై దాడికి ప్రయత్నించారు. ప్రధాన నిందితులైన శివరాత్రి నాగేష్, శ్రీకాంత్ కలిసి ఆ మహిళ, ఆమెతో ఉన్న వ్యక్తి దృశ్యాలను తమ ఫోన్లలో వీడియో రికార్డ్ చేశారు. అనంతరం ఆ వ్యక్తిని బెదిరించి అక్కడి నుంచి పంపించివేశారు.

ఆ తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై నగేష్, శ్రీకాంత్ తీవ్రస్థాయిలో భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో మిగతా ఇద్దరు నిందితులు అంజయ్య, మల్లేష్ ఇంటి బయట కాపలాగా నిలబడి ఎవరూ రాకుండా చూశారు.

ఈ దారుణం అక్కడితో ఆగలేదు. దాడి జరిగిన అనంతరం నిందితులు సదరు మహిళ ఫోన్ నంబర్‌కు రికార్డ్ చేసిన వీడియోలను పంపిస్తూ తీవ్రంగా బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. డబ్బులు ఇవ్వాలని, లేకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగారు. నిందితుల వేధింపులు తాళలేక బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి మల్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

నిందితులు అరెస్ట్ - వెలుగులోకి నేర చరిత్ర

ఈ కేసులో బాధిత మహిళపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకున్న పోలీసులు… పకడ్బందీగా విచారణ జరుపుతున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe