'టెన్త్ ఎగ్జామ్ ఫీజు నేనే చెల్లిస్తా' - 12 వేల మంది విద్యార్థులకు కేంద్రమంత్రి బండి సంజయ్ చేయూత
కేంద్రమంత్రి బండి సంజయ్ పెద్ద మనసును చాటుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు చేయూత అందించేందుకు ముందుకొచ్చారు. వార్షిక పరీక్షల ఫీజును చెల్లిస్తానని ప్రకటించారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని టెన్త్ విద్యార్థులకు కేంద్రమంత్రి, స్థానిక ఎంపీగా ఉన్న బండి సంజయ్ మరోసారి తీపి కబురు చెప్పారు. ఇప్పటికే మోదీ కానుక పేరుతో పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను కూడా పంపిణీ చేయగా… ఈసారి వార్షిక ఎగ్జామ్ ఫీజును చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల ఫీజు భారం కారాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బండి సంజయ్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. వారి ఉజ్వల భవిష్యత్తు కోసం తన వంతుగా ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల ఫీజును తన వేతనం నుంచి చెల్లిస్తానని పేర్కొన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 12,292 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్నారు. వీరందరి వార్షిక ఫీజును తానే చెల్లిస్తానని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రకటించారు.
- కరీంనగర్ జిల్లా – 4,847 మంది విద్యార్థులు
- సిరిసిల్ల జిల్లా – 4,059 మంది
- సిద్ధిపేట జిల్లా – 1,118 మంది
- జగిత్యాల జిల్లా – 1,135 మంది
- హన్మకొండ జిల్లా – 1,133 మంది
ఈ విద్యార్థులందరి పరీక్ష ఫీజుల కోసం సుమారు రూ. 15 లక్షలు అవసరమవుతాయి. ఈ మొత్తాన్ని తన వేతనం జీతం భరించాలనే నిర్ణయం తీసుకున్నానని బండి సంజయ్ వెల్లడించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన లేఖలను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించాననని తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

