...
...
Next Story

వేములవాడ రాజన్న దర్శనం తాత్కాలికంగా నిలిపివేత.. భీమేశ్వరాలయంలో మెుక్కులు

వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనం తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దీనిపై భక్తులు, బీజేపీ నాయకుల నుండి నిరసనలు వ్యక్తమయ్యాయి. భీమేశ్వరాలయం వద్ద అధికారులు ప్రత్యామ్నాయ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

Published on: Oct 12, 2025, 22:25:27 IST
Advertisement

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులకు దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా ఆదివారం నుండి భక్తులకు తాత్కాలికంగా దర్శనాలను నిలిపివేశారు. రాజరాజేశ్వర స్వామి మందిరం అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో ప్రత్యామ్నాయ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

వేములవాడ
వేములవాడ

ప్రధాన ఆలయంలో ఏకాంత సేవలు యథావిధిగా కొనసాగుతాయి. అయితే ఇకపై భీమేశ్వరాలయంలో కోడెమొక్కు, అభిషేకాలు, కుంకుమపూజ, నిత్య కల్యాణం, చండీయాగం వంటి పూజలు నిర్వహించనున్నారు. ఆలయ కార్యనిర్వాహక అధికారిణి రమాదేవి మాట్లాడుతూ, ఆలయాన్ని మూసివేయడం లేదని స్పష్టం చేశారు. 'పనులు జరుగుతున్న సమయంలో భక్తులు భీమేశ్వరాలయంలో అన్ని పూజలు కొనసాగించవచ్చు.' అని ఆమె పేర్కొన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు ఆదివారం ఆలయం వెలుపల నిరసన ప్రదర్శన నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. భీమేశ్వరాలయంలో రాజన్న పూజలు ఎలా నిర్వహిస్తారని గోపి ప్రశ్నించారు. భక్తులకు రాజరాజేశ్వర స్వామి దర్శనాన్ని నిరాకరించకూడదని చెప్పారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ నిర్ణయాన్ని ఖండించారు.

భీమేశ్వరాలయం వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలించిన భారత రాష్ట్ర సమితి నాయకులు కూడా పనులు పూర్తి కాకముందే అధికారులు దర్శన ఏర్పాట్లను ప్రకటించడాన్ని విమర్శించారు.

ఆలయం మూసివేశారనే బీజేపీ ఆరోపణలను ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తోసిపుచ్చారు. శృంగేరి పీఠాధిపతి సలహా మేరకు విస్తరణ పనులు జరుగుతున్నాయని, భక్తులకు ప్రత్యామ్నాయ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గర్భగుడిలో మండపాలు 64 నుండి 70 స్తంభాల నిర్మాణం కోసం పెద్ద నిర్మాణ సామగ్రిని ఉపయోగిస్తున్నారన్నారు. భక్తులను లోపలికి అనుమతిస్తే భద్రతా సమస్యలు తలెత్తుతాయని వివరించారు. విస్తరణ పనులు కొనసాగుతున్నప్పటికీ రాజన్నకు పూజలు కొనసాగుతాయి అని అన్నారు. ఆలయ రక్షణ కమిటీ, హిందూ సంస్థలు, భక్తుల అభిప్రాయాలను ఇప్పటికే తీసుకున్నామని చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe