...
...
Next Story

వరంగల్ ట్రిపుల్ మర్డర్ కేసు : భర్తతో పాటు మరో 9 మంది అరెస్ట్ - పరారీలో లేడీ డాక్టర్లు..! వెలుగులోకి సంచలన విషయాలు

Warangal Swimming Pool Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన భార్యతో పాటు ఇద్దరు పిల్లల హత్యకు సంబంధించి కేసును వరంగల్ పోలీసులు చేధించారు. భర్తతో పాటు మరో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. విచారణలో కీలక విషయాలు బయటికొచ్చాయి.

Published on: Apr 10, 2026, 17:52:15 IST
Advertisement

వరంగల్ లో వెలుగు చూసిన భార్య, ఇద్దరు బాలికల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో భర్తనే ప్రధాన నిందితుడు కాగా… సహకరించిన మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

భార్య ఇద్దరు పిల్లలు హత్య - నిందితులు అరెస్ట్
భార్య ఇద్దరు పిల్లలు హత్య - నిందితులు అరెస్ట్

ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ నగర కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు అజారుద్దీన్ అదే గ్రామానికి చెందిన ఫరహాత్‌ను 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి హుమేరా(09), ఆయేషా(06) జన్మనిచ్చారు. కాని నిందితుడి కుటుంబ సభ్యులకు కుమారుడు పుట్టాలని కోరిక ఉండేది.

వెలుగులోకి సంచలన విషయాలు…

2021, 2022 సంవత్సరాల్లో మృతురాలు గర్భం దాల్చడంతో తిరిగి అడపిల్ల జన్మనిస్తుందనే అపనమ్మకంతో అబార్షన్ చేయించారు. ఇందుకు ఆర్ఎంపీ డాక్టర్ నరేశ్, ల్యాబ్ టెక్నిషియన్ మనోహర్, డాక్టర్లు రవళి, పూర్ణిమతో పాటు నర్సు స్రవంతి సాకారం తీసుకున్నాడు. భార్యకు ఇష్టం లేకున్నా రెండు దఫాలుగా నిందితుడు అబార్షన్ చేయించాడు.

ఇదే సమయంలో దూరపు బంధువు అయిన మరో మైనర్ బాలికను పెళ్లి చేసుకునేందుకు భర్త అజారుద్దీన్ సిద్ధమయ్యాడు. కానీ సదరు నిరాకరించింది. అప్పటికే పెళ్లికావటంతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయాన్ని ప్రస్తావించింది. భార్య, పిల్లలు ఉన్నారనే కారణంగానే పెళ్లికి అంగీకరించలేదన్న కారణంతో… అజారుద్దీన్ మరో ప్లాన్ వేశాడు. భార్యతో పాటు పిల్లలను లేకుండా చేయాలని భావించాడు.

ఇదే సంవత్సరం మార్చి నెలలో ఫరహాత్ మరోసారి గర్భం దాల్చింది. అయితే మళ్లీ కూడా ఆడపిల్ల జన్మనిస్తుందనే భయంతో నిందితుడుతో పాటు తల్లిదండ్రులు, తమ్ముడు అబార్షన్ చేయించుకోవాల్సిందిగా పలుమార్లు ఫరహాత్ తో గొడవ పడ్డారు. అంతేకాకుండా మరో పెళ్లి కావాలంటే వీరిని లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు.

స్విమ్మింగ్ పూల్ కు తీసుకెళ్లి…

మృతిరాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు… తమదైన శైలిలో విచారణ జరిపారు. భర్త అజారుద్దీనే… తన భార్య పిల్లలలను దారుణంగా హత్య చేసినట్లుగా నిర్థారణకు వచ్చారు. అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అంతేకాకుండా ఈ కేసులో పున్నెలు గ్రామానికి చెందిన యం.డి చాంద్‌పాషా(49), యం.డి సలీహా(45), యం.షరోద్దీన్ (25)లతో పాటు బసిక స్రవంతి(32), బాల్నె పార్ధు(47) బొమ్మెర మనోహర్(39), లింగాల నరేష్(37), సాట్లరాజు(32), పున్నెలు, భద్రు(60)ను అరెస్ట్ చేశారు, మరో ఇద్దరు ( డాక్టర్ బాల్నె పూర్ణిమ, డా.ఎస్.రవళీ) పరారీలో ఉన్నారని సీపీ వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks