'కృష్ణమ్మ' పరుగులు - నాగార్జున సాగర్ లో పెరుగుతున్న నీటిమట్టం, తాజా పరిస్థితి ఇలా...

కృష్ణా బేసిన్ లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో…. శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో కొనసాగుతోంది. కొన్ని క్యూసెక్కుల మేర నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Published on: Jul 04, 2025 12:20 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల దాటికి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుల్లోని నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మరికొన్నిరోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండే అవకాశం స్పష్టంగా ఉంది. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కూడా క్రమంగా నిండుతోంది.

నాగార్జునసాగర్ (ఫైల్ ఫొటో)
నాగార్జునసాగర్ (ఫైల్ ఫొటో)

సాగర్ లో ప్రస్తుత పరిస్థితి ఇలా….

ఇవాళ(జూలై 4) ఉదయం రిపోర్ట్ ప్రకారం…నాగార్జున సాగర్గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులుగా ఉంటుంది. ప్రస్తుతం 520.3 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ మొత్తం నీటి సామర్థ్యం 312.05 కాగా…. 151.66 టీఎంసీల వద్ద ఉంది. ఇన్ ఫ్లో 49,553 క్యూసెక్కులుగా ఉండగా… ఔట్ ఫ్లో 5,153 క్యూసెక్కులుగా ఉంది. గతేడాది మాదిరిగానే…. ఈసారి కూడా ఆగస్టు మొదటి వారంలోనే సాగర్‌ కాల్వలకు నీటిని విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది.

మరోవైపు శ్రీశైలండ్యామ్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.9 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 167.88 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో 76,841గా ఉండగా…. ఔట్ ఫ్లో 68,118 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు

శ్రీశైలం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంటుంది. ఫలితంగా శ్రీశైలండ్యామ్‌ నిండడానికి తక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఎగువ రాష్ట్రాల్లోనే కాకుండా ఏపీలోనూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో…. శ్రీశైలం ప్రాజెక్ట్ ఈసారి ముందుగానే నిండటం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం… ఆదివారం క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. 156.33 అడుగుల నీటిమట్టం ఉంది. 21.53 టీఎంసీల నీటి నిల్వ ఉంది.ఇన్ ఫ్లో నిల్ ఉండగా… ఔట్ ఫ్లో 4,000 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి స్వల్పంగా వరద నీరు చేరుతోంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More