హైదరాబాద్ వాసులకు అలర్ట్ - 36 గంటలు మంచినీటి సరఫరా బంద్, ఎక్కడెక్కడంటే...?

హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. కృష్ణా ఫేజ్ - 1లో జరిగే మరమ్మత్తు పనుల కారణంగా…ఈనెల 27 ఉదయం నుంచి 28వ తేదీ సాయంత్రం వరకు నీటి సరఫరా నిలిచిపోనుంది.

Published on: Dec 25, 2025, 16:30:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగరవాసులకు జలమండలి అలర్ట్ ఇచ్చింది. కృష్ణా ఫేజ్ - 1లో జరిగే మరమ్మత్తు పనుల కారణంగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈనెల 27 ఉదయం నుంచి 28వ తేదీ సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని HMWSSB ప్రకటించింది.

నీటి సరఫరాకు అంతరాయం
నీటి సరఫరాకు అంతరాయం

మరమ్మత్తు పనుల ఎఫెక్ట్…

జలమండలి ప్రకటించిన వివరాల ప్రకారం…. హైదరాబాద్ సిటీకి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్ - 1 లో సర్జ్ ట్యాంక్ వద్ద ఉన్న 700 మిమీ డయా ఎంఎస్ పైప్ లైన్ కు ఏర్పడిన లీకేజీని అరికట్టే పనులు జరగనున్నాయి. అంతేకాకుండా నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2200 మిమీ డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌లో దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీలు, వాల్వులను మార్పిడి చేస్తారు. నాసర్లపల్లి వద్ద 2200 మిమీ డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై 600 మిమీ డయా ఎంఎస్ జంక్షన్ పనులు చేపట్టడంతో పాటు కోదండాపూర్, నాసర్లపల్లి పంపింగ్ స్టేషన్లలో ఉన్న 600 మిమీ డయా పై దెబ్బతిన్న బిఎఫ్ valveలు, ఎన్ఆర్v లను మార్పిడి చేయనున్నారు.

డిసెంబర్ 27వ తేదీ ఉదయం 6 గంటల ఈనెల 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ పనులన్నీ జరుగుతాయి. ఫలితంగా దాదాపు 36 గంటలపాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మరమ్మతు పనులు పూర్తి చేసిన అనంతరం నీటి సరఫరా తిరిగి పునరుద్ధరిస్తారు.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

1. డివిజన్ నెం. I: మీరాలం, కిషన్‌బాగ్, బాల్షెట్టీ కేట్, మొగల్ పురా, ఫలక్‌నామా, బహదూర్‌పురా, జహనుమా.

2. డివిజన్ నెం. II: మహబూబ్ మాన్షన్, సంతోష్ నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, ఆస్మాన్‌గఢ్, యాకుత్‌పురా.

3. డివిజన్ నెం. IV: బొగ్గులకుంట.

3. డివిజన్ నెం. V: నారాయణగూడ, ఆడిక్‌మెట్ రిజర్వాయర్, శివం రిజర్వాయర్, చిల్కలగూడ రిజర్వాయర్.

5. డివిజన్ నెం. VIII: అలియాబాద్ రిజర్వాయర్, రియాసత్ నగర్ రిజర్వాయర్.

6. డివిజన్ నెం. X: దిల్ సుఖ్ నగర్ లోని కొన్ని ప్రాంతాలు.

7. డివిజన్ నెం. XVIII: హార్డ్ వేర్ పార్క్, జల్ పల్లి, తుక్కుగూడ, ఫాబ్ సిటీ.

8.డివిజన్ నెం. XX: మన్నెగూడా.

నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటి వాడకంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ముందస్తు ప్రకటన నేపథ్యంలో… తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More