...
...
Next Story

తెలంగాణలో ఎముకలు కొరికే చలి.. నేటి నుంచి మరింత పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

తెలంగాణలో చలి తీవ్రత మెుదైలంది. అడుగు తీసి బయటపెట్టాలంటే వణుకు పుడుతుంది. నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయి.

Published on: Nov 13, 2025 08:26 AM IST
Advertisement

తెలంగాణ ఈసారి అత్యంత చలి తీవ్రత ఎదుర్కోనుంది. భారత వాతావరణ శాఖ (IMD) రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలలో తగ్గుదల గురించి వెల్లడించింది. ఈ సీజన్‌లో తీవ్రమైన చలి ఉంటుందని వెల్లడించింది. వాతావరణ పరిశీలకులు నవంబర్ 13 నుంచి 18 మధ్య గరిష్ట చలిగాలుల గురించి హెచ్చరిస్తున్నారు.

నేటి నుంచి చలి గాలులు
నేటి నుంచి చలి గాలులు

బుధవారం రాష్ట్రంలోని సిర్పూర్ (కుమురం భీమ్) వద్ద 10.2 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ 11.1 డిగ్రీల వద్ద ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (TGDPS) ప్రకారం, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల 11 డిగ్రీల నుంచి 12డిగ్రీల మధ్య నమోదయ్యాయి. సాధారణ సగటు కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా పడిపోయాయి ఉష్ణోగ్రతలు.

హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య ఉన్నాయి. శేరిలింగంపల్లిలో 13.2డిగ్రీలు, సికింద్రాబాద్‌లో 14.8 డిగ్రీలు ఉన్నాయి. ఉత్తరాది నుండి కొనసాగుతున్న పొడి గాలులు, స్పష్టమైన ఆకాశం రాత్రిపూట వేగంగా చల్లబడటానికి కారణమవుతున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు.

'తేమ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఉపరితల ఉష్ణోగ్రతలు త్వరగా తగ్గుతాయి.' అని ఐఎండీ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

గురువారం నుండి గరిష్ట చలిగాలులు ప్రారంభమవుతాయని, ఉత్తర, పశ్చిమ, మధ్య జిల్లాలను ప్రభావితం చేస్తుందని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. ఇక్కడ 'కనిష్ట ఉష్ణోగ్రతలు 8–10 డిగ్రీలకి పడిపోవచ్చు. హైదరాబాద్‌లో నవంబర్ 13 నుంచి 18 మధ్య పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో 11 డిగ్రీల నుంచి 13 డిగ్రీల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా.' అని వెల్లడించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe