...
...
Next Story

ప్రియుడితో వివాహేతర సంబంధం కోసం భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి చంపేసిన భార్య!

నిజామాబాద్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి చూసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి చంపేసింది.

Published on: Jul 6, 2026, 17:32:08 IST
Advertisement

కట్టుకున్న భార్యే దారుణం చేస్తే, ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన అర్ధాంగే అంతమొందించే హంతకురాలిగా మారితే.. అంతకంటే ఘోరం మరొకటి ఉండదు. పెళ్లి నాడు అగ్నిసాక్షిగా కట్టిన మూడు ముళ్లు, ఏడడుగుల బంధాన్ని కాలరాస్తూ.. ఓ మహిళ పరాయి వ్యక్తి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చింది. అదీ వింటేనే ఒళ్లు గగుర్పొడిచేలా, అత్యంత క్రూరమైన పద్ధతిలో ప్రాణాలు తీసింది. ఈ కిరాతక ఉదంతం నిజామాబాద్ నగర శివారులోని న్యాల్కల్‌లో వెలుగుచూసింది.

భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి హత్య
భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి హత్య

పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. న్యాల్కల్‌కు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. భర్త దూరంగా ఉన్న సమయంలో అతడి భార్య సంధ్య.. అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కష్టపడి సంపాదిస్తూ భార్య, పిల్లల భవిష్యత్తు కోసం కలలు కన్న ప్రశాంత్, ఇటీవలె గల్ఫ్ నుండి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.

అయితే భర్త రాక సంధ్యకు సంతోషాన్ని ఇవ్వకపోగా తన అక్రమ బంధానికి అతడు అడ్డుగా మారాడనే కక్షను పెంచింది. పరాయి వ్యక్తి వ్యామోహంలో మునిగిపోయిన ఆమె, కన్నబిడ్డల భవిష్యత్తును కూడా మరిచి కట్టుకున్నవాడిని వదిలించుకోవాలని ఒక కఠినమైన పథకాన్ని రచించింది.

తన ప్లాన్‌ను అమలు చేయడానికి సంధ్య.. స్థానికుడైన వెంకట సాయి అలియాస్ బంటి అనే వ్యక్తి సహాయం తీసుకుంది. పక్కా స్కెచ్ ప్రకారం మొదట ప్రశాంత్‌తో బంటి కలిసి మద్యం సేవించాడు. ప్రశాంత్ పూర్తి మత్తులోకి జారుకోగానే, మేడపై నుండి కిందకు తోసేశారు. కింద పడటంతో ప్రశాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘోరాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించేందుకు సంధ్య నాటకమాడింది. ఏమీ తెలియనట్లు నటిస్తూ భర్తను మొదట ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది.

మొదట ఇదొక ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా అందరూ భావించారు. కానీ ప్రశాంత్ మృతిపై అనుమానాలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వెంకట సాయి అలియాస్ బంటిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు నిజాలు ఒప్పుకోవడంతో ఈ దారుణ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది.

పరాయి వ్యక్తి మోజులో పచ్చేని సంసారాన్ని కూల్చుకుని, భర్తను నరకయాతన పెట్టి చంపిన భార్య సంధ్యతో పాటు, ఈ హత్యకు సహకరించిన మిగతా నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. క్షణిక సుఖాల కోసం కట్టుకున్నవాడిని పొట్టనబెట్టుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks