...
...
Next Story

నల్గొండ జిల్లాలో ఘోరం - ప్రియుడి భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన మహిళ…!

నల్లగొండ జిల్లా కేతేపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడి భార్యపై పెట్రోల్‌ పోసి మరో మహిళ నిప్పంటించింది. ఈ ఘటనలో ప్రియుడి భార్య చనిపోగా.. 6 నెలల చిన్నారికి కూడా తీవ్రగాయాలయ్యాయి.

Published on: Jan 31, 2026, 17:50:13 IST
Advertisement

నల్గొండ జిల్లాలోని కేతేపల్లిలో ఘోరం జరిగింది. ఏకంగా ఓ మహిళా… మరో మహిళను పెట్రోల్ పోసి నిప్పటించి హత్య చేసింది. ఈ ఘటనలో 6 నెలల చిన్నారికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన సంచలనంగా మారింది.

నల్గొండ జిల్లాలో ఘోరం
నల్గొండ జిల్లాలో ఘోరం

ప్రాథమిక వివరాల ప్రకారం… నాంపల్లి మండలంలోని కేతేపల్లికి గ్రామానికి నగేశ్‌ భార్య మమత (25)తో అదే గ్రామానికి చెందిన సుజాత అనే మహిళ మధ్య గొడవ జరిగింది. ఇరువురు మధ్య వాగ్వాదం పెరగగా…. మమతపై సుజాత పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. ఆ సమయంలో మమత చేతిలో తన ఆరు నెలల కుమారుడు కూడా ఉన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మమత అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం.

ఇక సుజాత, నగేశ్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం నగేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు సుజాత నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిసింది.

ఈ ఘటనపై పోలీస్ అధికారి స్పందిస్తూ “ఓ మహిళ పెట్రోల్ పోసి నిప్పంటించిందని మాకు సమాచారం అందింది. మేం క్రైమ్ సీన్ బృందాలతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నాము. పూర్తిస్థాయి విచారణ తర్వాత అన్ని విషయాలు బయటికి వస్తాయి” అని తెలిపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks