...
...
Next Story

Telangana Crime News : వివాహేతర సంబంధం మోజులో.... తాడుతో గొంతు బిగించి భర్త హత్య! విచారణలో సంచలన నిజాలు

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో దారుణం వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త కాశీరాంను భార్య సవిత, ఆమె ఇద్దరు ప్రియుళ్లు పక్కా స్కెచ్ వేసి మట్టుబెట్టారు. ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని చెరువులో పడేశారు. కేసు ఛేదించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Published on: Nov 1, 2026, 07:57:03 IST
Advertisement

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో దారుణం వెలుగు చూసింది. తీవ్ర కలకలం రేపిన గుమ్మడి కాశీరాం మిస్టరీ మృతి కేసును బాన్సువాడ పోలీసులు ఛేదించారు. అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ వ్యవహారం.. భార్యే తన ఇద్దరు ప్రియుళ్లతో కలసి చేసిన పక్కా ప్రణాళికాబద్ధమైన హత్య అని విచారణలో తేలింది. ఈ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని…

నిందితులు అరెస్ట్ - వివరాలు వెల్లడించిన పోలీసులు
నిందితులు అరెస్ట్ - వివరాలు వెల్లడించిన పోలీసులు

వివరాల్లోకి వెళ్తే.. బాన్సువాడ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన చాకలి అలియాస్ గుమ్మడి కాశీరాం (26) రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాశీరాంకు సవిత (25)తో వివాహమైంది. అయితే…. సవితకు అదే గ్రామానికి చెందిన దినసరి కూలీ చింతకింద రాము (26), ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న పసుపుల సంతోష్ (25) అనే ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయి.

ఈ క్రమంలో తమ బంధానికి భర్త కాశీరాం తీవ్ర అడ్డంకిగా మారాడని భావించిన సవిత…. ఎలాగైనా అతడిని అంతమొందించాలని ప్లాన్ వేసింది. ఈ కుట్రలో రాము, సంతోష్‌లను భాగస్వాములను చేసింది. ముందస్తు పథకం ప్రకారం.. అక్టోబర్ 23 రాత్రి వేళ కాశీరాంను మద్యం తాగుదామని చెప్పి బయటకు తీసుకెళ్లారు. కాశీరాంకు అధికంగా మద్యం తాగించి నిషాలోకి జారిన తర్వాత…. సంతోష్ అతడి చేతులను గట్టిగా పట్టుకోగా, రాము నైలాన్ తాడుతో కాశీరాం మెడ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.

అనంతరం, ఇది ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా చిత్రీకరించి సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు, మృతదేహాన్ని హన్మాజీపేట శివార్లలోని పంచేర చెరువు (పచేర చెరువు)లో పడేసి అక్కడ నుంచి పరారయ్యారు.అక్టోబర్ 23 రాత్రి చెరువులో కాశీరాం మృతదేహం లభ్యమవడంతో, అతడి తండ్రి చాకలి భూమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాన్సువాడ పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

పోలీసుల విచారణలో నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు.నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన నైలాన్ తాడు, మొబైల్ ఫోన్లు, ఇతర సాక్ష్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు బాన్సువాడ పోలీసులు తెలిపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks