జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాన్ని డిసైడ్ చేసేది యువతేనా? సోషల్ మీడియాపై పార్టీల ఫోకస్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపు మీద ఉంది. అయితే ఈసారి ఉప ఎన్నిక ఫలితాన్ని డిసైడ్ చేయడంలో యువత కీలక పాత్ర పోషించనున్నారు.

Published on: Nov 2, 2025, 16:04:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూబ్లీహిల్స్ బైపోల్ రాజకీయం హీటెక్కింది. రోజురోజుకు అధికార, ప్రతిపక్షాలు విమర్శలతో ప్రచారాన్ని మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది మూడు ప్రధాన పార్టీలు మరింత జోరుగా రంగంలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక అంశం యువతే కావచ్చని నిపుణులు అంటున్నారు. ఎన్నికల కమిషన్ ప్రకారం.. నియోజకవర్గంలోని 4,01,365 మంది ఓటర్లలో యువత కూడా భారీగానే ఉన్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

1,30,042 మంది 18 నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు, ఇందులో దాదాపు 85 శాతం మంది విద్యావంతులు. మరో 46,716 మంది ఓటర్లు 36 నుంచి 40 సంవత్సరాల వయస్సు వారు ఉన్నారు.

ఈ ఓటర్లను ఆకర్శించడానికి రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అంతేకాదు ఐటీ నిపుణులతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. సోషల్ మీడియాపై పట్టు ఉన్న టీమ్స్‌ను నియమించుకున్నాయి. యువతను చేరుకునేందుకు ఉన్న మార్గాల కోసం భారీగా ఎత్తున్న ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంమది. యువత కోసం కార్యక్రమాలను కూడా ప్లాన్ చేస్తున్నాయి. యువత సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటంతో, డిజిటల్ ప్రచారాలను వేదికగా చేసుకుంటున్నాయి పార్టీలు.

మెుత్తం ఓటర్లలో 1,53,848 మంది 40 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసుగల ఓటర్లు కూడా కీలలక పాత్ర పోషిస్తారు. ఇందులో జీతాలు పొందే ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. దాదాపు 62,499 మంది ఓటర్లు 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.

మధ్య వయస్కులైన ఓటర్లను ఆకర్శించేందుకు పార్టీలు సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తున్నాయి. పాలక పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకం గురించి చెబుతోంది. బీఆర్ఎస్ పార్టీ తమ హయాంలోని కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను గుర్తు చేస్తోంది. ఇక బీజేపీ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది.

పోలింగ్‌కు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో ప్రచారం ఊపందుకుంది. 30 నుంచి 39 వయసు గల వారిలో 96,185 మంది ఓటర్లు ఉన్నారు. 40 నుంచి 49 సంవత్సరాల వయస్సు గలవారు 87,492, 50 నుంచి 59 మధ్య 67703 మంది ఓటర్లు ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల వయసు ఓటర్లు 12,380 మంది ఉన్నారు. 20 నుంచి 29 ఏళ్ల వయస్సు వారు 72540 మంది ఓటర్లు ఉన్నారు.

ఈ మేరకు రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను రచిస్తున్నాయి. విద్యార్థులు, మెుదటిసారి ఓటర్లు నేరుగా చేసుకోవడానికి యూత్ టీమ్స్‌ను ఏర్పాటు చేశాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో యువత ఓట్లు చాలా కీలకం కానున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు వారిని ప్రసన్నం చేసుకుంటున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More