...
...
Next Story

అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అర్హులేనా? ఫోన్ లో స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'అన్నదాత సుఖీభవ' పథకం డబ్బులను వచ్చే నెలలో విడుదల చేయనుంది. పీఎం కిసాన్ 20వ విడత డబ్బులతో కలిపి ఈ పెట్టుబడి సాయం అందించనుంది. అయితే అన్నదాత సుఖీభ పథకానికి మీ అర్హులు అవుతారా? స్టేటస్ ను ఇలా తనిఖీ చేయవచ్చు.

Published on: May 19, 2025, 14:33:50 IST
By
Prefer HTon Google
Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఏడాది మూడు విడతల్లో రూ. 20 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాది మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.6 వేలు జమ చేస్తుంది.

ఈసారి ఖాతాల్లో రూ.6500?

అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అర్హులేనా? ఫోన్ లో స్టేటస్ ఇలా చెక్ చేసుకండి
అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అర్హులేనా? ఫోన్ లో స్టేటస్ ఇలా చెక్ చేసుకండి

అన్నదాత సుఖీభవ పథకం కింద మిగిలిన రూ.14 వేలు రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తారు. అంటే ప్రతి విడతలో రైతులకు రూ.6500 జమ చేయనున్నారు. అయితే పీఎం కిసాన్, ఫార్మర్ రిజిస్ట్రీ డేటా ఆధారంగా అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది.

ఈసారి పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ డబ్బులు రైతు ఖాతాల్లో జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

పీఎం కిసాన్ డబ్బులు

జూన్ నెలలో పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ డబ్బులతో కలిపి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం రైతులకు అందించనున్నారు.

ఇటీవల జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో జూన్ నెలలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

ఫోన్ లోనే సులభంగా

అయితే అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అర్హులేనా, మీ పేరు అర్హుల జాబితాలో ఉందా? మీరే సులభంగా ఫోన్ లో తనిఖీ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్వెబ్ సైట్ లో మీ వివరాలు తనిఖీ చేసుకోవచ్చు.

అన్నదాత సుఖీభవ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

  • అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ పై క్లిక్ చేయండి.
  • హోంపేజీలోని 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • రైతు ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి.
  • ఆ తర్వాత 'Search' ఆప్షన్ పై క్లిక్ చేస్తే స్టేటస్ చూపిస్తుంది.
  • స్టేటస్ 'Approved' అని ఉంటే అన్నదాత సుఖీభ పథకానికి అర్హులు

రైతు సేవా కేంద్రంలో

జిల్లా స్థాయిలో ఈ జాబితా పరిశీలన పూర్తయిన తర్వాత వెబ్‌ల్యాండ్‌ వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తారు. అనంతరం మరోసారి ఈ వివరాలను ఆర్‌జీఎస్‌కు పంపుతారని సమాచారం.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks