...
...
Next Story

తిరుమల శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలు కానుక.. ఎవరు ఈ భక్తుడు?

Tirumala Temple 121 KG Gold : తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు 121 కేజీల బంగారం కానుకగా ఇచ్చారు. టీటీడీ చరిత్రలో ఇంతటి ఆభరణాలు అందజేయడం.. ఇదే మెుదటిసారి అని చెబుతున్నారు.

Updated on: Nov 26, 2026, 12:41:55 IST
Advertisement

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ఏకంగా 121 కేజీల బంగారు ఆభరణాలను ఓ భక్తుడు కానుకగా అందజేశారు. వీటి విలువ సుమారు రూ.206 కోట్లుగా ఉంటుంది. తన కంపెనీలో 60 శాతం వాటాను విక్రయించడం ద్వారా చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వర్దమాన్ జైన్ ఈ కానుక అందించారు. తన వ్యాపార విజయానికి శ్రీవారి ఆశీస్సులే కారణమని భావించి ఈ భారీ కానుకను సమర్పించారు.

తిరుమల శ్రీవారికి భారీగా ఆభరణాలు కానుక
తిరుమల శ్రీవారికి భారీగా ఆభరణాలు కానుక

45 ఆభరణాలను 9 సెట్లుగా తయారుచేయించి శ్రీవారికి అందించారు. తిరుమల చరిత్రలో భక్తుడి నుంచి తిరుమలకు అందిన అతిపెద్ద బంగారు కానుకల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఇంతటి భారీ మెుత్తం ఆభరణాలు తిరుమలేశుడికి సీఎం చంద్రబాబు సమక్షంలో వర్దమాన్ జైన్ ఫ్యామిలీ అందించింది.

వర్దమాన్ జైన్ 2025 జనవరిలో స్వామివారికి రూ.6కోట్లు, మేలో ఎలక్ట్రిక్ బస్సులను అందించారు. తాజాగా ఇచ్చిన కానుకలో మూలవిరాట్, ఉత్సవ విగ్రహాలను అలంకరించడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన, తొమ్మిది సెట్లుగా అమర్చిన 47 బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇందులో శ్రీవారి కిరీటం, పద్మ పాదాలు (పవిత్రమైన తామర పాదాల ఆభరణాలు), విగ్రహానికి మిగిలిన అలంకరణను అందించే ఇతర సాంప్రదాయ ఆభరణాలు ఉన్నాయి.

ఈ ఆభరణాలను చెన్నైకి చెందిన ఓ జ్యువెలర్స్ వారు ప్రత్యేకంగా తయారు చేశారు. వాటిని కట్టుదిట్టమైన భద్రత నడుమ తిరుమలకు తరలించారు. ట్రంకు పెట్టెల్లోశ్రీవారి ఆలయానికి వాటిని తీసుకొచ్చారు. ప్రత్యేకంగా నిర్మించిన ప్లైవుడ్ డిస్‌ప్లే ర్యాక్‌లను ఉపయోగించి, రంగనాయకుల మండపంలో ఈ ఆభరణాల సేకరణను ప్రదర్శించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

స్వామివారు నిత్యం 120 కేజీల బంగారు ఆభరణాలను ధరిస్తారు. ఇప్పుడు వర్దమాన్ జైన్ 121 కేజీల ఆభరణాలను కానుకగా సమర్పించారు.

వర్దమాన్ జైన్ ఒక కంపెనీని స్థాపించి.. విజయవంతంగా నిర్వహించారు. అందులోని వాటా విక్రయం ద్వారా వచ్చిన డబ్బును స్వామివారికి కానుకగా సమర్పించారు. అదంతా స్వామివారి అనుగ్రహమేనని వర్దమాన్ నమ్మకం. ఈ కానుకను భారతదేశ చరిత్రలో ఒక వ్యక్తి ఆలయానికి ఇచ్చిన అతిపెద్ద కానుకల్లో ఒకటిగా అభివర్ణిస్తున్నారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks