రాష్ట్రంలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న 14 వంతెనల (బ్రిడ్జిల) నిర్మాణ పనులను పూర్తి చేయడానికి రూ.90.20 కోట్లు మంజూరు చేసినట్లు రహదారులు, భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఈ వంతెనలు.. ముఖ్యంగా భూసేకరణ సమస్యల కారణంగా గత కొన్నేళ్లుగా నిలిచిపోయాయి. ఈ 14 వంతెనలలో రెండు రాష్ట్ర రహదారులపై, మిగిలినవి ప్రధాన జిల్లా రహదారులపై ఉన్నాయి.

గతంలో పలు కారణాల వల్ల నిలిచిపోయిన ఈ బ్రిడ్జి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు మంత్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు. మాడుగులలో 2 వంతెనలు ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున అంటే అనకాపల్లి, పాయకరావుపేట, పిఠాపురం, కైకలూరు, భీమవరం, గన్నవరం, పెనమలూరు, దర్శి, సత్యవేడు, గూడూరు, పులివెందుల, జగ్గయ్యపేటలో ఉన్నాయి.
ఈ 14 ప్రాజెక్టులలో 11 వంతెనల నిర్మాణం గతంలోనే పూర్తయినప్పటికీ, అనుసంధాన రహదారులు (అప్రోచ్ రోడ్లు) లేకపోవడం వల్ల అవి వినియోగంలోకి రాలేదని మంత్రి తెలిపారు. దీంతో 11 వంతెనలు ప్రజలకు ఉపయోగపడకుండా పోయాయి. మిగిలిన మూడు ప్రాజెక్టులలో అటు వంతెన నిర్మాణంతో పాటు, ఇటు అప్రోచ్ రోడ్ల పనులు కూడా ఇంకా పూర్తి కావాల్సి ఉంది.
భూసేకరణ ప్రక్రియలో జరిగిన సుదీర్ఘ జాప్యమే ఈ ప్రాజెక్టులు నిలిచిపోవడానికి ప్రధాన కారణమని మంత్రి పేర్కొన్నారు. కొన్ని ప్రాజెక్టులను గతంలో నాబార్డ్ పథకం కింద చేపట్టినప్పటికీ, పనుల్లో ఆలస్యం కావడం వల్ల ఆ పథకం గడువు ముగిసిపోయిందని వివరించారు. నిలిచిపోయిన ఈ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన నిధులను కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని.. అవసరమైన నిధులను మంజూరు చేసిందని మంత్రి జనార్ధన్ తెలిపారు. ఈ వంతెనలను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
{{/usCountry}}రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని.. అవసరమైన నిధులను మంజూరు చేసిందని మంత్రి జనార్ధన్ తెలిపారు. ఈ వంతెనలను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
{{/usCountry}}