అనకాపల్లి నుంచి పులివెందుల వరకు నిలిచిపోయిన 14 వంతెనలు త్వరలో పూర్తి

అనకాపల్లి నుంచి పులివెందుల వరకు నిలిచిపోయిన 14 వంతెనలను త్వరలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోస రూ.90.20 కోట్లను మంజూరు చేసింది.

Published on: Jul 6, 2026, 14:09:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న 14 వంతెనల (బ్రిడ్జిల) నిర్మాణ పనులను పూర్తి చేయడానికి రూ.90.20 కోట్లు మంజూరు చేసినట్లు రహదారులు, భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఈ వంతెనలు.. ముఖ్యంగా భూసేకరణ సమస్యల కారణంగా గత కొన్నేళ్లుగా నిలిచిపోయాయి. ఈ 14 వంతెనలలో రెండు రాష్ట్ర రహదారులపై, మిగిలినవి ప్రధాన జిల్లా రహదారులపై ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

గతంలో పలు కారణాల వల్ల నిలిచిపోయిన ఈ బ్రిడ్జి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు మంత్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు. మాడుగులలో 2 వంతెనలు ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున అంటే అనకాపల్లి, పాయకరావుపేట, పిఠాపురం, కైకలూరు, భీమవరం, గన్నవరం, పెనమలూరు, దర్శి, సత్యవేడు, గూడూరు, పులివెందుల, జగ్గయ్యపేటలో ఉన్నాయి.

ఈ 14 ప్రాజెక్టులలో 11 వంతెనల నిర్మాణం గతంలోనే పూర్తయినప్పటికీ, అనుసంధాన రహదారులు (అప్రోచ్ రోడ్లు) లేకపోవడం వల్ల అవి వినియోగంలోకి రాలేదని మంత్రి తెలిపారు. దీంతో 11 వంతెనలు ప్రజలకు ఉపయోగపడకుండా పోయాయి. మిగిలిన మూడు ప్రాజెక్టులలో అటు వంతెన నిర్మాణంతో పాటు, ఇటు అప్రోచ్ రోడ్ల పనులు కూడా ఇంకా పూర్తి కావాల్సి ఉంది.

భూసేకరణ ప్రక్రియలో జరిగిన సుదీర్ఘ జాప్యమే ఈ ప్రాజెక్టులు నిలిచిపోవడానికి ప్రధాన కారణమని మంత్రి పేర్కొన్నారు. కొన్ని ప్రాజెక్టులను గతంలో నాబార్డ్ పథకం కింద చేపట్టినప్పటికీ, పనుల్లో ఆలస్యం కావడం వల్ల ఆ పథకం గడువు ముగిసిపోయిందని వివరించారు. నిలిచిపోయిన ఈ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన నిధులను కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని.. అవసరమైన నిధులను మంజూరు చేసిందని మంత్రి జనార్ధన్ తెలిపారు. ఈ వంతెనలను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More