...
...
Next Story

ఈ నాలుగు జిల్లాల్లో 2బీహెచ్‌కే కాలనీల్లోని 1,400 దుకాణాలకు వేలం

Hyderabad : 2బీహెచ్‌కే కాలనీల్లోని 1,400 దుకాణాలకు వేలం వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నాలుగు జిల్లాల పరిధిలో ఈ వేలం జరుగుతుంది.

Updated on: Apr 9, 2026, 07:25:33 IST
Advertisement

హైదరాబాద్, రంగారెడ్డి , మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 36.. 2BHK హౌసింగ్ కాలనీలలో ఉన్న 1,400కు పైగా దుకాణాలను ఏప్రిల్ 9 నుంచి వేలం వేస్తున్నారు. రోజువారీ అవసరాలను తీర్చడానికి, స్థానిక వ్యాపార కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, నివాస కాలనీలలో 60 నుండి 400 చదరపు అడుగుల పరిధిలో దుకాణాలను నిర్మించారు. సంబంధిత జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేశారు.

2బీహెచ్‌కే కాలనీల్లో వేలం
2బీహెచ్‌కే కాలనీల్లో వేలం

మొదటి దశలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది కాలనీలలోని 273 దుకాణాలకు ఏప్రిల్ 9, 10 తేదీలలో వేలం నిర్వహించనున్నారు. రెండో దశలో, హైదరాబాద్‌లోని 10 కాలనీలలోని 77 దుకాణాలను ఏప్రిల్ 15, 16 తేదీలలో వేలం వేయనున్నారు.

అదేవిధంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 12 కాలనీలలో ఉన్న 892 దుకాణాలను ఏప్రిల్ 15, 17 తేదీలలో వేలం వేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఆరు కాలనీలలో ఉన్న 372 దుకాణాలను ఏప్రిల్ 15, 18, 21 తేదీలలో వేలం వేయనున్నారు.

దుకాణాలను ఉన్నది ఉన్నట్లుగా, ఉన్నచోటనే వేలం వేస్తున్నారు. అయితే కనీస ధరలు ప్రస్తుత మార్కెట్ ధరల కంటే తక్కువగా నిర్ణయించారు. ఆసక్తిగల బిడ్డర్లు కాలనీలను సందర్శించి, అనువైన దుకాణాలను గుర్తించి, నిర్ణీత వేలం తేదీలలో ఉదయం 11 గంటలలోపు సంబంధిత రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో అవసరమైన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) సమర్పించి వేలం కోసం నమోదు చేసుకోవచ్చు.

ఈ దుకాణాల వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా కాలనీల అభివృద్ధి, నిర్వహణ కోసం మాత్రమే వినియోగిస్తారు. వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కార్పస్ ఫండ్‌గా నిర్వహిస్తారు. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని, నివాసితుల నుండి వచ్చే నెలవారీ నిర్వహణ విరాళాలతో కలిపి, లైటింగ్, లిఫ్టులు, బోర్‌వెల్‌ల వంటి ఉమ్మడి అవసరాల నిర్వహణకు వినియోగిస్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks