చిన్నారుల కోసం కొత్తగా 15 న్యూట్రిషన్ కేంద్రాలు - ఎక్కడెక్కడంటే...

చిన్నారుల కోసం కొత్తగా 15 న్యూట్రిషన్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో 11 గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో కొలువుదీరనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డించారు.

Published on: Nov 22, 2025, 11:10:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని ముఖ్యమైన 15 ప్రభుత్వాసుపత్రుల్లో 'న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్స్' (ఎన్.ఆర్.సి.లు) త్వ‌ర‌లో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర‌ వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌ కుమార్ యాద‌వ్ తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా ఐదేళ్లలోపు వయస్సు కలిగిన చిన్నారుల‌కు సేవ‌లందుతాయి. ఈ 15లో 11 గిరిజన ప్రాంతాల్లో వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. వీట‌న్నిటిలో క‌లిపి 115 పడకలు చిన్నారులకు అందుబాటులోకి రానున్నాయ‌ని, ప్రస్తుతం రాష్ట్రంలో 21 ఎన్ఆర్సీలు ఉండగా... వీటిల్లో 340 పడకలు ఉన్నాయని తెలిపారు.

ఏపీలో 15 న్యూట్రిషన్ కేంద్రాలు
ఏపీలో 15 న్యూట్రిషన్ కేంద్రాలు

2 వారాలపాటు సేవలు…

ఆశా, ఎ.ఎన్.ఎం.ల నుంచి అందే సమాచారంతో పీహెచ్సీ వైద్యులు పరిక్షలు చేసిన అనంతరం సదరు చిన్నారులను సమీపంలోని ఎన్ఆర్సీలకు పంపుతారు. ఈ కేంద్రాల్లో చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా? లేదా అని పరిశీలించి ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ కేంద్రాల్లోనే ఉండే న్యూట్రిషన్ కౌన్సిలర్లు చిన్నారులకు ఎలాంటి ఆహారం (పీడింగ్) ఇవ్వాలన్న దాని పై చేసిన సిఫారసున‌నుసరించి సిబ్బంది సమకూరుస్తారు. ఇలా 2 వారాలపాటు వైద్యంతోపాటు సమాంతరంగా పౌష్టికాహారం (ప్రొటీన్ రిచ్ పుడ్) చిన్నారులకు అందిస్తారు.

ఏర్పాటయ్యే ప్రాంతాలు…

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఏరియా ఆసుప‌త్రి, ముంచింగిపట్టు, చింతపల్లి సీహెచ్సిల్లో వచ్చే ఈ సెంటర్లలో 10 చొప్పున పడకలు ఉంటాయి. అనకాపల్లి జిల్లా అసుపత్రి, బాపట్ల, పల్నాడు ఏరియా ఆసుప‌త్రులు, ప‌ల్నాడు జిల్లా నరసరావుపేట ఏరియా ఆసుప‌త్రి, నంద్యాల జిల్లా నంద్యాల బోధనాసుపత్రి, సున్నిపెంట ఏరియా ఆసుపత్రిలో వచ్చే ఈ కేంద్రాల్లో 10 చొప్పున పడకలు ఉంటాయి. ఈ పడకల కోసం ప్రతి ఆసుపత్రిలో ప్రత్యేకంగా వార్డులు ఏర్పడతాయి.

పార్వతీపురం జిల్లా సాలూరు , పాలకొండ ఏరియా ఆసుప‌త్రులు, భద్రగిరి , కురుపాం, చిన్నమరంగి సీహెచ్సీల్లో, అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల ఏరియా ఆసుప‌త్రి, రామవరం సీహెచ్సీల్లో ఉన్న పడకలకు అదనంగా ఐదు చొప్పున ఈ సెంటర్ల కింద రానున్నాయి. 13 బోధనాసుపత్రుల్లో 20 చొప్పున, 8 జిల్లా, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పది చొప్పున పడకలు ఉన్నాయి. వీటి ద్వారా చిన్నారులు ప్రయోజనం పొందుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఈ కేంద్రాల కార్యకలాపాలు కొన‌సాగుతాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More