రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే మూడేళ్లలోపు పూర్తి చేస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి…. రాజధాని పనులను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే మరింత భూమిని కూడా సేకరించాలని నిర్ణయించింది. ఇందుకు అన్ని అనుమతులు రాగా…. నేటి నుంచి రెండో విడత భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
అమరావతిలో 2వ విడత భూసేకరణ - 8 ముఖ్యమైన అంశాలు:
- రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం భూమిని సేకరించిన సంగతి తెలిసిందే. అయితే రెండో విడత భూసేకరణ ప్రక్రియను జనవరి 7వ తేదీన ప్రభుత్వం ప్రారంభించింది.
- తుళ్లూరు మండలం వడ్డమానులో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు.
- ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ చేసిన 34వేల ఎకరాల భూమిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. 4026 అధికారుల భవనాల నిర్మాణంలో వేగం పుంజుకుంది.
- 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు పనులు నిర్ణయించుకున్న గడువులోపు పూర్తి చేసే దిశగా ఏసీఆర్డీఏ అడుగులు వేస్తోంది.
- రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీల నిర్మాణం కోసం 7 గ్రామాల్లో దశలవారీగా రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేస్తారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అనంతరం ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభిస్తారు. వీటిలో ముఖ్యంగా రెండు వరుసల రహదారులు, అండర్ గ్రౌండ్ కేబుల్స్, వాటర్ లైన్స్ తదితర ఏర్పాట్లు చేస్తారు.
- వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి గ్రామాల పరిధిలోని 9097 .56 ఎకరాల పట్టాభూమి, 7.01ఎకరాల అసైన్డ్ భూమి, అదేవిధంగా పల్నాడు జిల్లాలోని నాలుగు గ్రామాల్లో మొత్తం 7465 ఎకరాలు పట్టా భూమి, 97 ఎకరాల అసైన్డ్ మొత్తంగా 16,666.57 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తారు.
- రైతులకు ఇచ్చే ప్లాట్లు, మౌలిక వసతుల కల్పన తదుపరి మిగిలిన 2500 ఎకరాల భూమిలో స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ కు వినియోగిస్తారు.
- ప్రస్తుతం వైకుంఠపురం, పెద్దమద్దూరు, యండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో నోటిపికేషన్ ప్రకటించడం జరిగింది. ఈ నాలుగు గ్రామాల్లో 9500 ఎకరాల్లో రెవెన్యూ ల్యాండ్ ఉంది. రైతులకు చెందిన భూమి 7500 ఎకరాలు ఉంది.

{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}