రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత సమర్థవంతంగా పరిరక్షించేందుకు, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా నాలుగు ప్రధాన నగరాల్లో కొత్తగా పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలులో కొత్తగా కమిషనరేట్లు ఏర్పాటు కావడం వల్ల నేరాల నియంత్రణ సులువవ్వడంతో పాటు ప్రజలకు పోలీసు సేవలు మరింత వేగంగా అందుతాయని మంత్రివర్గం అభిప్రాయపడింది.

అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు క్యాబినెట్ భారీగా నిధులు కేటాయించింది. అమరావతి రాజధాని పరిధిలోని గ్రామాల్లో రూ.1,548 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు ఆమోదం లభించింది. రాజధాని మౌలిక సదుపాయాల కోసం అదనంగా రూ.644.98 కోట్లు కేటాయించారు. ప్రతిష్టాత్మక శాసనసభ భవన స్పైర్, రూఫ్, లిఫ్ట్ నిర్మాణ పనుల కోసం రూ.661 కోట్లకు ఆమోదం తెలిపారు. భూసమీకరణ కింద భూములిచ్చిన రైతులకు కనీస యాన్యుటీ చెల్లించేలా నిబంధనలలో సవరణలు చేశారు.
రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలను తీర్చే హంద్రీనీవా సుజల స్రవంతి (HNSS) ప్రాజెక్టు పురోగతిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. HNSS ఫేజ్-II మిగిలిన పనుల కోసం రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరైన నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.
శ్రీనివాసపురం రిజర్వాయర్ టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, 2027 నాటికి పనులను పూర్తి చేయాలని గడువు విధించారు. రాయచోటి నియోజకవర్గం HNSS మెయిన్ కెనాల్ 490 - 535 కిలోమీటర్ల మధ్య రూ.350 కోట్ల విలువైన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు చంద్రబాబు. శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లను హంద్రీనీవాతో అనుసంధానించి, మార్గమధ్యంలోని దాదాపు 25 వేల ఎకరాలకు పైగా ఉన్న ఖాళీ చెరువులను నీటితో నింపేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. తొలిదశలో మున్సిపాలిటీలు, రెండో దశలో జెడ్పీటీసీ, మూడో దశలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. కూటమిలోని మూడు పార్టీలు అత్యంత ఐక్యతతో పనిచేసి, అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను ఇన్ఛార్జ్ మంత్రులు తీసుకోవాలని స్పష్టం చేశారు.
{{/usCountry}}రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. తొలిదశలో మున్సిపాలిటీలు, రెండో దశలో జెడ్పీటీసీ, మూడో దశలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. కూటమిలోని మూడు పార్టీలు అత్యంత ఐక్యతతో పనిచేసి, అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను ఇన్ఛార్జ్ మంత్రులు తీసుకోవాలని స్పష్టం చేశారు.
{{/usCountry}}రాజకీయాల ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులో కూర్చొని రౌడీషీటర్లు, క్రిమినల్స్‌తో ప్రతిపక్ష నేత నేరాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులకు చేటు కలిగించే చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే, ఆ నష్టాన్ని సదరు వ్యక్తుల నుంచే వసూలు చేసేలా కఠినమైన చట్టం తీసుకురావాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.
రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించి పంటలు వేసేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా మదనపల్లిలో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు అక్టోబర్ 2న శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.