ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - 22ఏ జాబితా నుంచి 5 రకాల భూములు తొలగింపు

రాష్ట్రంలోని 22ఏ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 5 రకాల భూములను సంబంధిత జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సంతకం చేశారు.

Published on: Jan 1, 2026, 14:24:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్త సంవత్సరం వేళ 22ఏ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 5 రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సంతకం చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

22ఏ భూములపై కీలక నిర్ణయం
22ఏ భూములపై కీలక నిర్ణయం

సుమోటోగా తొలిగించాలని - మంత్రి అనగాని

ప్రైవేటు భూములను 22ఏ జాబితా నుంచి పూర్తిగా తొలగించినట్లు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ప్రైవేటు పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాలని స్పష్టం చేశారు. ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూముల పత్రాలుంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు.

స్వాతంత్ర్య సమరయోధుల భూములను కూడా 22ఏ నుంచి తొలగించాలని… రాజకీయ బాధితులకు కేటాయించిన భూములను కూడా 22ఏ నుండి తొలగించాలని మంత్రి అనగాని పేర్కొన్నారు. భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమాధికారి సిఫార్సుల రిజిస్టర్ సరిపోతుందన్నారు. 10(1) రిజిస్టర్, అడంగల్స్, ఎస్ఎఫ్‌ఏ వంటి పాత రెవెన్యూ రికార్డులున్నా సరిపోతుందని క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరిన తర్వాత… 22ఏ భూముల వివాదంపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. నిషిద్ధ జాబితా (22ఏ)లోకి ప్రైవేటు భూములను అక్రమంగా చేర్చినట్లు అందిన ఫిర్యాదులపై లోతుగా విచారణ చేపట్టింది. కలెక్టర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

ఫిర్యాదులపై కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు సంబంధిత ప్రాంతాల ఆర్డీఓలతో విచారణ చేయించేలా చర్యలు తీసుకుంది. సమగ్ర పరిశీలన అనంతరం నిషిద్ధ జాబితా నుంచి తప్పించాలని.. లేదా కొనసాగించాలని ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు భూములు నిషిద్ధ జాబితా (22 ఏ, బీ, సీ, డీ, ఈ)లో ఉండకూడదని స్పష్టం చేసింది.

కొన్నిచోట్ల సబ్‌ డివిజన్‌ వారీగా కాకుండా... సర్వే నంబరులో ఉన్న భూమి మొత్తాన్ని నిషిద్ధ జాబితాలోకి చేర్చారు. వీటిపై కూడా విచారణ జరిపి… చర్యలు తీసుకున్నారు. అన్ని కోణాల్లో విచారణ జరిపిన తర్వాత…తాజాగా 5 రకాల భూములను పూర్తిగా 22ఏ జాబితా నుంచి తొలగించారు. మరో 4 రకాల భూములపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More