రాష్ట్ర వ్యాప్తంగా పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు అందిస్తున్న 6 లక్షల ఉచిత సోలార్ విద్యుత్ కనెక్షన్లను వేసవిలోపు పూర్తి చేస్తామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. సోలార్‌తో పర్యావరణానికి ఎటువంటి నష్టం లేని నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని నాగేశ్వరపురం తండాలో 79 కుటుంబాలకు ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్‌ను స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుతో కలిసి మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ., రాష్ట్రంలోని 200 యూనిట్లలోపు వినియోగించే 6 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 2 కిలోవాట్ల సోలార్ యూనిట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ, ఎస్టీలకు రూ.1.25 లక్షల విలువైన సోలార్ విద్యుత్ యూనిట్‌లను పూర్తి ఉచితంగా ఏర్పాటు చేయడం సీఎం చంద్రబాబు ఆలోచనలకు, దార్శనికతకు నిదర్శనమన్నారు. నాగేశ్వరపురం తండాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలలో ఇష్టమైన వారందరికీ ఉచితంగానే సోలార్ యూనిట్లను వారి ఇళ్లపై ఏర్పాటు చేస్తామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు.
'లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానెల్స్ 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచినా ఎటూ కదలి పోకుండా, డైరక్షన్ మారకుండా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నాం. సోలార్ యూనిట్ ఏర్పాటు చేసిన తరువాత ఎటువంటి ఇబ్బంది ఎదురైనా., విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇస్తే సమస్యను వెంటనే పరిష్కరిస్తారు. గురజాల నియోజకవర్గంలో మొత్తం 6,500 సోలార్ కనెక్షన్లు ఇస్తాం. గతంలో బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేయడంతో వాతావరణంలో పొల్యూషన్ ఎక్కువ అయ్యేది. ప్రస్తుతం సోలార్, విండ్, వాటర్, బ్యాటరీతో విద్యుత్ ఉత్పత్తి చేయడం వలన పొల్యూషన్ ఎంతో తగ్గుతుంది.' అని గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
రాబోయే రోజుల్లో వ్యవసాయానికి కూడా పగటి పూటే 9 గంటల నిరంతరాయ నాణ్యమైన విద్యుత్‌ను సోలార్ ద్వారా అందిస్తామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో విద్యుత్ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందన్నారు. జగన్మోహన్ రెడ్డి 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడమే కాకుండా, ప్రజలపై మోయలేని భారాలు మోపారని మంత్రి విమర్శించారు. ఎప్పుడూ లేని విధంగా 13పైసలు ట్రూ డౌన్ కూడా చేశామని గుర్తు చేశారు.
{{/usCountry}}రాబోయే రోజుల్లో వ్యవసాయానికి కూడా పగటి పూటే 9 గంటల నిరంతరాయ నాణ్యమైన విద్యుత్‌ను సోలార్ ద్వారా అందిస్తామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో విద్యుత్ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందన్నారు. జగన్మోహన్ రెడ్డి 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడమే కాకుండా, ప్రజలపై మోయలేని భారాలు మోపారని మంత్రి విమర్శించారు. ఎప్పుడూ లేని విధంగా 13పైసలు ట్రూ డౌన్ కూడా చేశామని గుర్తు చేశారు.
{{/usCountry}}