వేసవిలోపు 6 లక్షల సూర్యఘర్ ఉచిత కనెక్షన్లు.. త్వరలోనే వ్యవసాయానికి పగటిపూట 9 గంటల సోలార్ విద్యుత్

pm surya ghar : 6 లక్షల సూర్యఘర్ ఉచిత కనెక్షన్లు వేసవిలోపు పూర్తి చేయనున్నట్టుగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. త్వరలోనే వ్యవసాయానికి పగటి పూట 9 గంటల సోలార్ విద్యుత్ అందిస్తామని వెల్లడించారు.

Updated on: Apr 6, 2026, 19:12:42 IST
By , Gurazala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర వ్యాప్తంగా పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు అందిస్తున్న 6 లక్షల ఉచిత సోలార్ విద్యుత్ కనెక్షన్లను వేసవిలోపు పూర్తి చేస్తామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. సోలార్‌తో ప‌ర్యావ‌ర‌ణానికి ఎటువంటి న‌ష్టం లేని నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

పీఎం సూర్యఘర్
పీఎం సూర్యఘర్

పీఎం సూర్యఘ‌ర్ ప‌థ‌కంలో భాగంగా ప‌ల్నాడు జిల్లా గురజాల నియోజ‌క‌వ‌ర్గంలోని నాగేశ్వర‌పురం తండాలో 79 కుటుంబాల‌కు ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్‌ను స్థానిక ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవ‌రాయ‌లుతో క‌లిసి మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ., రాష్ట్రంలోని 200 యూనిట్లలోపు వినియోగించే 6 ల‌క్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాల‌కు 2 కిలోవాట్ల సోలార్ యూనిట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ, ఎస్టీల‌కు రూ.1.25 ల‌క్షల విలువైన‌ సోలార్ విద్యుత్ యూనిట్‌ల‌ను పూర్తి ఉచితంగా ఏర్పాటు చేయ‌డం సీఎం చంద్రబాబు ఆలోచ‌న‌ల‌కు, దార్శనిక‌త‌కు నిద‌ర్శనమ‌న్నారు. నాగేశ్వర‌పురం తండాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాల‌లో ఇష్టమైన వారంద‌రికీ ఉచితంగానే సోలార్ యూనిట్లను వారి ఇళ్లపై ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు.

'ల‌బ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానెల్స్ 150 కిలో మీట‌ర్ల వేగంతో గాలులు వీచినా ఎటూ క‌ద‌లి పోకుండా, డైర‌క్షన్ మార‌కుండా ఉండే విధంగా చ‌ర్యలు చేప‌డుతున్నాం. సోలార్ యూనిట్ ఏర్పాటు చేసిన త‌రువాత‌ ఎటువంటి ఇబ్బంది ఎదురైనా., విద్యుత్ శాఖ అధికారుల‌కు స‌మాచారం ఇస్తే స‌మ‌స్యను వెంట‌నే ప‌రిష్కరిస్తార‌ు. గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 6,500 సోలార్ క‌నెక్షన్లు ఇస్తాం. గ‌తంలో బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేయ‌డంతో వాతావ‌ర‌ణంలో పొల్యూష‌న్ ఎక్కువ అయ్యేది. ప్రస్తుతం సోలార్, విండ్, వాట‌ర్, బ్యాట‌రీతో విద్యుత్ ఉత్పత్తి చేయ‌డం వ‌ల‌న పొల్యూష‌న్ ఎంతో త‌గ్గుతుంది.' అని గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.

రాబోయే రోజుల్లో వ్యవ‌సాయానికి కూడా ప‌గ‌టి పూటే 9 గంట‌ల నిరంత‌రాయ నాణ్యమైన విద్యుత్‌ను సోలార్ ద్వారా అందిస్తామ‌ని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో విద్యుత్ వ్యవ‌స్థను పూర్తిగా భ్రష్టు ప‌ట్టించింద‌న్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 9 సార్లు విద్యుత్ ఛార్జీల‌ను పెంచ‌డ‌మే కాకుండా, ప్రజ‌ల‌పై మోయ‌లేని భారాలు మోపార‌ని మంత్రి విమ‌ర్శించారు. ఎప్పుడూ లేని విధంగా 13పైస‌లు ట్రూ డౌన్ కూడా చేశామ‌ని గుర్తు చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More