...
...
Next Story

APSRTC : మరికొన్ని రోజుల్లో రోడ్లపైకి 750 ఎలక్ట్రిక్ బస్సులు.. 12 డిపోలలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు

Electric Bus : ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని రోజుల్లో 750 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్ల మీదకు రానున్నాయి. వీటి కోసం అధికారులు ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు.

Published on: Apr 12, 2026, 06:35:56 IST
Advertisement

పీఎం ఈ-బస్ సేవా పథకం కింద ఏపీలోని 11 నగరాలకు కేంద్ర ప్రభుత్వం 750 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. వీటి నిర్వహణ కోసం ఈవీ ఛార్జింగ్ పాయింట్ల విస్తృత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. 11 నగరాల్లో తిరగనున్న 750 ఈ-బస్సులను రీఛార్జ్ చేసేందుకు, ఏపీఎస్ఆర్టీసీ తన 12 డిపోలలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడానికి విద్యుత్, సివిల్ పనులను చేపడుతోంది.

ఎలక్ట్రిక్ బస్సులు
ఎలక్ట్రిక్ బస్సులు

మూడు నెలల్లోగా ఆంధ్రప్రదేశ్‌లో 750 ఎలక్ట్రిక్ బస్సులన్నీ నడుస్తాయని మేం ఆశిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎ. అప్పల రాజు అన్నారు.

విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాలకు 100, కాకినాడ, రాజమహేంద్రవరం, అమరావతి, కడప, తిరుపతి, కర్నూలు, అనంతపురం నగరాలకు 50 చొప్పున ఈ-బస్సులు కేటాయించారు.

సాధారణ నియమం ప్రకారం ఐదు ఈ-బస్సులను రీఛార్జ్ చేయడానికి ఒక ఈవీ ఛార్జర్ అవసరం. దీనికి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు 11 నగరాల్లో, వాటి పరిసర ప్రాంతాల్లోని తమ డిపోలలో ఈవీ ఛార్జర్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఒక ఈ-బస్సును పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఒకసారి ఛార్జ్ అయిన తర్వాత ఈ-బస్సు 180–200 కిలోమీటర్ల వరకు నడుస్తుందని అంచనా. ఎలక్ట్రిక్ బస్సులను నడిపే డ్రైవర్లకు ఒక స్పష్టమైన సూచన ఇస్తున్నారు. అదేమిటంటే వారి డాష్‌బోర్డ్‌లో ఛార్జ్ స్థాయి ఎంత ఉన్నప్పటికీ, బస్సు 170 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత దానిని ఛార్జింగ్ కోసం వారి వారి డిపోలకు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఛార్జింగ్ లేకపోవడం వల్ల ఏ ఈ-బస్సు కూడా రోడ్డుపై ఆగిపోకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకుంటున్నారు.

ముఖ్యంగా ఛార్జింగ్ స్టేషన్లలో సివిల్ పనులు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఆర్థిక సహాయం అందిస్తోంది. హెచ్‌టీ లైన్లు వేయడం, ఈవీ ఛార్జర్‌లను ఏర్పాటు చేయడం వంటి విద్యుత్ పనులకు కేంద్రం అందించే ఆర్థిక సహాయం 100 శాతంగా ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe