Electric car : వావ్​! ఈ బెస్ట్​ సెల్లింగ్​ ఈవీపై పబ్లిక్​ ఛార్జింగ్​ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ- భారీ ఆఫర్స్​ కూడా

MG Windsor pro : 449 కి.మీ వరకు రేంజ్​ని ఇచ్చే ఎంజీ విండ్సర్​ ప్రో కొనాలని ప్లాన్​ చేస్తున్న వారికి ఇదే సరైన సమయం! ఈ మోడల్​పై సంస్థ భారీ ఆఫర్లతో పాటు ఫ్రీ పబ్లిక్​ ఛార్జింగ్​ ఫెసిలిటీని సైతం అందిస్తోంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 14, 2026, 06:01:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ వాహన తయారీ సంస్థ జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్ కారు ‘ఎంజీ విండ్సర్ ప్రో’పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. అంతే కాదు పబ్లిక్​ ఛార్జింగ్​ ఫెసిలిటీని కూడా ఉచితంగా ఇస్తోంది! విలాసవంతమైన ఫీచర్లు, అద్భుతమైన రేంజ్‌తో వచ్చిన ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం.

ఎంజీ విండ్సర్​ ప్రో..
ఎంజీ విండ్సర్​ ప్రో..

ఎంజీ విండ్సర్​ ప్రో- మార్చి 15లోపు కొంటేనే ఈ ఆఫర్లు!

కొత్త విండ్సర్ ప్రో కొనుగోలుదారులకు కంపెనీ ఒక ఏడాది పాటు ఉచిత పబ్లిక్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే, ఈ ఆఫర్ పొందాలంటే కారు బిల్లింగ్ ప్రక్రియ మార్చి 15వ తేదీలోపు పూర్తి కావాలి.

దీనితో పాటు కస్టమర్లకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలను కూడా ఎంజీ మోటార్ అందిస్తోంది:

ప్రత్యేక ప్రయోజనాలు: రూ. 40,000 వరకు అదనపు బెనిఫిట్స్.

డిప్రిసియేషన్ బెనిఫిట్స్: ఏకంగా రూ. 13.17 లక్షల వరకు డిప్రిసియేషన్ బెనిఫిట్స్​ పొందే అవకాశం ఉంది.

(మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.)

ఎంజీ విండ్సర్​ ప్రో- పవర్, రేంజ్: ఒకే ఛార్జ్‌తో 449 కి.మీ!

ఎంజీ విండ్సర్ ప్రో ఎలక్ట్రిక్​ కారులో శక్తివంతమైన 52.9 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్ అమర్చారు.

పవర్: ఇది 134 బీహెచ్​పీ పీక్​ పవర్​ని, 200 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రేంజ్: ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.

ఎంజీ విండ్సర్​ ప్రో- టెక్నాలజీ, ఫీచర్ల ఖజానా..

టెక్నాలజీకి మారుపేరుగా నిలిచే ఎంజీ, ఈ ఈవీ ప్రో మోడల్‌లో అధునాతన ఫీచర్లను జోడించింది:

డిస్‌ప్లే: 15.6- ఇంచ్​ భారీ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8.8-ఇంచ్​ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే.

లగ్జరీ: పానోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 9-స్పీకర్ల ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్.

భద్రత: 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్.

కొత్త ఫీచర్లు: లెవల్ 2 అడాస్​ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), వెహికల్-టు-లోడ్ (వీ2ఎల్​), వెహికల్-టు-వెహికల్ (వీ2వీ) ఛార్జింగ్ సామర్థ్యాలు కూడా ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్​ కారు ఇంటీరియర్ ఇప్పుడు సరికొత్త టూ-టోన్ ఐవరీ, బ్లాక్ కలర్ స్కీమ్‌తో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. సౌకర్యం కోసం పవర్డ్ టెయిల్‌గేట్‌ను కూడా అందించారు.

ఎంజీ విండ్సర్​ ప్రో- ఈవీ ధర, వేరియంట్లు..

ఎంజీ విండ్సర్ ప్రో ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది:

ఎక్స్‌క్లూజివ్ : రూ. 17.38 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ప్రో : రూ. 18.50 లక్షలు (ఎక్స్-షోరూమ్).

బీఏఏఎస్​ (బ్యాటరీ యాజ్ ఏ సబ్‌స్క్రిప్షన్) ప్లాన్:

ఒకవేళ మీరు బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంచుకుంటే, కారు ధర తగ్గుతుంది. అయితే మీరు ప్రయాణించే ప్రతి కిలోమీటరుకు రూ. 3.9 చెల్లించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు-

1. ఎంజీ విండ్సర్ ప్రోపై ఉచిత పబ్లిక్ ఛార్జింగ్ ఆఫర్ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది?

ఒక సంవత్సరం పాటు అందించే ఈ ఉచిత పబ్లిక్ ఛార్జింగ్ సౌకర్యాన్ని పొందాలంటే, మీరు కొనుగోలు చేసిన కారు బిల్లింగ్ ప్రక్రియ మార్చి 15, 2026 లోపు పూర్తి కావాలి. ఈ తేదీ దాటితే ఈ ప్రత్యేక ఆఫర్ వర్తించదు.

2. విండ్సర్ ప్రో బ్యాటరీ సామర్థ్యం, రేంజ్ ఎంత?

ఈ కొత్త ప్రో మోడల్‌లో భారీ 52.9 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 449 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది సాధారణ విండ్సర్ ఈవీ కంటే మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

3. బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?

బీఏఏఎస్​ ప్లాన్ ద్వారా మీరు కారును తక్కువ ధరకే (బ్యాటరీ ధర లేకుండా) కొనుగోలు చేయవచ్చు. అయితే, మీరు ప్రయాణించే ప్రతి కిలోమీటరుకు రూ. 3.9 చొప్పున బ్యాటరీ అద్దె లేదా సబ్‌స్క్రిప్షన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ ముందస్తు పెట్టుబడితో ఈవీని సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More