ఫ్యామిలీ సేఫ్టీ ముఖ్యం బాసు! 6 ఎయిర్‌బ్యాగులు ఉన్న కార్లు ఇవి- ధర రూ. 15లక్షల లోపే..
కారు కొనేటప్పుడు ఇప్పుడు అందరూ చూస్తున్న మొదటి విషయం 'సేఫ్టీ'. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు రూ. 15 లక్షల లోపు ధరలోనే 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తున్నాయి. టాటా, హ్యుందాయ్, కియా వంటి బ్రాండ్లలో లభించే అత్యంత సురక్షితమైన 5 కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కొత్త కారు కొనేటప్పుడు ఒకప్పుడు లగ్జరీ ఫీచర్లను చూసేవారు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కారు బాడీ ఎంత ధృడంగా ఉంది? ఎన్ని ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి? వంటి సేఫ్టీ అంశాలకే కస్టమర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని, వాహన తయారీ సంస్థలు సైతం ప్రాథమిక వేరియంట్ నుంచే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ. 15 లక్షల బడ్జెట్‌లో 6 ఎయిర్‌బ్యాగులతో అత్యుత్తమ భద్రతను అందిస్తున్న ఐదు కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రూ. 15లక్షల ధర లోపు 6 ఎయిర్‌బ్యాగులు ఉన్న కార్లు..
1. ఫోక్స్‌వ్యాగన్ టైగూన్
జర్మన్ ఇంజనీరింగ్‌తో రూపొందిన ఈ కాంపాక్ట్ ఎస్యూవీ.. సేఫ్టీ రేటింగ్‌లో 5-స్టార్ సాధించింది.
ముఖ్య ఫీచర్లు: అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్. వీటితో పాటు ఏబీఎస్, ఈఎస్సీ, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) ఉన్నాయి.
ప్రత్యేకత: స్థిరత్వం కోసం ట్రాక్షన్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. అయితే, ఇందులో ప్రస్తుతం అడాస్ ఫీచర్ లేదు, త్వరలో రాబోయే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఇది కూడా చేరే అవకాశం ఉంది.
2. టాటా సియెర్రా
ఐకానిక్ పేరుతో సరికొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ సియెర్రా ఎస్యూవీ.. టాటా బ్రాండ్ విలువలకి అనుగుణంగా భద్రతకు పెద్దపీట వేసింది.
ముఖ్య ఫీచర్లు: 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఏబీఎస్, ఈబీడీ వంటి ఫీచర్లు ప్రామాణికంగా వస్తున్నాయి.
హైలైట్: ఇందులో లెవల్-2 అడాస్ సిస్టమ్ ఉంది. ఇది ఏకంగా 22 రకాల భద్రతా ఫీచర్లతో ప్రయాణాన్ని మరింత సురక్షితం చేస్తుంది.
3. కియా సెల్టోస్
రెండవ తరం సెల్టోస్ ఎస్యూవీ సరికొత్త సేఫ్టీ ప్యాకేజీతో దూసుకుపోతోంది.
ముఖ్య ఫీచర్లు: బేస్ వేరియంట్ నుంచే 6 ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తాయి. ఏబీఎస్, ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఇందులో ఉన్నాయి.
టెక్నాలజీ: 360-డిగ్రీ కెమెరాతో పాటు లెవల్-2 అడాస్ (28 ఫీచర్లు) దీని సొంతం. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ వ్యూ మానిటర్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
4. హ్యుందాయ్ ఐ20
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఐ20 ఇప్పుడు మరింత సురక్షితంగా మారింది.
ముఖ్య ఫీచర్లు: కారు బేస్ వేరియంట్ నుంచి 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్-స్టార్ట్ అసిస్ట్ వంటివి ప్రామాణికం.
అదనపు ఫీచర్లు: ఆటో హెడ్‌ల్యాంప్స్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, డైనమిక్ గైడ్‌లైన్స్‌తో కూడిన రియర్ కెమెరా ప్రత్యేక ఆకర్షణ.
5. టాటా పంచ్
టాటా పంచ్ అనేది చిన్న కారైనా భద్రతలో ఇది 'పెద్ద' విజయాన్ని అందుకుంది. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దీని ప్రధాన బలం.
ముఖ్య ఫీచర్లు: 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్పీ, టీపీఎంఎస్, క్రూయిజ్ కంట్రోల్, పిల్లల భద్రత కోసం ISOFIX మౌంట్స్ ఉన్నాయి.
స్పెషల్: 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, హెచ్డీ రివర్స్ కెమెరా వంటి ఫీచర్లు ఈ ధరలో లభించడం విశేషం.
మీరు కుటుంబ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారైతే, రూ. 15 లక్షల బడ్జెట్‌లో ఈ ఐదు కార్లు బెస్ట్ ఆప్షన్లు అని చెప్పవచ్చు.

E-Paper












