ఐ20 నుంచి ఎక్స్‌టర్ వరకు.. ఈ డిసెంబర్‌లో హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు!
హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. డిసెంబర్ 2025లో జీఎస్‌టీ, ఇయర్-ఎండ్ ఆఫర్లతో రూ. 1.74 లక్షల వరకు ప్రయోజనాలు పొందొచ్చు. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ కార్లు, వాటిపై లభిస్తున్న డిస్కౌంట్స్‌ని ఇక్కడ తెలుసుకోండి..
డిసెంబర్ 2025 నెలకు సంబంధించి పలు మోడళ్లపై ఇయర్ ఎండ్ బెనిఫిట్స్, జీఎస్‌టీ-సంబంధిత ధరల తగ్గింపులను అందిస్తోంది హ్యుందాయ్ సంస్థ. దీనితో ఆ కంపెనీకి చెందిన చాలా కార్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మోడల్, వేరియంట్‌ను బట్టి, ఇప్పుడు పలు హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, ఎస్‌యూవీలపై మొత్తం ప్రయోజనాలు రూ. 1 లక్షను దాటుతున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ ఎస్‌యూవీలు..
1. గ్రాండ్ ఐ10 నియోస్..
- డీలర్ ప్రయోజనాలు: రూ. 70,000 వరకు.
- జీఎస్‌టీ తగ్గింపు: ధరలలో రూ. 70,000 వరకు తగ్గింపు.
మొత్తం ప్రయోజనాలు: వేరియంట్‌ను బట్టి కొనుగోలుదారులు రూ. 1.43 లక్షల వరకు మొత్తం తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు.
ఎక్స్-షోరూమ్ ధర: రూ. 5.47 లక్షల నుంచి రూ. 7.66 లక్షల వరకు.
2. హ్యుందాయ్ ఐ20
- డీలర్ ప్రయోజనాలు: రూ. 70,000 వరకు.
- జీఎస్‌టీ తగ్గింపు: ధరలలో రూ. 98,058 వరకు తగ్గింపు.
మొత్తం ప్రయోజనాలు: ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌పై మొత్తం ప్రయోజనం రూ. 1.68 లక్షల వరకు ఉంది.
ఎక్స్-షోరూమ్ ధర: రూ. 6.86 లక్షల నుంచి రూ. 10.51 లక్షల వరకు.
3. హ్యుందాయ్ ఎక్స్‌టర్
ఎస్‌యూవీల్లో అత్యధిక తగ్గింపు: హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీపై అత్యధిక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
- డీలర్ ప్రయోజనాలు: రూ. 85,000 వరకు.
- జీఎస్‌టీ తగ్గింపు: ధరలలో రూ. 89,209 వరకు తగ్గింపు.
మొత్తం ప్రయోజనాలు: ఎంపిక చేసిన వేరియంట్‌లపై కొనుగోలుదారులు రూ. 1.74 లక్షల వరకు మొత్తం ప్రయోజనాలను పొందవచ్చు.
ఎక్స్-షోరూమ్ ధర: రూ. 5.48 లక్షల నుంచి రూ. 8.76 లక్షల వరకు.
హ్యుందాయ్ సెడాన్‌లు, త్రీ-రో ఎస్‌యూవీలు..
4. హ్యుందాయ్ ఆరా
- కాంపాక్ట్ సెడాన్‌పై బెనిఫిట్స్: డిసెంబర్ నెలకు రూ. 33,000 వరకు ప్రయోజనాలు.
- జీఎస్‌టీ తగ్గింపు: ధరలలో రూ. 78,465 వరకు తగ్గింపు.
మొత్తం బెనిఫిట్స్ దాదాపు రూ. 1.11 లక్షల వరకు ఉంది.
ఎక్స్-షోరూమ్ ధర: రూ. 5.98 లక్షల నుంచి రూ. 8.41 లక్షల వరకు.
5. హ్యుందాయ్ వెర్నా..
అధిక తగ్గింపులు: హ్యుందాయ్ వెర్నా కూడా అధిక తగ్గింపులు కలిగిన మోడళ్లలో ఒకటి.
- డీలర్ ప్రయోజనాలు: రూ. 75,000 వరకు.
- జీఎస్‌టీ తగ్గింపు: ధరలలో రూ. 60,640 వరకు తగ్గింపు.
మొత్తం ప్రయోజనాలు: వేరియంట్‌ను బట్టి మొత్తం పొదుపు రూ. 1.35 లక్షల వరకు ఉంది.
ఎక్స్-షోరూమ్ ధర: రూ. 10.69 లక్షల నుంచి రూ. 16.97 లక్షల వరకు.
6. హ్యుందాయ్ అల్కాజార్..
- ప్రీమియం ఎస్‌యూవీ ప్రయోజనాలు: మూడు-వరుసల ఎస్‌యూవీ అయిన అల్కాజార్‌పై డిసెంబర్‌లో రూ. 40,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.
- జీఎస్‌టీ తగ్గింపు: ధరలలో రూ. 75,376 వరకు తగ్గింపు.
మొత్తం ప్రయోజనాలు: ఎంపిక చేసిన వేరియంట్‌లపై మొత్తం ప్రయోజనం రూ. 1.15 లక్షల వరకు ఉంది.
ఎక్స్-షోరూమ్ ధర: రూ. 14.47 లక్షల నుంచి రూ. 21.10 లక్షల వరకు.
ఈ డిసెంబర్ నెలలో హ్యుందాయ్ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం! ఈ ఆఫర్లు, వేరియంట్ల లభ్యత గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మీరు సమీపంలోని డీలర్‌షిప్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


