2025 హ్యుందాయ్ వెన్యూ వేరియంట్లు- వాటి ఫీచర్లు..
2025 హ్యుందాయ్ వెన్యూలో 8 వేరియంట్లు ఉన్నాయి. అవి హెచ్ఎక్స్ 2, హెచ్ఎక్స్ 4, హెచ్ఎక్స్ 5, హెచ్ఎక్స్ 6, హెచ్ఎక్స్ 6టీ, హెచ్ఎక్స్ 7 హెచ్ఎక్స్ 8, హెచ్ఎక్స్ 10. ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్స్ లభిస్తున్నాయో ఇక్కడ తెలుసుకోండి..
2025 హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీని సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది. దీని ఇంట్రొడక్టరీ ఎక్స్‌షోరూం ధర రూ. 7.90లక్షలు. ఈ ధర డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మొత్తం 8 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి. హెచ్ఎక్స్2, హెచ్ఎక్స్ 4, హెచ్ఎక్స్ 5, హెచ్ఎక్స్ 6, హెచ్ఎక్స్ 6టీ, హెచ్ఎక్స్ 7, హెచ్ఎక్స్ 8, హెచ్ఎక్స్ 10

ఈ సెకెండ్ జనరేషన్ హ్యుందాయ్ వెన్యూ డిజైన్‌లో పెద్ద మార్పులు కనిపించాయి. అంతేకాదు, ఇందులో కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా లభిస్తుంది. వీటితో పాటు ఈ ఎస్‌యూవీలో ఇప్పుడు కొత్త డీజిల్ ఏటీ ఇంజిన్ని కూడా సంస్థ జోడించింది. ఒకవేళ మీరు 2025 హ్యుందాయ్ వెన్యూను కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు లభిస్తున్నాయో ఇక్కడ తెలుసుకండి..
2025 హ్యుందాయ్ వెన్యూ- ఏ వేరియంట్ ఏం అందిస్తుంది?
హెచ్ఎక్స్ 2- హాలోజెన్ ప్రాజెక్టర్ హెడ్‌లైట్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, 15-16 ఇంచ్ స్టీల్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటీనా, ఫ్రెంట్ అండ్ రేర్ స్కిడ్ ప్లేట్స్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ వేరియంట్ ఇంటీరియర్‌లో బ్లాక్ థీమ్, ఫాబ్రిక్ సీట్ అప్‌హోలిస్ట్రీ, హైట్ అడ్జెస్టెబుల్ ఫ్రెంట్ హెడ్రెస్ట్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 4 స్పీకర్ ఆడియో సిస్టెమ్, ఎనలాగ్ డిజిటల్ డ్రవర్ డిస్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, మేన్యువల్ ఏసీ, రేర్ ఏసీ వెంట్, టైప్ సీ యూఎస్బీ పోర్ట్స్, 12వీ పవర్ ఔట్లెట్, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్ ఓఆర్వీఎం, పవర్ విండోస్, టిల్ట్ అడ్జెస్టెబుల్ స్టీరింగ్ వీల్, డే-నైట్ ఐఆర్వీఎం వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక సేఫ్టీ విషయానికొస్తే.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్సీ, హెచ్ఎస్ఏ, అన్ని సీట్లకు సీట్‌బెల్ట్ రిమైండర్, 3 పాయింట్ సీట్‌బెల్ట్, రేర్ పార్కింగ్ సెన్సార్స్, ఫ్రెంట్ వీల్ డిస్క్ బ్రేక్స్, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ ఛైల్ట్ సీట్ యాంకరేజెస్ ఉన్నాయి. మీరు బడ్జెట్ చూసుకుంటుంటే ఇది బెస్ట్ ఆప్షన్!
హెచ్ఎక్స్ 4- 2025 హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీలో డార్క్ క్రోమ్ గ్రిల్, టర్న్ ఇండికేటర్స్‌తో కూడిన ఓఆర్వీఎం, డ్యూయెల్ టోన్ డోవ్ గ్రే అండ్ డార్క్ గ్రే థీమ్, డ్యూయెల్ టోన్ ఫాబ్రిక్ సీట్ అప్‌హోలిస్ట్రీ, ఎలక్ట్రికల్లీ ఫోల్టెబుల్ ఓఆర్వీఎం, టీపీఎంఎస్, రేర్ డీఫాగర్, రేర్ పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి. నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికిల్ చూస్తుంటే ఇది బెస్ట్!
హెచ్ఎక్స్ 5- డ్రైవర్ సౌలభ్యం కోసం ఈ వేరియంట్‌లో హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పగటిపూట ఆహ్లాదకరమైన ప్రయాణానికి వీలుగా సన్‌రూఫ్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లలో ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ విత్ స్టోరేజ్, ప్యాడిల్ షిఫ్టర్లు అందుబాటులో ఉంటాయి. టర్బో-పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్‌లలో క్రూయిజ్ కంట్రోల్ సౌకర్యం లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్లలో రిమోట్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్ ఫీచర్లు ఉంటాయి. ఓఆర్వీఎంలు పెట్రోల్ వేరియంట్లలో ఆటో-ఫోల్డింగ్‌తో వస్తున్నాయి. రూ. 10లక్షల ధరలోపు సన్‌రూఫ్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది ఉత్తమం!
హెచ్ఎక్స్ 6- క్వాడ్-బీమ్ ఆటో-ఎల్ఈడీ హెడ్‌లైట్లు లభిస్తాయి, ఇవి రాత్రిపూట మెరుగైన కాంతిని అందిస్తాయి. డార్క్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్. రూఫ్ రెయిల్స్, రియర్ స్పాయిలర్, బ్లాక్ ఓఆర్వీఎంలు లభిస్తాయి. వెనుక వీక్షణకు మెరుగైన స్పష్టత కోసం రియర్ వైపర్, వాషర్ సదుపాయం ఉంటుంది. ఈ వేరియంట్‌లో టెక్నాలజీ, సౌకర్యం రెండూ పెరుగుతాయి. ఆటోమేటిక్ ఏసీ ఫీచర్ లభిస్తుంది. వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ సదుపాయం ఉంటుంది. ప్రయాణికుల కోసం వానిటీ మిర్రర్, బూట్ ల్యాంప్ ఉంటాయి. మెరుగైన ఆడియో కోసం ముందు ట్వీటర్లు అదనంగా లభిస్తాయి. ఇందులోని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంచుకునే వారికి ఈ ప్రీమియం ఫీచర్లు అదనంగా లభిస్తాయి. అవి లెదరెట్-వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, లెదరెట్-చుట్టిన గేర్ షిఫ్టర్ లభిస్తాయి, ఇవి క్యాబిన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. కూల్డ్ గ్లోవ్‌బాక్స్ ఉంటుంది. ఇది పానీయాలు లేదా వస్తువులను చల్లగా ఉంచుతుంది. ఎత్తు సర్దుబాటు చేయగల వెనుక హెడ్‌రెస్ట్‌లు, 60:40 స్ప్లిట్ సీట్లు, 2-దశల రెక్లైనింగ్ వెనుక సీట్లు, రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ ఉంటాయి. వెనుక కిటికీలకు సన్ షేడ్) లభిస్తుంది. మీ బడ్జెట్ రూ. 11 లక్షల లోపు ఉండి, సన్‌రూఫ్, ఆటో ఏసీ, ఎల్ఈడీ లైటింగ్, వైపర్‌తో పాటు వెనుక వాషర్ వంటి ముఖ్యమైన ప్రీమియం ఫీచర్లను కోరుకునే వారికి ఈ వేరియంట్ ఉపయోగకరంగా ఉంటుంది.
హెచ్ఎక్స్ 7- ఇందులో సాధారణ స్టీల్ వీల్స్‌కు బదులుగా 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. ఇది కారుకు మరింత ప్రీమియం, స్పోర్టీ లుక్‌ను ఇస్తుంది. వెనుక వైపు ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు లభిస్తాయి. డ్యాష్‌బోర్డ్‌పై మూన్‌వైట్ యాంబియంట్ లైటింగ్ ఉంటుంది. ఈ లైటింగ్ క్యాబిన్‌కు మరింత లగ్జరీ, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తుంది. హ్యుందాయ్ వెన్యూ హెచ్ఎక్స్ 7 వేరియంట్‌ను ప్రత్యేకంగా డీజిల్ ఇంజిన్‌తో నడిచే సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో బెస్ట్ డీల్‌ను కోరుకునే కస్టమర్ల కోసం రూపొందించారు.
హెచ్ఎక్స్ 8- డార్క్ నేవీ, డోవ్ గ్రే థీమ్‌తో కూడిన ప్రీమియం క్యాబిన్ వస్తోంది. హై-క్వాలిటీ లెదరెట్ సీట్ అప్హోల్‌స్టరీ సీటింగ్ లభిస్తోంది. డ్రైవర్ సౌలభ్యం కోసం 4-వే పవర్డ్ డ్రైవర్ సీటు వస్తోంది. అత్యంత ఉపయోగకరంగా ఉండే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉంటాయి. ఆటోమేటిక్ వేరియంట్‌లలో ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్.టెర్రైన్ మోడ్స్ ఆటోమేటిక్ వేరియంట్‌లలో కష్టమైన రోడ్ల కోసం సాండ్, మడ్, స్నో వంటి మల్టీ-టెర్రైన్ మోడ్స్ లభిస్తున్నాయి. ఆటో హోల్డ్‌తో ఈపీబీ (ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్), అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు (ఏటీ వేరియంట్‌లలో) వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. మీరు శక్తివంతమైన 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కోరుకుంటే. .మీకు వెంటిలేటెడ్ సీట్లు, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి లగ్జరీ ఫీచర్లు అవసరం అయితే, అడాస్, పెద్ద స్క్రీన్ (12.3 అంగుళాలు) కోసం ఎక్కువ ఖర్చు చేయకూడదనుకుంటే, ఈ వేరియంట్ పూర్తి ప్యాకేజీగా నిలుస్తుంది.
హెచ్ఎక్స్ 10- ఇందులో 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, 8 స్పీకర్ బోస్ ఆడియో సిస్టెమ్, టర్బో-పెట్రోల2లో స్టార్ట్, స్టాప్, ఫ్రెంట్- సైడ్ పార్కింగ్ సెన్సార్,లెవ్ 2 అడాస్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అన్ని ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్!

E-Paper












