మామూలు 'రేంజ్' కాదు! రూ. 20లక్షల ధరలోపు టాప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవి..
మీరు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! రూ. 20లక్షల ధరలోపు ఇండియాలో లభిస్తున్న టాప్ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల లిస్ట్‌ని ఇక్కడ చూసేయంటి. ఈ ఎస్‌యూవీల రేంజ్, ఎక్స్‌షోరూం ధర, కీలక ఫీచర్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి..
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో, 2025 సంవత్సరం పూర్తిగా ఎలక్ట్రిక్ SUV (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) లదే కానుంది. మెరుగైన ఛార్జింగ్ సదుపాయం, ఎక్కువ రేంజ్, పోటీ ధరలతో, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇప్పుడు సామాన్య ప్రజలకు మరింత చేరువయ్యాయి.

టాటా, మహీంద్రా వంటి దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు ఈ విభాగానికి నాయకత్వం వహిస్తున్నాయి. ఈ కంపెనీలు రోజువారీ అవసరాలకు తగిన సామర్థ్యం, స్టైల్, సమర్థతను రీజనెబుల్ ధరలకే అందిస్తున్నాయి. మీరు కూడా ఎలక్ట్రిక్ వాహనం కొనాలని ప్లాన్ చేస్తుంటే, 2025లో భారతదేశంలో రూ.20లక్షల కన్నా తక్కువ ధరకు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల వివరాలు ఇక్కడ చూసేయండి..
రూ.20లక్షల కన్నా తక్కువ ధరకు బెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు..
- టాటా పంచ్ ఈవీ— దేశంలోనే చవకైన ఎలక్ట్రిక్ ఎస్యూవీ
ప్రస్తుతం, మార్కెట్‌లో టాటా పంచ్ ఈవీ అత్యంత బడ్జెట్-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల్లో ఒకటిగా ఉంది. ఇది కాంపాక్ట్ (చిన్న) సైజులో ఉన్నప్పటికీ, ఎస్యూవీ తరహా డిజైన్, లుక్‌తో ఆకట్టుకుంటుంది. చిన్నదే అయినప్పటికీ, ఇందులో ఎన్నో ఫీచర్లు, సౌకర్యవంతమైన క్యాబిన్ ఉన్నాయి.
ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)- రూ. 9.99 లక్షలు
రేంజ్ (కంపెనీ క్లెయిమ్ ప్రకారం)- 290 కి.మీ వరకు
బ్యాటరీ ఆప్షన్లు- 25 కేడబ్ల్యూహెచ్, 35 కేడబ్ల్యూహెచ్
ముఖ్య హైలైట్స్- 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్-స్క్రీన్ సెటప్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే
పంచ్ ఈవీ అనేది స్టైలిష్‌గా, సరసమైన ధరలో ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకునే పట్టణ వినియోగదారులకు చాలా అనువైనది.
2. టాటా నెక్సాన్ ఈవీ— అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ ఎస్యూవీ
టాటా నెక్సాన్ ఈవీ అనేది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా నిలిచింది. దీనికి నిరూపితమైన విశ్వసనీయత, శక్తివంతమైన పనితీరు, పోటీతత్వ ధరలే కారణం.
ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)- రూ. 12.49 లక్షలు
రేంజ్ (కంపెనీ క్లెయిమ్ ప్రకారం)- 350 కి.మీ వరకు
బ్యాటరీ ఆప్షన్లు- 30.2 కేడబ్ల్యూహెచ్ / 45 కేడబ్ల్యూహెచ్
ముఖ్య హైలైట్స్- డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, ఫాస్ట్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్
నెక్సాన్ ఈవీ తక్కువ ధర, సుదూర ప్రయాణ సామర్థ్యం మధ్య అద్భుతమైన సమతుల్యతను సాధించింది. అందుకే ఇది నగరాలు, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని కొనుగోలుదారులందరికీ ఫేవరెట్‌గా ఉంది.
3. మహీంద్రా ఎక్స్‌యూవీ400 — ఆచరణాత్మకమైన ఎస్యూవీ
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్యూవీ మార్కెట్‌లో అత్యంత ఆచరణాత్మకమైన, విలువ-ఆధారిత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా స్థిరంగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇది చాలా సబ్-4 మీటర్ల ఎస్‌యూవీల కంటే పెద్దది. వేగవంతమైన యాక్సిలరేషన్ కోసం ఇది మంచి టార్క్ అందిస్తుంది. విశాలమైన క్యాబిన్ స్పేస్, పెద్ద బూట్ స్పేస్‌ను ఇది అందిస్తుంది.
ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)- రూ. 15.49 లక్షలు
రేంజ్ (కంపెనీ క్లెయిమ్ ప్రకారం)- 456 కి.మీ వరకు
బ్యాటరీ ఆప్షన్లు- 34.5 కేడబ్ల్యూహెచ్, 39.4 కేడబ్ల్యూహెచ్
ముఖ్య హైలైట్స్-150 పీఎస్ మోటార్, 8.3 సెకన్లలో 0–100 కి.మీ స్పీడ్/గం, 6 ఎయిర్‌బ్యాగ్‌లు
4. టాటా కర్వ్ ఈవీ— స్టైలిష్ కూపే ఎస్యూవీ
టాటా కర్వ్ ఈవీ భారతదేశ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌కు భవిష్యత్తు తరహా ఎస్యూవీ కూపే డిజైన్‌ను తీసుకొస్తుంది. ఇది టాటా నెక్సాన్ ఈవీ, హారియర్ ఈవీ మధ్య స్థానంలో ఉంటూ, మంచి రేంజ్- ప్రీమియం ఫీలింగ్‌ను పోటీ ధరలో అందిస్తుంది.
ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)- రూ. 17.49 లక్షలు
రేంజ్ (కంపెనీ క్లెయిమ్ ప్రకారం)- 400 కి.మీ వరకు
బ్యాటరీ ఆప్షన్లు 45 కేడబ్ల్యూహెచ్, 55 కేడబ్ల్యూహెచ్
ముఖ్య హైలైట్స్- పానోరమిక్ సన్‌రూఫ్, కర్వ్‌డ్ డిజిటల్ డిస్‌ప్లేలు, 360 డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ కార్ ఫీచర్స్, కూపే ఎస్యూవీ డిజైన్
5. మహీంద్రా బీఈ 6 — బోల్డ్, టెక్-లోడెడ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ
బీఈ 6 మోడల్ ‘బార్న్ ఎలక్ట్రిక్’ శ్రేణి కింద మహీంద్రా నెక్ట్స్ జెన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విధానాన్ని సూచిస్తుంది. మస్కులర్ స్టైలింగ్, ఆకట్టుకునే రేంజ్, ఫైటర్ జెట్ తరహా ఇంటీరియర్స్‌తో, ఇది మిడ్-రేంజ్‌లో ఒక బలమైన ఈవీ ఆప్షన్!
ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)- రూ. 18.90 లక్షలు
రేంజ్ (కంపెనీ క్లెయిమ్ ప్రకారం)- 682 కి.మీ వరకు
బ్యాటరీ ఆప్షన్లు- 59 కేడబ్ల్యూహెచ్ / 79 కేడబ్ల్యూహెచ్
ముఖ్య హైలైట్స్- డ్యూయల్-స్క్రీన్ సెటప్, 800వీ ఆర్కిటెక్చర్, అధునాతన భద్రతా ఫీచర్లు, విశాలమైన క్యాబిన్, డ్రైవింగ్‌కు సరదాగా ఉంటుంది.

E-Paper












