మహీంద్రా నుంచి సరికొత్త 7 సీటర్​, ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ- లాంచ్​ డేట్​ ఇదే..

మహీంద్రా నుంచి కొత్త 7సీటర్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ లాంచ్​కు రెడీ అవుతోంది. దీని పేరును ఇటీవలే ఖరారు చేశారు. ఈ మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​.. నవంబర్ 27న అడుగుపెట్టనుంది. ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 2, 2025, 06:00:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తమ కొత్త 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది! ఈ రాబోయే మూడు వరుసల ప్రీమియం ఈవీ శ్రేణికి ఎక్స్​ఈవీ 9ఎస్​ అని కంపెనీ అధికారికంగా నామకరణం చేసింది.

మహీంద్రా నుంచి సరికొత్త 7 సీటర్​, ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ..
మహీంద్రా నుంచి సరికొత్త 7 సీటర్​, ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ..

ఈ సరికొత్త వాహనాన్ని ప్రత్యేకంగా ఎలక్ట్రిక్​ వాహనాల కోసం రూపొందించిన INGLO ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారు చేస్తున్నారు. అదనపు వరుస సీట్లను సర్దుబాటు చేసేందుకు, ఇప్పటికే ఉన్న ఎక్స్​ఈవీ 9ఈ మోడల్ కంటే దీని వీల్‌బేస్ పొడవుగా రూపొందించారు.

INGLO ప్లాట్‌ఫారమ్‌పై మూడో వాహనం..

INGLO స్కేట్‌బోర్డ్ నిర్మాణం ఆధారంగా తయారు చేసిన మూడొవ వాహనం ఈ ఎక్స్​ఈవీ 9ఎస్! ప్రస్తుతం, ఇదే నిర్మాణంలో బీఈ 6, ఎక్స్​ఈవీ 9ఈ మోడళ్లు ఉన్నాయి.

అయితే ఈ కొత్త ఎక్స్​ఈవీ 9ఎస్​ అనేది ఇప్పటికే ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​గా ఉన్న మహీంద్రా ఎక్స్​యూవీ700కి ఎలక్ట్రిక్​ వర్షెన్​ అయ్యే అవకాశం ఉంది! దీనిపై క్లారిటీ లేదు కానీ, ఈ కారును అనేకసార్లు సంస్థ భారత రోడ్లపై టెస్ట్​ చేసింది. వర్టికల్లీ ప్లేస్డ్​ ఎల్​ఈడీ హెడ్‌ల్యాంపుల చుట్టూ అల్లుకున్న కలిపిన ఎల్​ఈడీ డీఆర్‌ఎల్‌ల , ఎక్స్​ఈవీ 9ఈ ఈవీ తరహాలో మూసివేసిన ముందు భాగం ఇందులో ఉండవచ్చు.

ఎక్స్​ఈవీ 9ఎస్​
ఎక్స్​ఈవీ 9ఎస్​

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​: ఇప్పటివరకు తెలిసిన వివరాలు..

INGLO ప్లాట్‌ఫారమ్ విస్తరణాత్మక రూపకల్పన ద్వారా ఎక్స్​ఈవీ 9ఎస్​ ప్రయోజనం పొందుతుంది! ఈ రూపకల్పన ఒకే వేదికపై వివిధ పొడవులు, కూర్చునే ఏర్పాట్లు గల వాహనాలను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది. అంటే, ఈ కొత్త 7-సీటర్‌, ఫ్యామిలీ ఎస్​యూవీని అభివృద్ధి చేసేటప్పుడు, ప్లాట్‌ఫారమ్ లేదా దాని భాగాలకు పెద్దగా మార్పులు చేయకుండానే వాహనం చక్రాల మధ్య దూరాన్ని మహీంద్రా పెంచగలిగింది. దీనివల్ల, ఎక్స్​ఈవీ శ్రేణి మూల రూపాన్ని కాపాడుకుంటూనే, అదనపు వరుస సీట్లను చేర్చడం సులభమైంది!

అయితే ఈ సరికొత్త 7 సీటర్ వాహనం క్యాబిన్ కూర్పు 5-సీటర్ ఎక్స్​ఈవీ 9ఈ కంటే భిన్నంగా ఉండవచ్చని అంచనా! స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లాట్​ ఫ్లోర్​ రూపకల్పన కారణంగా, ఇందులో జారే స్లైడింగ్​ సెకెండ్​ రో సీట్స్​ ఉంటాయని ఖరారు అయ్యింది. ఇక సౌకర్యాల విషయానికొస్తే.. ఎక్స్​ఈవీ 9ఎస్​ కూడా ఇప్పటికే ఉన్న వాహనాల నుంచి చాలా అంశాలను తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్స్​ఈవీ 9ఈ లోని ట్రిపుల్​ స్క్రీన్​ సెటప్​ ఇందులో కూడా కొనసాగే అవకాశం ఉంది.

ఎక్స్​ఈవీ 9ఎస్​ బ్యాటరీ, మైలేజ్ వివరాలు..

పవర్​ట్రైన్​ వివరాలపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ, రాబోయే మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఎస్​ అత్యధిక దూర ప్రయాణ సామర్థ్యం గల ఎక్స్​ఈవీ 9ఈతో సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని ప్రస్తుతం అంచనా. ఈ వేరియంట్‌లో 75 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 656 కి.మీ రేంజ్​ ఇస్తుంది. తక్కువ సామర్థ్యం గల వేరియంట్‌ల కోసం ఎక్స్​ఈవీ 9ఈ లో 59 kWh బ్యాటరీ ప్యాక్ కూడా అందుబాటులో ఉంది, ఇది ఒక్కసారి ఛార్జ్‌తో గరిష్టంగా 542 కి.మీ. ప్రయాణ సామర్థ్యాన్ని ఇస్తుంది.

పవర్​ సెటప్​, ఇతర నిర్దిష్ట వివరాలు నవంబర్ 27 ఆవిష్కరణ తేదీకి దగ్గర పడుతున్న కొద్దీ అధికారికంగా వెల్లడి అవుతాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More