రెనాల్ట్​ డస్టర్​ ఆగమనం! ఎస్​యూవీ లాంచ్​ డేట్​ ఫిక్స్​- ఎప్పుడంటే..

ఇండియాలో రెనాల్ట్​ డస్టర్​ రీ-ఎంట్రీకి డేట్​ ఫిక్స్​ అయ్యింది. 2026 జనవరి 26న ఈ ఎస్​యూవీని లాంచ్​ చేస్తున్నట్టు సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 29, 2025 10:30 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రెనాల్ట్ ఇండియా భారతీయ మార్కెట్‌లో తమ అత్యంత ప్రజాదరణ పొందిన డస్టర్ ఎస్‌యూవీని తిరిగి తీసుకొన్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఒకప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన ఈ ఎస్​యూవీ పేరును పునరుద్ధరిస్తూ, దీని కొత్త తరం వెర్షన్‌ను 2026 జనవరి 26న, అంటే గణతంత్ర దినోత్సవం నాడు లాంచ్​ చేయనున్నారు.

సరికొత్త రెనాల్ట్​ డస్టర్​..
సరికొత్త రెనాల్ట్​ డస్టర్​..

డస్టర్ తొలిసారిగా 2012లో భారత మార్కెట్‌లో అడుగుపెట్టింది. తక్కువ కాలంలోనే వినియోగదారుల ఆదరణను పొందినా, తరువాత అనేక కారణాల వల్ల దీని ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పుడు, రెనాల్ట్ సంస్థకు చెందిన ‘ఇంటర్నేషనల్ గేమ్ ప్లాన్ 2025’ కింద భారతదేశంలో లాంచ్​ అవుతున్న మొదటి ప్రాడక్ట్​ ఇదే కావడం విశేషం.

రెనాల్ట్​ డస్టర్​- టాటా సియెర్రాతో పోటీ..

ఈ రెనాల్ట్​ డస్టర్ త్వరలోనే లాంచ్​ కానున్న టాటా సియెర్రా ఎస్​యూవీకి గట్టిపోటీని ఇవ్వనుంది. ఒకప్పుడు మంచి డిమాండ్​ పొంది, ఆ తర్వాత డిస్కంటిన్యూ అయిన టాటా సియెర్రా నవంబర్​ 25న లాంచ్​ అవుతుంది టాటా మోటార్స్​ సంస్థ ప్రకటించింది. సరిగ్గా అదే సమయంలో, డస్టర్​ లాంచ్​పై రెనాల్ట్​ కూడా ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

టాటా సియెర్రా గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

టాటా సియెర్రాతో పాటు హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్ వంటి ఎస్​యూవీలకు డస్టర్​ గట్టిపోటీని ఇవ్వనుంది.

రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీ- సరికొత్త డిజైన్, ఫీచర్లు..

భారత్‌లో లాంచ్​కు ముందే, డస్టర్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. అలాగే, మన దేశంలో పలు సందర్భాల్లో దీని టెస్టింగ్ నమూనాల కూడా కనిపించాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కొత్త డస్టర్ అంతర్జాతీయ మోడల్‌ను పోలి ఉండే, పూర్తిగా కొత్త డిజైన్​తో రానుంది. ఇందులో ఉండే ప్రధాన డిజైన్ అంశాలు:

  • 'వీ' ఆకారంలో ఉండే టెయిల్ ల్యాంప్స్
  • మందపాటి వీల్ ఆర్చ్ క్లాడింగ్
  • షార్క్ ఫిన్ యాంటెన్నా
  • రూఫ్ రైల్స్
  • రేర్ వాషర్, వైపర్
  • వాలుగా ఉండే విండ్‌షీల్డ్

అప్డేటెడ్​ రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీ ఫ్రెంట్​ డిజైన్​ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 'వై' ఆకారంలో ఉండే ఎల్​ఈడీ లైట్లు, బుల్ బార్‌ను పోలిన గ్రిల్, ఇంకా కాంట్‌ర్డ్ హుడ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్​ కనిపిస్తాయి. దీని ఇతర ముఖ్యమైన ఎలిమెంట్స్​లో యాంగ్యులర్​ వీల్ ఆర్చెస్, టర్న్ సిగ్నల్స్‌తో కూడిన సైడ్ మిర్రర్‌లు, బ్లాక్డ్​ ఔట్​ బీ-పిల్లర్లు, సంప్రదాయ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి.

రెనాల్ట్​ డస్టర్​- ఇంజిన్..

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న రెనాల్ట్ డస్టర్ పలు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్​తో వస్తోంది. భారత మార్కెట్‌కు ఏది వస్తుందనే దానిపై స్పష్టత లేనప్పటికీ, అంతర్జాతీయ మోడల్ వివరాలు ఇవి:

మైల్డ్ హైబ్రిడ్: 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్​ని 48వీ మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థతో కలిపారు. ఇది మొత్తం 128.2 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది.

స్ట్రాంగ్ హైబ్రిడ్ : 1.6 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఇది. దీనికి 1.2 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీతో పనిచేసే రెండు ఎలక్ట్రిక్ మోటార్లు జత చేశారు. ఇది గరిష్ఠంగా 138 హెచ్​పీ శక్తిని అందిస్తుంది.

పెట్రోల్-ఎల్పీజీ: 1.0 లీటర్ పెట్రోల్-ఎల్పీజీ ఇంజిన్ ఇది. ఇది 98.6 హెచ్​పీ​ పవర్​ని జనరేట్​ చేస్తుంది. దీనిని 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్​తో జత చేశారు. ఇది నాలుగు చక్రాలకు పవర్‌ను పంపుతుంది.

ఈ కొత్త డస్టర్ భారతీయ ఎస్‌యూవీ మార్కెట్‌లో ఎటువంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఈ మోడల్​ ధరకు సంబంధించిన వివరాలు సైతం తెలియాల్సి ఉంది.