Tata Sierra వచ్చేస్తోంది! ఎస్​యూవీ లాంచ్​ డేట్​ని ప్రకటించిన టాటా మోటార్స్​..

భారత మార్కెట్‌లోకి టాటా సియెర్రా రీ-ఎంట్రీ ఇస్తోంది! నవంబర్ 25న సియెర్రాను విడుదల చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. దానికన్నా ముందు నవంబర్​ 15న ఎస్​యూవీని ఆవిష్కరించనుంది.

Published on: Oct 28, 2025, 16:00:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ తమ సరికొత్త సియెర్రా ఎస్​యూవీని ఇండియాలో లాంచ్​ చేసేందుకు రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు ఈ మోడల్​కి సంబంధించిన లాంచ్​ డేట్​ బయటకు వచ్చింది. నవంబర్ 25న టాటా సియెర్రాను విడుదల చేయనున్నట్లు దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ ధృవీకరించింది. ఫలితంగా ఒకప్పుడు డిస్కాంటిన్యూ అయిన ఈ ఎస్​యూవీ తిరిగి భారత మార్కెట్​లోకి సరికొత్తగా ఎంట్రీ ఇవ్వనుంది.

2025 టాటా సియెర్రా లాంచ్​ డేట్​ ఫిక్స్​..
2025 టాటా సియెర్రా లాంచ్​ డేట్​ ఫిక్స్​..

టాటా సియెర్రా ఎస్​యూవీ..

తాజా అవతారంలో ఈ టాటా సియెర్రా అత్యాధునిక టెక్నాలజీతో వస్తోంది. ఇది మారుతీ సుజుకీ విక్టోరిస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హ్యుందాయ్ క్రెటా వంటి ఆధునిక పోటీదారులతో గట్టిగా తలపడనుంది.

అధికారిక లాంచ్‌కు ముందు, ఈ ఎస్​యూవీని నవంబర్ 15న సంస్థ ఆవిష్కరిస్తుంది. ఈ వాహనం టెస్టింగ్ సందర్భంగా అనేకసార్లు కెమెరాలకు చిక్కింది. చివరిసారిగా కనిపించిన టెస్ట్ మోడల్ క్యామోఫ్లేజ్ కవర్‌తో కప్పి ఉంది.

టాటా సియెర్రా- డిజైన్, ఫీచర్లు..

స్పై ఇమేజ్​ల ప్రకారం.. 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన మోడల్ ఆధారంగా చూస్తే, టాటా సియెర్రా ఐసీఈ వెర్షన్‌లో ఈ కింది ఎక్స్​టర్నల్​ ఎలిమెంట్స్​ ఉంటాయని అంచనాలు ఉన్నాయి..

ఆల్-ఎల్​ఈడీ లైటింగ్ సెటప్: ఇందులో హెడ్‌లైట్లు, ముందు- వెనుక వైపులా ఫుల్-విడ్త్ లైట్‌బార్‌లు ఉంటాయి.

బ్లాక్-అవుట్ డిజైన్: బ్లాక్ రంగులో ఉన్న ఓఆర్​వీఎం (అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్), సీ-పిల్లర్‌లు, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటివి కనిపిస్తాయి.

టాటా సియెర్రా- ఇంటీరియర్ ఫీచర్లు..

మునుపటి స్పై షాట్స్​ ప్రకారం.. టాటా సియెర్రా ఎస్​యూవీ ఐసీఈలో అత్యాధునికమైన మూడు-స్క్రీన్ లేఅవుట్ ఉండే అవకాశం ఉంది:

  • డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే.
  • ఇన్ఫోటైన్‌మెంట్ కోసం పెద్ద సెంట్రల్ టచ్‌స్క్రీన్.
  • ముందు ప్యాసింజర్ కోసం అదనపు స్క్రీన్.

ఈ మూడు డిస్‌ప్లేలు 12.3 ఇంచ్​ పరిమాణంలో ఉండి, ఫ్లోటింగ్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. డ్యూయల్-టోన్ ఫినిషింగ్, సాఫ్ట్-టచ్ సర్​ఫేస్​, ముందు భాగంలో విస్తరించి ఉన్న యాంబియంట్ లైటింగ్‌తో మొత్తం ఇంటీరియర్ క్లైమేట్​ గణనీయంగా మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

టాటా సియెర్రా- ఇంజిన్ ఆప్షన్స్​..

టాటా సియెర్రా ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో మూడు ఆప్షన్స్​ ఉండే అవకాశం ఉంది:

  • 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్: ఈ ఇంజిన్‌ను టాటా హారియర్ నుంచి తీసుకోనున్నారు.
  • 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్.
  • 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్.

ఈ టాటా సియెర్రా ధరతో పాటు ఇతర వివరాలు లాంచ్​ నాటికి అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు, ఐసీఈ వర్షెన్​ తర్వాత, ఈ సియెర్రా ఎలక్ట్రిక్​ వేరియంట్​ (ఈవీ) కూడా విడుదల అవుతుందని తెలుస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More