Hyundai Venue : కొత్త హ్యుందాయ్ వెన్యూకి పాత వర్షెన్‌కి తేడా ఏంటి?
న్యూ హ్యుందాయ్ వెన్యూను సంస్థ తాజాగా ప్రదర్శించింది. డిజైన్, ఇంటీరియర్స్‌లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వర్షెన్‌కి పాత వర్షెన్‌కి మధ్య ఉన్న తేడాలను ఇక్కడ తెలుసుకోండి..
సెకడ్ జనరేషన్ హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్‌ను దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ భారత్‌లో తాజాగా ఆవిష్కరించింది. నవంబర్ 4న దీని ధరలను ప్రకటించనున్నారు. ఈ కొత్త వెన్యూ ఇప్పుడు మరింత బోల్డ్‌గా, గ్లోబల్ లుక్‌తో కనిపిస్తోంది. దీని ఇంటీరియర్‌ను పూర్తిగా మార్చేశారు! అయితే, ఇందులో ఇంజిన్ ఆప్షన్లు మాత్రం పాత మోడల్‌లో ఉన్నవే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత మోడల్‌తో పోలిస్తే కొత్త వెన్యూ ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి..

హ్యుందాయ్ వెన్యూ- డిజైన్‌లో కొత్తదనం ఏంటి?
కొత్త హ్యుందాయ్ వెన్యూ తన పాత మోడల్ సిల్హౌట్‌ను నిలుపుకున్నప్పటికీ, దాని మృదువైన ఎడ్జెస్ని తొలగించి, కంపెనీ లేటెస్ట్ గ్లోబల్ ఎస్‌యూవీల స్ఫూర్తితో మరింత నిటారుగా, మస్క్యులర్‌గా ఉండే డిజైన్‌ను తీసుకువచ్చింది.
ముందు భాగం: ఇప్పుడు ఫుల్-విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్ ఒకటి బోనెట్ లైన్ గుండా వెళుతూ, రెండు వైపులా అంచుల్లో ఉన్న కొత్తగా డిజైన్ చేసిన క్వాడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లను కలుపుతుంది. ఫ్రంట్ గ్రిల్ పరిమాణం పెరిగింది, మరింత గట్టి ప్యాటర్న్‌తో పాటు సిల్వర్-యాక్సెంట్ బంపర్‌ను కలిగి ఉంది.
పక్క భాగం: పక్క నుంచి చూస్తే, ఈ ఎస్‌యూవీ మరింత రగ్గెడ్‌గా కనిపిస్తుంది. దీనికి కారణం స్క్వేర్-ఆఫ్ వీల్ ఆర్చెస్, కొత్త 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, మందపాటి క్లాడింగ్.
వెనుక భాగం: వెనుకవైపు, హ్యుందాయ్ లోగో ఇప్పుడు బ్లాక్-ప్యాటర్న్ టెయిల్‌ల్యాంప్‌లను కలిపే కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ స్ట్రిప్ పైన ఉంది. స్పోర్టి డీటైలింగ్‌తో రీషేప్ చేసిన బంపర్ వెన్యూ రీడిజైన్డ్ రూపాన్ని పూర్తి చేస్తుంది.
కొత్త వెన్యూ పరిమాణం ఎంత పెరిగింది?
న్యూ జెన్ వెన్యూ మునుపటి కంటే గణనీయంగా పెద్దగా ఉంది. ఇది మెరుగైన నిష్పత్తులతో పాటు ఎక్కువ క్యాబిన్ స్థలాన్ని అందిస్తుంది. కొత్త వెన్యూ కొలతలు ఇలా ఉన్నాయి:
| డైమెన్షన్స్ | పాత వెన్యూ (ఎంఎం) | కొత్త వెన్యూ (ఎంఎం) | వ్యత్యాసం (ఎంఎం) |
|---|---|---|---|
| ఎత్తు | 1,617 | 1,665 | +48 |
| వెడల్పు | 1,770 | 1,800 | +30 |
| వీల్‌బేస్ | 2,500 | 2,520 | +20 |
ఈ వెన్యూ ఎస్‌యూవీలో కొత్తగా వెనుక క్వార్టర్ గ్లాస్ సెక్షన్, ఎక్కువ ఎత్తు ఉండటం వల్ల దీని రోడ్ ప్రెజెన్స్ మరింత ఆత్మవిశ్వాసంతో కూడినదిగా కనిపిస్తుంది.
హ్యుందాయ్ వెన్యూ- ఇంటీరియర్ ఎలా మారింది?
లోపల, వెన్యూలో జరిగిన మార్పులు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి! కొత్త క్యాబిన్ డిజైన్ మరింత ఫ్లాట్‌గా, టెక్-కేంద్రీకృతమై ఉంది. రెండు 12.3-ఇంచ్ డిస్‌ప్లేలను అనుసంధానించే ఒకే వంపు తిరిగిన గ్లాస్ ప్యానెల్‌తో డాష్‌బోర్డ్ ఆకట్టుకుంటుంది. ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం, మరొకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం పని చేస్తుంది.
డాష్‌బోర్డ్: పాత గుండ్రటి ఎయిర్ వెంట్‌ల స్థానంలో స్లిమ్, వెంట్‌లతో పాటు డాష్‌బోర్డ్‌ను పునఃరూపకల్పన చేశారు.
స్టీరింగ్ వీల్: హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ వాహనాల స్ఫూర్తితో బ్యాక్‌లిట్ ఎలిమెంట్స్‌తో కూడిన కొత్త త్రీ-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌ను కూడా జోడించింది.
క్లైమేట్ కంట్రోల్: క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఇప్పుడు టచ్-ఆధారిత ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది, ఇది రోటరీ నాబ్‌ల స్థానంలో వచ్చి, ఆధునిక రూపాన్ని పెంచింది.
హ్యుందాయ్ వెన్యూ- కొత్త ఫీచర్లు ఏమున్నాయి?
హ్యుందాయ్ ఈ రెండొవ తరం వెన్యూలో అనేక కొత్త సౌకర్యాలు, టెక్నాలజీలను చేర్చింది:
సౌకర్యం: వెనుక సీట్లలో ప్రయాణికుల కోసం ఇప్పుడు రెండు-దశల రిక్లైన్ ఫంక్షన్‌తో పాటు కిటికీలకు సన్‌షేడ్లు లభిస్తున్నాయి. వీల్‌బేస్ కొంచెం పెరగడంతో లెగ్‌రూమ్ కూడా కొద్దిగా మెరుగుపడింది. వెనుక డోర్లు వెడల్పుగా ఉండటం వల్ల లోపలికి ఎక్కడం, దిగడం సులభంగా ఉంటుంది.
టెక్నాలజీ: సెంటర్ కన్సోల్‌ను కూడా రీడిజైన్ చేశారు. ఇందులో వెంటిలేటెడ్ సీట్లు, డ్రైవ్, ట్రాక్షన్ మోడ్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కోసం కొత్త నియంత్రణలు ఉన్నాయి. ఇవన్నీ వెన్యూలో మొదటిసారిగా వస్తున్నాయి.
అదనపు ఫీచర్లు: ఈ మోడల్‌కు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, డాష్‌బోర్డ్, కన్సోల్ చుట్టూ యాంబియంట్ లైటింగ్ కూడా లభించాయి.
హ్యుందాయ్ వెన్యూ- ఇంజిన్ ఆప్షన్లలో మార్పులు ఉన్నాయా?
- లేదు! హ్యుందాయ్ పాత మోడల్‌లో ఉన్న పవర్‌ట్రైన్ లైనప్‌నే కొత్త వెన్యూలోనూ కొనసాగించింది. 2026 వెన్యూలోనూ ఈ మూడు ఇంజిన్ ఆప్షన్లు లభిస్తాయి:
- 1.2-లీటర్ పెట్రోల్ (మాన్యువల్ గేర్‌బాక్స్‌తో)
- 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ (ఐఎంటీ లేదా డీసీటీ ఆప్షన్లతో)
- 1.5-లీటర్ డీజిల్ (మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో)
పనితీరు గణాంకాలు ఇవే అయినప్పటికీ, హ్యుందాయ్ ఇంజిన్‌లో చిన్నపాటి మార్పులు చేసి ఉండవచ్చని అంచనా.
సరికొత్త హ్యుందాయ్ వెన్యూ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. నవంబర్ 4న ధరలు వెల్లడవుతాయి. ఆ తర్వాత ఈ సంవత్సరం చివరిలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


