Mahindra XEV 9S ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఇదే..
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీరు తెలుసుకోవాలి. ఈ మోడల్‌లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది? దాని ఫీచర్స్ ఏంటి? ధర ఎంత? ఇక్కడ తెలుసుకోండి..
ఇటీవలే లాంచ్ అయిన మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై మంచి బజ్ నెలకొంది. ఈ మోడల్ బుకింగ్స్ 2026 జనవరి 14న ప్రారంభంకానున్నాయి. కాగా ఈ ఈవీని డిసెంబర్ 3 నుంచి టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. అయితే, ఈ మహీద్రా ఎక్స్ఈవీ 9ఎస్‌లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది? అని తెలుసుకోవాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వేరియంట్‌ల వారీ ధరలు, ఫీచర్ల జాబితాను పరిశీలించిన తర్వాత బేస్ వేరియంట్ అయిన ‘ప్యాక్ వన్ అబౌవ్’ అత్యంత ఎక్కువ వాల్యూ ఫర్ మనీని అందించే ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఎందుకు? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ ప్యాక్ వన్ అబౌవ్: సరసమైన ధర కీలకం..
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ శ్రేణిలో 'ప్యాక్ వన్ అబౌవ్' వేరియంట్ అన్నింటికంటే సరసమైన ఎంపిక. దీని 59 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో నడిచే మోడల్ ప్రారంభ ధర రూ. 19.95 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ఒకవేళ మీరు ఇదే 'ప్యాక్ వన్ అబౌవ్' గ్రేడ్‌లో పెద్దదైన 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌ను ఎంచుకుంటే, దాని ధర రూ. 21.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) అవుతుంది.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ బేస్ వేరియంట్ (59 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ) ప్యాక్ ధర రూ. 21.90 లక్షలు (ఎక్స్-షోరూమ్).
దీని అర్థం.. మీరు ఎక్స్ఈవీ 9ఎస్ 'ప్యాక్ వన్ అబౌవ్' 59 కేడబ్ల్యూహెచ్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే, ఇది ఎక్స్ఈవీ 9ఈ బేస్ వేరియంట్ కంటే రూ. 1.95 లక్షలు తక్కువగా లభిస్తుంది! అదే సమయంలో, కొత్త ఎక్స్ఈవీ 9ఎస్ మోడల్‌లో 79 కేడబ్ల్యూహెచ్ పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉన్న బేస్ వేరియంట్, ఎక్స్ఈవీ 9ఈ బేస్ ట్రిమ్ ధర కంటే కేవలం రూ. 5,000 మాత్రమే ఎక్కువగా ఉంది. కాబట్టి, ఇక్కడ సరసమైన ధర కీలక పాత్ర పోషిస్తోంది.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్- ఫీచర్లతో నిండిన బేస్ వేరియంట్..
'ప్యాక్ వన్ అబౌవ్' అనేది మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ బేస్ వేరియంట్ అయినప్పటికీ, ఇది ఆకర్షణీయంగా ఉండేలా మహీంద్రా అన్ని చర్యలు తీసుకుంది! ఈ బేస్ వేరియంట్‌ను టాప్-ఎండ్ వేరియంట్ మాదిరిగానే ఆకర్షణీయంగా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది (కొన్ని ఫీచర్లను మాత్రం టాప్-ఎండ్ కోసం రిజర్వ్ చేసింది).
'ప్యాక్ వన్ అబౌవ్'లో లభించే ప్రధాన ఫీచర్లు:
లైటింగ్: ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ టైల్‌లైట్లు.
వీల్స్: 18-ఇంచ్ ఏరో అల్లాయ్ వీల్స్.
టెక్నాలజీ: వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 5జీ కనెక్టివిటీతో కూడిన ట్రిపుల్ డిజిటల్ డిస్‌ప్లే సెటప్.
సౌకర్యం: పనోరమిక్ సన్‌రూఫ్, హైట్ అడ్జెస్టెబుల్ డ్రైవర్ సీటు, పడుకోవడానికి, జరుపుకోవడానికి వీలైన రెండొవ వరుస సీట్లు.
కంట్రోల్స్: పుష్ స్టార్ట్-స్టాప్ బటన్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్.
భద్రత: ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టీపీఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్ సిస్టమ్.
ప్రామాణిక ఫీచర్లు: ఆటో హెడ్‌ల్యాంప్‌లు, ఆటో వైపర్‌లు, వెనుక వైపర్ విత్ వాషర్, టిల్ట్, టెలిస్కోపిక్-సర్దుబాటు స్టీరింగ్, కూల్డ్ సెంటర్ కన్సోల్ స్టోరేజ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రేర్ ఏసీ వెంట్స్.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్- ప్రాక్టికాలిటీపై దృష్టి..
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఈ బేస్ వేరియంట్‌ను అత్యంత విలువైన ఎంపికగా నిలపడంలో ప్రాక్టికాలిటీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది! ఇది మూడు వరుసల, ఏడు సీటర్ లేఅవుట్‌ను కలిగి ఉండటం వల్ల ప్రయాణికులకు విశాలమైన అనుభూతిని ఇస్తుంది.
అంతేకాకుండా, ఇది లగేజీకి కూడా ఉదారంగా స్థలాన్ని అందిస్తుంది. ఏ ఫ్యామిలీ ఎస్‌యూవీ కొనుగోలుదారు అయినా పరిగణించాల్సిన ముఖ్య అంశం ఇది! ఎక్స్ఈవీ 9ఎస్‌లో 527 లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్, 150 లీటర్ల సామర్థ్యం గల ఫ్రంక్ (ముందు భాగంలో ఉండే లగేజీ స్థలం) లభిస్తుంది.
మరి మీరు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొంటారా?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


