Tata Sierra ఎస్​యూవీ వేరియంట్లు, ఇంజిన్​, కలర్​ ఆప్షన్స్​ ఇవి..

భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో టాటా సియెర్రా ఎస్​యూవీ గ్రాండ్​గా అడుగుపెట్టింది. ఈ మోడల్​పై మంచి బజ్​ నెలకొంది. ఈ నేపథ్యంలో టాటా సియెర్రా వేరియంట్లు, ఇంజిన్​- కలర్​ ఆపన్స్​ వంటివి ఇక్కడ వివరంగా తెలుసుకుందాము..

Published on: Nov 28, 2025, 12:20:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాటా సియెర్రా ఎస్​యూవీపై మంచి బజ్​ నెలకొంది. 1990 దశకంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ మోడల్​కి అధునాత రూపాన్ని ఇచ్చి, ఇటీవలే మార్కెట్​లోకి విడుదల చేసింది టాటా మోటార్స్​. మీరు ఈ ఎస్​యూవీని కొనే ప్లాన్​లో ఉన్నారా? అయితే ఇది మీకోసమే. టాటా సియెర్రా ఎస్​యూవీ వేరియంట్లు, ఇంజిన్​- కలర్​ ఆప్షన్స్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా సియెర్రా ఎస్​యూవీ ఇదిగో..
టాటా సియెర్రా ఎస్​యూవీ ఇదిగో..

టాటా సియెర్రా ఎస్​యూవీ ఇంజిన్​ ఆప్షన్స్​..

ఇంజిన్​ టైప్​డిస్​ప్లేస్​మెంట్​పవర్​ (పీఎస్​)టార్క్​ (ఎన్​ఎం)ట్రాన్స్​మిషన్​
1.5 ఎన్​ఏ పెట్రోల్​1.5 లీటర్లు1081456 స్పీడ్​ మేన్యువల్​, 7 స్పీడ్​ డ్యూయెల్​ క్లచ్​ ఆటోమెటిక్​
1.5 టర్బో పెట్రోల్​1.5 లీటర్లు1602556 స్పీడ్​ టార్క్​ కన్వర్టర్​ ఆటోమెటిక్​
1.5 డీజిల్​1.5 లీటర్లు1182606 స్పీడ్​ మేన్యువల్​

టాటా సియెర్ర్​ ఎస్​యూవీ- ఇంజిన్​ ఆప్షన్స్​..

టాటా సియెర్రా ఎస్​యూవీలో 3 ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. అవన్నీ 1.5లీటర్​ కెపాసిటీవే. నేచురల్లీ ఆస్పిరెట్​ పెట్రోల్​ ఇంజిన్​ 108 పీఎస్​ పవర్​, 145 ఎన్​ఎం టార్క్​తో వస్తుంది. దీనికి 6 స్పీడ్​ మేన్యువల్​ లేదా 7 స్పీడ్​ డ్యూయెల్​ క్లచ్​ ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ లభిస్తుంది.

ఇక ఇందులో టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఆప్షన్​ కూడా ఉంది. ఇది 160 పీఎస్​ పవర్​, 255 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇది 6 స్పడ్​ టార్క్​ కన్వర్టర్​ ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​తో వస్తుంది.

చివరిగా, ఇందులో డీజిల్​ ఇంజిన్​ కూడా ఉంది. ఇది 118 పీఎస్​ పవర్​, 260 ఎన్​ఎం టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్​ మేన్యువల్​ గేర్​ బాక్స్​కి కనెక్ట్​ చేసి ఉంటుంది.

టాటా సియెర్రా ఎస్​యూవీ- వేరియంట్లు..

టాటా మోటార్స్ సియెర్రాను మొత్తం ఏడు వేరియంట్లలో అందిస్తుంది. అవి:

  • స్మార్ట్+
  • ప్యూర్
  • ప్యూర్+
  • అడ్వెంచర్
  • అడ్వెంచర్+
  • అకంప్లిష్డ్
  • అకంప్లిష్డ్+

టాటా సియెర్రా ఎస్​యూవీ వేరియంట్ల వారీగా ఫీచర్స్​ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

టాటా సియెర్రా ఎస్​యూవీ- వేరియంట్ల వారీగా ట్రాన్స్‌మిషన్..

నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (ఎంటీ): 'అకంప్లిష్డ్+' మినహా అన్ని వేరియంట్లలో లభిస్తుంది.

నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (ఏటీ): 'ప్యూర్', 'ప్యూర్+', 'అడ్వెంచర్' వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

ట‌ర్బో పెట్రోల్ (ఏటీ): 'అడ్వెంచర్+', 'అకంప్లిష్డ్', 'అకంప్లిష్డ్+' వేరియంట్లలో లభిస్తుంది.

డీజిల్ (ఎంటీ): కస్టమర్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఎంచుకుంటే, అన్ని వేరియంట్లలోనూ అందుబాటులో ఉంటుంది.

డీజిల్ (ఏటీ): 'ప్యూర్', 'ప్యూర్+', 'అడ్వెంచర్+', 'అకంప్లిష్డ్', 'అకంప్లిష్డ్+' వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

టాటా సియెర్రా ఎస్​యూవీ- బుకింగ్‌లు, డెలివరీలు ఎప్పుడు?

బుకింగ్‌లు ప్రారంభం: టాటా సియెర్రా బుకింగ్‌లు డిసెంబర్ 16న మొదలవుతాయి.

డెలివరీల ప్రారంభం: టాటా మోటార్స్ సియెర్రా డెలివరీలను జనవరి 15న ప్రారంభిస్తుంది.

టాటా సియెర్రా ఎస్​యూవీ- కలర్​ ఆప్షన్స్​..

టాటా సియెర్రాలో వివిధ రకాల రంగుల ఎంపికలు ఉన్నాయి. అవి:

  • అండమాన్ అడ్వెంచర్
  • బెంగాల్ రూజ్
  • మున్నార్ మిస్ట్
  • కూర్గ్ క్లౌడ్స్
  • ప్రిస్టిన్ వైట్
  • ప్యూర్ గ్రే
  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More