స్టైలిష్ ఎక్స్‌టీరియర్, అదిరే ఇంటీరియర్, అధునిక ఫీచర్స్.. టాటా సియెర్రా సొంతం!
ఇంకొన్ని రోజుల్లో టాటా సియెర్రా ఎస్‌యూవీ లాంచ్ కాబోతోంది. ఈ ఐకానిక్ ఎస్‌యూవీ సరికొత్త అవతారంలో రానుంది. ఈ నేపథ్యంలో ఈ సియెర్రా ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్, ఫీచర్స్ వంటి వివరాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి..
టాటా మోటార్స్ సంస్థ తమ పాత, ఐకానిక్ మోడల్ సియెర్రాను మళ్లీ తెరపైకి తీసుకువస్తోంది. 1990లలో సంచలనం సృష్టించిన ఈ ఎస్‌యూవీకి చెందిన కొత్త వర్షెన్‌ని తాజాగా ఆవిష్కరించింది. ఈ సరికొత్త సియెర్రా ఎస్‌యూవీ.. ఆధునిక డిజైన్ అంశాలను, అలాగే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన విలాసవంతమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంది.

అధికారిక లాంచ్‌కి ముందే, టాటా మోటార్స్ ఈ ఎస్‌యూవీని కాన్సెప్ట్ వెర్షన్ నుంచి ప్రీ-ప్రొడక్షన్ డిజైన్ వరకు వివిధ దశల్లో ఎన్నో సందర్భాలలో ప్రదర్శించింది. అయితే, నవంబర్ 25 లాంచ్‌కి ముందు, ఈ ఎస్‌యూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా సియెర్రా: ఎక్స్‌టీరియర్
టాటా సియెర్రా ఎస్‌యూవీ దాని పాత మోడల్ స్ఫూర్తితోనే బాక్సీ డిజైన్‌ను పొందింది. అయితే దీనికి సమకాలీన రూపాన్ని ఇవ్వడానికి పలు కొత్త అంశాలను జోడించారు.
అప్‌రైట్ స్టాన్స్ ఈ ఎస్‌యూవీ ప్రత్యేకత. దీనిని గ్లాస్-బ్లాక్ ప్యానెల్స్‌తో అలంకరించారు. ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, డీఆర్‌ఎల్స్‌తో పాటు బ్రాండ్ లోగో, "సియెర్రా" అనే అక్షరాలను ఈ ప్యానెల్స్ ఒకే చోట బ్యాలెన్స్ చేస్తాయి. బంపర్‌లో స్కిడ్ ప్లేట్, రెండు ఫాగ్ ల్యాంప్స్ దీనికి అదనపు హంగును ఇస్తాయి.
పక్క నుంచి చూస్తే, ఈ ఎస్‌యూవీ నిటారుగా ఒకే లైన్‌లో వెళుతున్నట్లు కనిపిస్తుంది. ఇది ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉంది.
బీ-పిల్లర్, సీ-పిల్లర్ మధ్య విశాలమైన గ్లాస్ సెక్షన్ (అద్దాల భాగం) ఉంది. ఇది పాత టాటా సియెర్రా మోడల్‌ను గుర్తుచేసే విజువల్ ఎఫెక్ట్‌ను ఇస్తుంది. 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, వీల్ ఆర్చ్‌లకు ప్లాస్టిక్ క్లాడింగ్ ఇవ్వడం జరిగింది.
ముందు భాగాన్ని పోలిన విధంగానే వెనుక భాగంలో ఆధునిక ఆకర్షణ ఉంది. వాహనం వెడల్పును కలుపుతూ విస్తరించిన ఎల్‌ఈడీ లైట్ బార్, టెయిల్ ల్యాంప్‌లతో కలిసిపోయి కొత్త లుక్‌ను ఇస్తుంది.
టాటా సియెర్రా: ఇంటీరియర్..
సియెర్రా క్యాబిన్ లోపల అత్యాధునిక అంశాలు ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్‌లో ఏకంగా మూడు డిస్‌ప్లేలు ఏర్పాటు చేశారు: డ్రైవర్ కోసం ఒకటి, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం కంటెంట్‌ను షేర్ చేసుకోగలిగే మరో రెండు డిస్‌ప్లేలు ఉన్నాయి.
ఇది టాటా కర్వ్ మోడల్‌లో ఉన్న తరహాలోనే 4-స్పోక్స్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంది. దీనికి లైటింగ్ ఉన్న టాటా లోగో, టచ్-సెన్సిటివ్ కంట్రోల్స్ ఉన్నాయి.
ఈ కారు క్యాబిన్ అంతా బ్లాక్, గ్రే కలర్ కాంబినేషన్‌లో ఉంది. సీ-పిల్లర్ వరకు విస్తరించిన భారీ పనోరమిక్ సన్‌రూఫ్ లోపల మరింత విశాలమైన, బహిరంగ వాతావరణాన్ని కల్పిస్తుంది.
ఈ ఎస్‌యూవీలో డ్యూయల్-టోన్ (బేజ్ మరియు గ్రే) రంగుల్లో ఐదు సీట్లు ఉన్నాయి. ప్రతి సీటుకు అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు అమర్చారు.
టాటా సియెర్రా: కీలక ఫీచర్లు
సియెర్రాలో అందించిన కొన్ని ప్రధాన ఫీచర్లు:
డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్
పవర్డ్- వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు (ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల, వెంటిలేషన్ సదుపాయం ఉన్న సీట్లు)
వెనుక సన్‌షేడ్లు
360-డిగ్రీ కెమెరా
లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్)
ఇవే కాకుండా మరెన్నో అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


