Tata Sierra ఎస్​యూవీ వేరియంట్లు- వాటి ఫీచర్స్​ వివరాలు..

మచ్​ అవైటెడ్​ టాటా సియెర్రా ఎస్​యూవీని టాటా మోటార్స్​ లాంచ్​ చేసింది. ఇందులో మొత్తం 7 వేరియంట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టాటా సియెర్రా ఎస్​యూవీ వేరియంట్లు పేర్లు, వాటి ఫీచర్స్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Nov 26, 2025, 06:15:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ఐకానిక్ మోడల్ అయిన సియెర్రా ఎస్‌యూవీని భారత మార్కెట్లో తిరిగి విడుదల చేసింది. సుమారు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత సియెర్రాను పునరుద్ధరించడం జరిగింది. దీని ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది.

టాటా సియెర్రా ఎస్​యూవీ.. (REUTERS)
టాటా సియెర్రా ఎస్​యూవీ.. (REUTERS)

సియెర్రా ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లు డిసెంబర్ 16, 2025 నుంచి ప్రారంభమవుతాయి. వాహనాల డెలివరీలు జనవరి 15, 2026న మొదలవుతాయి. ఈ కొత్త ఎస్‌యూవీ మొత్తం ఏడు ప్రధాన వేరియంట్లలో లభిస్తుంది: అవి స్మార్ట్ ప్లస్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్. ఈ నేపథ్యంలో టాటా సియెర్రా ఎస్‌యూవీ వేరియంట్లు, వాటి ఫీచర్ల వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

టాటా సియెర్రా ఎస్​యూవీ- వేరియంట్లు, వాటి ఫీచర్లు..

1. టాటా సియెర్రా స్మార్ట్ ప్లస్..

  • బై-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్
  • 6 ఎయిర్‌బ్యాగ్‌లు (డ్రైవర్, కో-డ్రైవర్, కర్టెన్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు)
  • టర్న్ ఇండికేటర్స్‌తో కూడిన ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ఓఆర్‌విఎంలు
  • ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ విడుదల
  • 10.16 సెం.మీ (4 ఇంచ్​) డిజిటల్ కాక్‌పిట్
  • ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్
  • స్టోరేజ్​ స్పేస్​త కూడిన ఫ్రంట్ స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్
  • ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్
  • లైట్ సాబర్ ఎల్ఈడీ డీఆర్‌ఎల్స్, టెయిల్ ల్యాంప్
  • అన్ని వీల్స్​కి డిస్క్ బ్రేక్‌లు
  • ఎలక్ట్రానిక్ పార్క్ బ్రేక్ (ఆటో హోల్డ్‌తో)
  • వెనుక విండో సన్‌షేడ్
  • వెనుక పార్కింగ్ సెన్సార్
  • ఐఎస్ఓఎఫ్‌ఐఎక్స్
  • డ్యూయల్ టోన్ రూఫ్
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్​పీ) (రోల్‌ఓవర్ మిటిగేషన్, వెహికిల్ డైనమిక్ కంట్రోల్ వంటి 20 ఫీచర్లతో)
  • ఎలక్ట్రానిక్ టెంపరేచర్ కంట్రోలర్ (ఈటీసీ)
  • టైల్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్
  • ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ (వెల్‌కమ్ లైట్లతో)

2. టాటా సియెర్రా ప్యూర్.. (స్మార్ట్ ప్లస్ కంటే అదనంగా)

  • 26 సెం.మీ (10.25 ఇంచ్​) ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్
  • 8 స్పీకర్లు (4 స్పీకర్లు + 4 ట్వీటర్లు)
  • వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్​ యాపిల్ కార్‌ప్లే
  • పార్క్ అసిస్ట్ గైడ్స్‌తో రేర్ కెమెరా
  • డ్రైవ్ మోడ్‌లు (సిటీ & స్పోర్ట్)
  • క్రూయిజ్ కంట్రోల్
  • హిల్ డిసెంట్ కంట్రోల్ (హెచ్​డీసీ)
  • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్​)
  • స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
  • 6 భాషల్లో 250+ నేటివ్ వాయిస్ అసిస్ట్ కమాండ్‌లు

3. టాటా సియెర్రా ప్యూర్ ప్లస్.. (ప్యూర్ కంటే అదనంగా)

  • వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్
  • ఆటో హెడ్‌ల్యాంప్స్
  • రెయిన్ సెన్సింగ్ వైపర్స్
  • అల్లాయ్ వీల్స్
  • డ్యూయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్
  • డ్రైవర్ విండోకు యాంటీపించ్ ఫీచర్‌తో వన్ షాట్ అప్/డౌన్

4. టాటా సియెర్రా అడ్వెంచర్.. (ప్యూర్ ప్లస్ కంటే అదనంగా)

  • 360-డిగ్రీ హెచ్‌డీ ఎస్‌విఎస్ (4సైట్ బ్లైండ్ స్పాట్‌తో)
  • కార్నరింగ్ ఫంక్షన్‌తో ఫ్రంట్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్
  • ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్
  • 17.78 సెం.మీ (7 ఇంచ్​) డిజిటల్ కాక్‌పిట్
  • లెథరెట్ చుట్టిన స్టీరింగ్ వీల్, గేర్ షిఫ్టర్
  • రూఫ్ రైల్స్

5. టాటా సియెర్రా అడ్వెంచర్ ప్లస్.. (అడ్వెంచర్ కంటే అదనంగా)

  • సూపర్‌గ్లైడ్ సస్పెన్షన్ (ఎఫ్​డీడీతో)
  • 31.24 సెం.మీ (12.3 ఇంచ్​) ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్
  • 26 సెం.మీ (10.25 అంగుళాలు) నావిగేషన్‌తో కూడిన డిజిటల్ కాక్‌పిట్
  • టెర్రైన్ మోడ్‌లు (నార్మల్, వెట్ అండ్​ రఫ్) సెలెక్టర్ నాబ్‌తో

6. టాటా సియెర్రా అకంప్లిష్డ్.. (అడ్వెంచర్ ప్లస్ కంటే అదనంగా)

  • లెవల్​ 2 అడాస్​ (అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వార్డ్ కొలిషన్ వార్నింగ్ వంటి 13 ముఖ్య ఫీచర్లతో)
  • హైప్ఏఆర్ హెచ్‌యూడీ
  • డాల్బీ 5.1 విత్ డాల్బీ అట్మాస్
  • 12 జేబీఎల్ బ్లాక్ స్పీకర్లు (సెంట్రల్ స్పీకర్, సబ్‌వూఫర్, సోనిక్‌షాఫ్ట్ సౌండ్‌బార్‌ సహా)

7. టాటా సియెర్రా అకంప్లిష్డ్ ప్లస్.. (అకంప్లిష్డ్ కంటే అదనంగా)

  • హోరిజోన్ వ్యూ ట్రిపుల్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ అనుభవం
  • అడాస్​ లెవల్​2+ (బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ కీప్ అసిస్ట్ వంటి 22 ముఖ్య ఫీచర్లతో)
  • నైట్ సాబర్ బై-ఎల్ఈడీ బూస్టర్ హెడ్‌ల్యాంప్
  • బ్రీత్ఐక్యూ ప్యూరిఫైయర్ (ఏక్యూఐ డిస్‌ప్లేతో)
  • గెశ్చర్ కంట్రోల్‌తో పవర్డ్ టెయిల్‌గేట్
  • మెమరీ, వెల్‌కమ్‌తో 6 వే పవర్డ్ డ్రైవర్ సీట్
  • ఐఆర్‌ఏ కనెక్టెడ్ కార్ సూట్ (73+ ఫీచర్లతో)
  • ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎం
  • అమెజాన్ అలెక్సా
  • ఇన్-బిల్ట్ నావిగేషన్
  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More