గూగుల్ మ్యాప్స్‌లో 4 కొత్త టూల్స్- మీ ప్రయాణం ఇప్పుడు మరింత సులువు!

గూగుల్ మ్యాప్స్‌లో 4 కొత్త టూల్స్ అందుబాటులోకి రానున్నాయి. మీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే విధంగా ఈ టూల్స్​ పనిచేయనున్నాయి. ఏంటివి? ఎలా పనిచేస్తా? వివరంగా ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 24, 2025 5:44 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గూగుల్ మ్యాప్స్ తమ యూజర్ల కోసం మరో నాలుగు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. రోజువారీ ప్రయాణాలు, పండగ సీజన్‌లో ట్రిప్పులను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించారు. ఈ కొత్త అప్‌డేట్స్‌లో జెమినీ ఏఐ ఇంటిగ్రేషన్, మెరుగైన ఈవీ ఛార్జర్ లొకేటర్, రిఫ్రెష్ చేసిన ఎక్స్‌ప్లోరర్ ట్యాబ్, అలాగే స్థానిక వ్యాపారాలకు కొత్త రివ్యూ ఆప్షన్లు వంటివి ఉన్నాయి. ఈ ఫీచర్లలో కొన్ని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటే, మరికొన్ని రాబోయే రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో విడుదల కానున్నాయి.

గూగుల్​ మ్యాప్స్​ కొత్త టూల్స్​ (Pexels)
గూగుల్​ మ్యాప్స్​ కొత్త టూల్స్​ (Pexels)

గూగుల్​ మ్యాప్స్​ జెమినీ ఇంటిగ్రేషన్: స్థానిక సమాచారం కోసం..

జెమినీని ఉపయోగించి రెస్టారెంట్లు, హోటళ్లు, వేదికలు, ఇతర ప్రాంతాల గురించి వివరాలు తెలుసుకోవడానికి గూగుల్​ మ్యాప్స్ ఇప్పుడు యూజర్లకు సహాయం చేస్తుంది. ఆన్‌లైన్ రివ్యూలు, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా "వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన" సూచనలను ఈ టూల్ అందిస్తుంది.

ఆ ప్రాంతంలో పార్కింగ్ ఎలా ఉంటుంది? మెనూలోని వస్తువులు ఏవి వంటి ముఖ్యమైన వివరాలను యూజర్లు తెలుసుకోవచ్చు.

ఏదైనా టిప్‌పై ట్యాప్ చేస్తే, దానికి సంబంధించిన మరింత సందర్భోచిత సమాచారం కనిపిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం అమెరికాలో ఆండ్రాయిడ్, ఐఓఎస్​ యూజర్లకు అందుబాటులోకి వస్తోంది.

యాక్టివిటీ ఐడియాల కోసం 'ఎక్స్‌ప్లోరర్ ట్యాబ్' అప్‌డేట్

చుట్టుపక్కల ప్రాంతాలు, చేయగలిగే కార్యకలాపాలను ‘ఎక్స్‌ప్లోరర్ ట్యాబ్’ ఇప్పుడు మరింత సులువుగా చూపిస్తుంది.

యూజర్లు పైకి స్వైప్ చేయడం ద్వారా ట్రెండింగ్‌లో ఉన్న ప్రాంతాలు, ప్రముఖ రెస్టారెంట్లు, స్థానిక ఆకర్షణలను చూడవచ్చు.

ఈ ట్యాబ్‌లో Lonely Planet, OpenTable, Viator వంటి ప్లాట్‌ఫారమ్‌ల నుంచి, స్థానిక క్రియేటర్లు రూపొందించిన ప్రత్యేక జాబితాలు కూడా ప్రదర్శిస్తారు.

ఈ అప్‌డేట్ ఈ నెలలో ఆండ్రాయిడ్, ఐఓఎస్​ యూజర్ల కోసం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

ఈవీ ఛార్జర్ సమాచారం మెరుగుదల..

2022లో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ టూల్‌ సామర్థ్యం ఇప్పుడు పెరిగింది. యూజర్లు “ఈవీ ఛార్జర్లు” అని సెర్చ్ చేసినప్పుడు, వారు ఆ లొకేషన్‌కు చేరుకునే సమయానికి ఎన్ని ఛార్జర్లు ఖాళీగా ఉండే అవకాశం ఉందో కూడా గూగుల2 మ్యాప్స్ అంచనా వేస్తుంది.

రెస్టారెంట్లలో రద్దీని అంచనా వేసే విధానంలాగే, ఈ సిస్టమ్ కూడా రియల్-టైమ్ డేటా, గత వినియోగ పద్ధతులను కలిపి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో పనిచేస్తుంది.

ఈ ఫీచర్ వచ్చే వారం నుంచి ఆండ్రాయిడ్ ఆటో, గూగుల్ అంతర్నిర్మితంగా ఉన్న వాహనాల్లో అందుబాటులోకి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా త్వరలో విడుదల కానుంది.

పండగ సీజన్ కోసం కొత్త రివ్యూ ఆప్షన్లు

పండగ సమయంలో అభిప్రాయాలను పంచుకునే యూజర్ల కోసం గూగుల్ ప్రత్యేకంగా థీమ్‌తో కూడిన రివ్యూ ప్రొఫైల్‌లను జోడిస్తోంది.

రివ్యూ ఇచ్చేవారు తాత్కాలికంగా పండగ నేపథ్యానికి సంబంధించిన ప్రొఫైల్ చిత్రాన్ని, పేరును ఎంచుకోవచ్చు.

డిస్‌ప్లే పేరు మారినప్పటికీ, రివ్యూలు మాత్రం ఆ యూజర్ గూగుల్ ఖాతాకు లింక్ అయి ఉంటాయి.

అనుమానాస్పద లేదా మోసపూరిత కార్యకలాపాలను నియంత్రించడానికి తమ ఏఐ వ్యవస్థలు రివ్యూలను పర్యవేక్షించడం కొనసాగిస్తాయని గూగుల్ తెలిపింది.

ఈ అప్‌డేట్ ఈ నెలలో ఆండ్రాయిడ్, ఐఓఎస్​ డెస్క్‌టాప్ డివైజ్‌ల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమవుతోంది.

ఈ నాలుగు అప్‌డేట్‌లు, ముఖ్యంగా ఈ రద్దీగా ఉండే పండగ సీజన్‌లో ప్లానింగ్, నావిగేషన్, కొత్త ప్రదేశాలను కనుగొనడంలో మ్యాప్స్‌ను మరింత ఉపయోగకరంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.

News/News/గూగుల్ మ్యాప్స్‌లో 4 కొత్త టూల్స్- మీ ప్రయాణం ఇప్పుడు మరింత సులువు!
News/News/గూగుల్ మ్యాప్స్‌లో 4 కొత్త టూల్స్- మీ ప్రయాణం ఇప్పుడు మరింత సులువు!