సూపర్​ స్టైలిష్​ Tata Sierra ఎస్​యూవీ- రూ. 11.49 లక్షల ధరతో లాంచ్​..

1990వ దశకం నాటి ఐకానిక్​ సియెర్రాకి టాటా మోటార్స్​ మరోసారి జీవం పోసింది! ఈ మేరకు అదిరిపోయే డిజైన్​, అత్యాధునిక ఫీచర్స్​తో 2025 టాటా సియెర్రాను తాజాగా లాంచ్​ చేసింది. ఈ ఎస్​యూవీ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 25, 2025, 13:43:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ ఏడాది మచ్​ అవైటెడ్​ కార్లలో ఒకటైన టాటా సియెర్రాను టాటా మోటార్స్​ మంగళవారం లాంచ్​ చేసింది. ముంబైలోని జియో కన్వెన్షన్​ సెంటర్​ వేదికగా జరిగిన ఈవెంట్ ద్వారా ఈ ఐకానిక్​ ఎస్​యూవీ భారతీయ మార్కెట్​లోకి గ్రాండ్​గా రీ-ఎంట్రీ ఇచ్చింది.

టాటా సియెర్రా ఎస్​యూవీ ఇదిగో..
టాటా సియెర్రా ఎస్​యూవీ ఇదిగో..

'సాంప్రదాయానికి చిహ్నం'

తొలిసారిగా 1991లో భారతీయ రోడ్లపై కనిపించిన ఈ సియెర్రా ఇప్పుడు సరికొత్త అవతారంలో మరోసారి మన ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఇది పెట్రోల్​, డీజిల్​ ఇంజిన్​లతో లాంచ్​ అయ్యింది. రానున్న రోజుల్లో ఈవీ ఆప్షన్​ కూడా అందుబాటులో ఉంటుంది.

"పాత సియెర్రాకు ప్రజల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు దాన్ని ఆధునిక కాలపు అవసరాలకు అనుగుణంగా తిరిగి సృష్టించాం. ఈ కొత్త సియెర్రా బోల్డ్ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంది. ఇది ఎంతో అర్థవంతమైన, ఐకానిక్, ప్రీమియం అనుభూతిని అందిస్తుంది," అని టాటా మోటార్స్​ ఎండీ అండ్​ సీఈఓ సైలేశ్​ చంద్ర తెలిపారు.

ఈ టాటా సియెర్రాను ఏఆర్​జీఓఎస్​​ ఆర్కిటెక్చర్​తో రూపొందించింది టాటా మోటార్స్​. ఏఆర్​జీఓఎస్​​ అంటే.. ఆల్​ టెర్రైన్​ రెడీ, ఓమ్నీ ఎనర్జీ అండ్​ జియోమెట్రీ స్కేలేబుల్​. ఇది ఆల్​-వీల్​ డ్రైవ్​ కంపాటబులిటీ, ఆఫ్​-రోడ్​ పర్ఫార్మెన్స్​, డ్యూరెబులిటీకి పెంచుతుంది.

2025 టాటా సియెర్రా- కీలక ఫీచర్స్​..

టాటా సియెర్రా ఎస్​యూవీలో 4-స్పోక్​ స్టీరింగ్​ వీల్​ ఉంటుంది. ఇదే టాటా కర్వ్​లో కూడా కనిపిస్తుంది. దీని మీద టచ్​ కంట్రోల్స్​. ఇందులో స్నాప్​డ్రాగన్​ చిప్​-5జీ సపోర్ట్​ చేసే ఐఆర్​ఏ కనెక్టెడ్​ టెక్​ ఉంటుంది. దీనికి ఓటీఏ అప్డేట్స్​ లభిస్తాయి.

టాటా సియెర్రాలో 3 స్క్రీన్స్​ ఉంటాయి. అవి.. 12.3 ఇంచ్​ ప్యాసింజర్​ డిస్​ప్లే, 10.5 ఇంచ్​ సెంట్రల్​ స్క్రీన్​, ఒక డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​. సౌండ్​ బార్​తో కూడిన 12 స్పీకర్​ జేబీఎల్​ సెటప్​, డాల్బీ అట్మోస్​, 18 సౌండ్​ మోడ్స్​ దీని సొంతం. ఇందులో హైప్​ఏఆర్​ హెడ్స్​​ అప్​ డిస్​ప్లే, డ్యూయెల్​ జోన్​ క్లైమేట్​ కంట్రోల్​, పానోరమిక్​ సన్​రూఫ్​, మూడ్​ లైటింగ్​, వైర్​లెస్​ ఛార్జింగ్​, రేర్​ సన్​షేడ్స్​, 360 డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి.

2025 టాటా సియెర్రాలో 6 కలర్​ ఆప్షన్స్​..

టాటా సియెర్రా ఎస్​యూవీని 6 రంగుల్లో అందుబాటులోకి​ తెచ్చింది టాటా మోటార్స్​. అవి అండమాన్​ అడ్వెంచర్​, బెంగాల్​ రోగ్​, కూర్గ్​ క్లౌడ్స్​, మింటల్​ గ్రే, మున్నార్​ మిస్ట్​, ప్రెస్టీన్​ వైట్​.

వీటిల్లో అండమాన్​ అడ్వెంచర్​, బెంగాల్​ రోగ్​ రంగులు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.

2025 టాటా సియెర్రా రియల్​ వరల్డ్​ సేఫ్టీ..

2025 టాటా సియెర్రాలో లెవల్​ 2 ఆడాస్​ ప్యాకేజ్​ ఉంటుంది. అంటే, దీనికి 20కిపైగా సేఫ్టీ ఫీచర్స్​ లభిస్తున్నాయి. వీటిల్లో 6 ఎయిర్​బ్యాగ్​లు, పిల్లల కోసం ఐఎస్​ఓఎఫ్​ఐఎక్స్​ టీథర్స్​, 3 పాయింట్​ ఈఎల్​ఆర్​ సీట్​బెల్ట్స్​ వంటివి ఉన్నాయి.

టాటా సియెర్రా ఎస్​యూవీ సేఫ్టీని పరీక్షించేందుకు టాటా మోటార్స్​ రెండు యూనిట్​లను ఒకదానితో ఒకటి క్రాష్​ చేసింది. రియల్​ వరల్డ్​ క్రాష్​ పరిస్థితులను అనుసరిస్తూ ఈ పరీక్ష నిర్వహించింది. ఇలా చేయడం ఇదే తొలిసారి!

ఈ క్రాష్​ టెస్ట్​లో ప్యాసింజర్​ సెల్​కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. క్రాష్​ తర్వాత డోర్లు ఓపెన్​ అయ్యాయి. ఫ్యూయెల్​ సిస్టెమ్​కి ఏం అవ్వలేదు. ఫలితంగా క్రాష్​ తర్వాత మంటలు చెలరేగే అవకాశం లేదు! ప్యాసింజర్లు వేసుకున్న సీట్​ బెల్ట్​లు కూడా దృఢంగా ఉన్నాయి.

టాటా సియెర్రా ఎస్​యూవీలో మూడు ఇంజిన్​ ఆప్షన్స్​..

2025 టాటా సియెర్రాలో 3 ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. అవి 1.5 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేెడ్​ పెట్రోల్​, 1.5 లీటర్​ టర్బోఛార్జ్​డ్​ డైరక్ట్​ ఇంజెక్షన్​ పెట్రోల్​, 1.5 లీటర్​ డీజిల్​.

1.5 లీటర్​ టర్బో- పెట్రోల్​ ఇంజిన్​కి 6 స్పీడ్​ ఆటోమెటిక్​/ మేన్యువల్​ ట్రాన్స్​మిషన్స్​ కనెక్ట్​ చేసి ఉంటాయి. ఇది 160 పీఎస్​ పవర్​ని, 255 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

1.5 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​లో 6 స్పీడ్​ మేన్యువల్​, 7 స్పీడ్​ డీసీఏ ట్రాన్స్​మిషన్​ ఉంటుంది. ఈ యూనిట్​ 106 పీఎస్​ పవర్​, 145 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

ఇక 1.5 లీటర్​ టర్బో డీజిల్​ ఇంజిన్​కి 6 స్పీడ్​ మెన్యువల్​/ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ కనెక్ట్​ చేసి ఉంటాయి. ఇది 118 పీఎస్​ పవర్​, 260/280 (మేన్యువల్​, ఆటోమెటిక్​) ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

టాటా సియెర్రా ఎస్​యూవీ- ధర..

2025 టాటా సియెర్రాను అత్యంత ఆకర్షణీయమైన ధరకు తీసుకొచ్చింది టాటా మోటార్స్​! టాటా సియెర్రా ఇంట్రొడక్టరీ ప్రైజ్​ రూ. 11.49 లక్షలు (ఎక్స్​షోరూం). మహీంద్రా హ్యుందాయ్​ క్రెటా, కియా సెల్టోస్​కి ప్రత్యర్థిగా వచ్చిన ఈ ఎస్​యూవీ బుకింగ్స్​ డిసెంబర్​ 16న మొదలవుతాయి. 2026 జనవరిలో డెలివరీలు ప్రారంభమవుతాయని సంస్థ చెప్పింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More