బడ్జెట్ ధరలో 'హెడ్స్-అప్ డిస్‌ప్లే' ఫీచర్ ఉన్న టాప్ 5 కార్లు ఇవే!
కార్లలోని హెడ్స్- అప్ డిస్‌ప్లే ఫీచర్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. చాలా మంది కస్టమర్లు ఇప్పుడు ఈ ఫీచర్ ఉన్న వాహనాల కోసం వెతుకుతున్నారు. వీరిలో మీరు కూడా ఉంటే ఇది మీకోసమే! ఇండియాలో అఫార్డిబుల్ ధరకు హెచ్యూడీ ఫీచర్‌ని ఇస్తున్న 5 కార్ల వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ఒకప్పుడు అత్యంత ఖరీదైన, అత్యాధునిక టెక్నాలజీ కార్లకు మాత్రమే పరిమితమైన ఫీచర్లలో 'హెడ్స్-అప్ డిస్‌ప్లే' (హెచ్యూడీ) ఒకటి. అయితే ఈ సాంకేతికత ఇప్పుడు సాధారణ భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లోకి కూడా అడుగుపెట్టింది. ఈ హెచ్యూడీ ఫీచర్ వల్ల డ్రైవర్లు రోడ్డుపై దృష్టి మరల్చకుండానే కారు వేగం, మైలేజ్, నావిగేషన్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని చూడవచ్చు. కొందరు దీన్ని స్టైలిష్‌గా భావించినప్పటికీ, సరైన రీతిలో కారులో అమర్చితే, డ్రైవర్‌కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అధిక ధరల శ్రేణిలోకి వెళ్లకుండానే ఈ సౌలభ్యాన్ని కోరుకునే కొనుగోలుదారుల కోసం ఇప్పుడు టయోటా, మారుతీ సుజుకీ వంటి ప్రముఖ సంస్థలు హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ ఎస్‌యూవీలు, క్రాసోవర్‌లలో కూడా ఈ హెచ్యూడీ ఫీచర్‌తో కూడిన వేరియంట్‌లను అందిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ హెడ్స్-అప్ డిస్‌ప్లేతో ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన టాప్ 5 కార్ల వివరాలను ఇక్కడ అందిస్తున్నాము. ఈ మోడల్స్ అన్నీ అధిక ధరల విభాగంలోకి వెళ్లకుండానే ఈ అత్యాధునిక ఫీచర్‌ను పొందుతున్నాయి.
1. మారుతీ సుజుకీ బాలెనో
వేరియంట్: బాలెనో హ్యాచ్‌బ్యాక్‌కి చెందిన ఆల్ఫా వేరియంట్ నుంచి హెడ్స్-అప్ డిస్‌ప్లే లభిస్తుంది.
ధర: దీని ధర రూ. 8.59 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.
ముఖ్య ఫీచర్లు: ఈ వేరియంట్‌లో బయటి భాగంలో ఎల్ఈడీ డీఆర్ఎల్స్ (డేటైమ్ రన్నింగ్ లైట్లు), కొత్త అల్లాయ్ వీల్స్, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. కారు లోపల 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (Arkymys సరౌండ్ సౌండ్‌తో), 360-డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
2. టయోటా గ్లాంజా
వేరియంట్: గ్లాంజా హ్యాచ్‌బ్యాక్‌లో వీ వేరియంట్ నుంచి హెచ్యూడీ ఫీచర్ అందుబాటులో ఉంది.
ధర: దీని ధర రూ. 8.89 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.
ముఖ్య ఫీచర్లు: ఈ వేరియంట్‌లో ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఫాగ్ ల్యాంప్స్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. లోపలి భాగంలో లెదర్ కవర్డ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. 4.19-ఇంచ్ కలర్ టీఎఫ్టీ క్లస్టర్, 9- ఇంచ్ టచ్‌స్క్రీన్, Arkamys సౌండ్ సిస్టమ్ వంటివి స్టీరింగ్ వెనక ఉంటాయి.
3. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్
వేరియంట్: ఫ్రాంక్స్ క్రాసోవర్‌లో ఆల్ఫా వేరియంట్ నుంచి ఈ హెచ్యూడీ ఫీచర్ అందుబాటులో ఉంది.
ధర: దీని ధర రూ. 10.69 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.
ముఖ్య ఫీచర్లు: ఈ ట్రిమ్‌లో లెదర్ స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరా, ఆటో-ఫోల్డ్ ఓఆర్వీఎం, క్రూయిజ్ కంట్రోల్, Arkamys సరౌండ్ సౌండ్ సిస్టమ్‌తో కూడిన 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ వంటి సదుపాయాలు అదనంగా వస్తాయి. ఆల్ఫా వేరియంట్‌లు ప్రత్యేకంగా 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో (స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో) మాత్రమే లభిస్తాయి. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
4. టయోటా అర్బన్ క్రూజర్ టైసర్
వేరియంట్: గ్లాంజా మాదిరిగానే, టైసర్ ఎస్‌యూవీలో కూడా వీ వేరియంట్ నుంచి హెడ్స్ ఆప్ డిస్‌ప్లే ఫీచర్ లభిస్తుంది.
ధర: దీని ధర రూ. 10.63 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.
ముఖ్య ఫీచర్లు: ఈ వేరియంట్‌లో మెషీన్డ్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ రంగులు ఎంచుకునే అవకాశం ఉంటుంది. కారు లోపల లెదర్ స్టీరింగ్ వీల్, Arkamys సౌండ్ సిస్టమ్‌తో కూడిన 9-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. డ్రైవర్ సౌలభ్యం కోసం క్రూయిజ్ కంట్రోల్, టిల్ట్- టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరా ఫీచర్లు అదనంగా లభిస్తాయి. టైసర్ వీ ట్రిమ్ ఫ్రాంక్స్‌లో ఉన్న 1.0-లీటర్ కే-సిరీస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
5. మారుతీ సుజుకీ బ్రెజా
వేరియంట్: బ్రెజా కాంపాక్ట్ ఎస్‌యూవీలో జెడ్ఎక్స్ఐ+ ట్రిమ్ నుంచి హెచ్యూడీ ఫీచర్ యాడ్ అవుతుంది.
ధర: దీని ధర రూ. 11.66 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.
ముఖ్య ఫీచర్లు: ఈ ట్రిమ్‌లో ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్‌లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఫాగ్ ల్యాంప్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. లోపలి భాగంలో లెదర్ కవర్డ్ స్టీరింగ్ వీల్, యాంబియంట్ ఇంటీరియర్ లైటింగ్, గ్లోవ్ బాక్స్ లైటింగ్ వంటి ప్రీమియం అనుభూతిని అందిస్తాయి. ఇది Arkamys సరౌండ్ సౌండ్‌తో కూడిన 9-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్, వెనుక యూఎస్బీ-సీ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్‌లు, 360-డిగ్రీ కెమెరాను కూడా కలిగి ఉంది. బ్రెజా జెడ్ఎక్స్ఐ+ 1.5-లీటర్ కే-సిరీస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్‌తో వస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


