సరికొత్తగా బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీ- మారుతీ సుజుకీ బ్రెజా ఫేస్​లిఫ్ట్​ వివరాలు..

మారుతీ సుజుకీ బ్రెజా ఫేస్​లిఫ్ట్​కి సంబంధించిన టెస్ట్​ మోడల్​ తాజాగా భారత రోడ్డుపై కనిపించింది. డిజైన్, ఫీచర్లలో భారీ మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకండి..

Published on: Nov 19, 2025, 11:00:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో మారుతీ సుజుకీ బ్రెజా ఒకటి. 2016లో లాంచ్ అయినప్పటి నుంచి, ఈ మోడల్ తన స్థానాన్ని పదిలం చేసుకుందనే చెప్పాలి. 2022లో పెద్ద అప్‌డేట్ పొందిన తర్వాత, ఇప్పుడు కంపెనీ డిజైన్‌లో కొన్ని మార్పులు, కొత్త ఫీచర్లతో కూడిన సరికొత్త బ్రెజా వెర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల ఈ మారుతీ సుజుకీ బ్రెజా ఫేస్​లిఫ్ట్​కి సంబంధించిన టెస్ట్ మోడల్​పై కనిపించింది. ఇది రాబోయే మార్పులపై ఒక అంచనాను ఇస్తోంది.

మారుతీ సుజుకీ బ్రెజా
మారుతీ సుజుకీ బ్రెజా

టెస్టింగ్ సమయంలో బ్రెజా అవుక్‌లుక్

కార్ ఇండియా న్యూస్ షేర్ చేసిన ఒక వీడియోలో.. పూర్తిగా క్యామోఫ్లేజ్ చేసిన టెస్ట్ కారు హైవేపై వెళ్తుండగా కనిపించింది. ఈ వీడియోలో కారు వెనుక భాగం, కొంత పక్క భాగం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెనుక బంపర్‌పై నాలుగు పార్కింగ్ సెన్సార్‌లు ఉండటం గమనించవచ్చు. ఎస్‌యూవీ పరిమాణం ప్రస్తుత మోడల్‌ను పోలి ఉన్నట్లు తెలుస్తోంది.

రెండవ తరం మోడల్ మాదిరిగానే, ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కూడా పదునైన కోణంలో ఉన్న వెనుక విండ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. టెయిల్ ల్యాంప్‌లు కూడా పాత డిజైన్‌ను పోలి ఉన్నాయి. అయితే ఈ కారు చాలా వరకు కవర్ చేసి ఉంది కాబట్టి, ఫైనల్​ డిజైన్​ ఇక్కడ కనిపించిన దాని కంటే భిన్నంగా ఉండే అవకాశం ఉంది.

2026 మారుతీ సుజుకీ బ్రెజా- భద్రత, ఫీచర్లలో అప్‌గ్రేడ్ అంచనాలు

ఈ కొత్త అప్‌డేట్‌తో కొత్త తరం మారుతీ సుజుకీ బ్రెజా లోపలి భాగంలో మార్పులు, అలాగే అదనపు ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా, లెవెల్ 2 అడాస్​ భద్రతా ఫీచర్‌ను కూడా ఇందులో చేర్చవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుత రెండొవ తరం బ్రెజా ఇప్పటికే భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్-హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు, రేర్ పార్కింగ్ సెన్సార్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

మారుతీ సుజుకీ బ్రెజా ఇంజిన్ వివరాలు..

ప్రస్తుతం ఉన్న మారుతీ సుజుకీ బ్రెజా రెండు పవర్‌ట్రైన్ ఎంపికలతో అందుబాటులో ఉంది:

1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్: ఇది కే15సీ కోడ్‌నేమ్‌తో ఉన్న నేచురల్లీ ఆస్పిరేటెడ్​ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్. దీన్ని ఎర్టిగా, ఎక్స్‌ఎల్6, విక్టోరీస్ వంటి మోడళ్లతో పంచుకుంటున్నారు.

సీఎన్‌జీ డ్యూయల్-ఫ్యూయల్ ఆప్షన్.

ఈ పెట్రోల్ యూనిట్ 103 హార్స్‌పవర్ పవర్​, 137 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్​ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కనెక్ట్​ చేసి ఉంటుంది. రాబోయే బ్రెజా అప్‌డేట్‌లో కూడా ఈ ఇంజిన్ సెటప్ యథావిధిగా కొనసాగే అవకాశం ఉందని అంచనా.

మారుతీ సుజుకీ బ్రెజా ఫేస్​లిఫ్ట్​ 2026లో లాంచ్​ కానుంది. లాంచ్​కి ముందు ఈ బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీకి సంబంధించిన ఇతర వివరాలు అందుబాటులోకి వస్తాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More